Jr Ntr: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈనెల 23న పూజా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ముందుగా ఫిబ్రవరి 24వ తేదీన ముహూర్తం ఖరారు చేయగా నందమూరి ఇంట విషాదం చోటు చేసుకోవడంతో ఇది వాయిదా పడింది.
‘ఆర్ఆర్ఆర్’ తర్వాత జూనియర్ కొన్ని చిత్రాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ వాటికి సంబంధించిన పనులేవి మొదలు కాలేదు.
ఇటీవలే ఈ చిత్రంలో నటించబోయే హీరోయిన్ కూడా పరిచయం చేశారు. దివంగత అందాల నటి నటి శ్రీదేవి కుమార్తె జాన్వి కపూర్ ఇందులో హీరోయిన్ గా కనిపించనుంది. ‘ జనతా గ్యారేజ్’ తర్వాత యాక్షన్ డైరెక్టర్ కొరటాల శివ, ఎన్టీఆర్ కలయికలో ఈ చిత్రం రూపొందుతోంది. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా విడుదల చేయనున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్, సుధాకర్ మిక్కిలినేని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి అనిరుద్ సంగీతం అందిస్తున్నారు.