మొన్నటి వరకు కాజల్ కెరీర్ ఖతం అయినట్లే అంటూ వార్తలు వచ్చాయి. తమిళంలో ఆమె ఇండియన్ 2 మినహా మరే సినిమాను చేయడం లేదు అనుకున్నారు. కాని ఇప్పుడు ఒక్కసారిగా ఆమెకు రెండు ఆఫర్లు వచ్చాయి. అది కూడా స్టార్ హీరోల సరసన క్రేజీ ప్రాజెక్ట్‌లలో ఈమెకు ఛాన్స్ దక్కింది. ఈ అమ్మడు ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి ఆచార్య చిత్రంలో నటిస్తున్నట్లుగా ప్రకటించిన విషయం తెల్సిందే. చిత్ర యూనిట్ సభ్యుల నుండి అధికారిక ప్రకటన మాత్రమే రావాల్సి ఉంది.
సోషల్ మీడియా లైవ్‌లో కాజల్ తాను ఆచార్యలో నటిస్తున్నట్లుగా ప్రకటించింది. ఈ సమయంలోనే ఈ అమ్మడు మరో ఆఫర్‌ను కూడా దక్కించుకున్నట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. తమిళంలో స్టార్ హీరో విజయ్‌తో మురుగదాస్ ఒక చిత్రాన్ని చేసేందుకు సిద్దం అవుతున్నాడు. వీరిద్దరి కాంబోలో ఇప్పటికే వచ్చిన సినిమాలు బ్లాక్ బస్టర్ సక్సెస్ అయ్యాయి. కనుక మరోసారి వీరి కాంబోపై అంచనాలు భారీగా ఉన్నాయి.
పైగా వీరిద్దరు కలిసి చేయబోతున్నది తుపాకి సినిమాకు సీక్వెల్ అనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ క్రేజీ కాంబోలో రాబోతున్న సూపర్ హిట్ సీక్వెల్లో హీరోయిన్గా ముద్దుగుమ్మ కాజల్‌ను ఎంపిక చేసినట్లుగా సినీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. విజయ్ సరసన గతంలోనే ఈ అమ్మడు నటించింది. ఇప్పుడు మరోసారి కాజల్‌కు ఛాన్స్ దక్కింది. విజయ్, కాజల్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ అవ్వడం వల్ల మురుగదాస్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లుగా టాక్ వినిపిస్తుంది.
739097 275951Hi. Thank you for producing this internet site . I m working on betting online niche and have found this website employing search on bing . Will be positive to look more of your content material . Gracias , see ya. :S 453472