పంచాంగం
శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు ఫాల్గుణ మాసం
సూర్యోదయం: ఉ.6:09
సూర్యాస్తమయం: రా.6:05 ని
తిథి: బహుళ ద్వాదశి ఉ.6:09 వరకు తదుపరి త్రయోదశి
సంస్కృతవారం: భానువాసరః (ఆదివారం )
నక్షత్రము: ధనిష్ఠ రా.8:52 వరకు తదుపరి శతభిషం
యోగం: సిద్ధం రా.7:03 వరకు తదుపరి సాధ్యం
కరణం:తైతుల ఉ.6:09 ని. వరకు తదుపరి గరజి
దుర్ముహూర్తం: సా.4:29 నుండి 5 :17 వరకు
వర్జ్యం : రా.3:36 నుండి తె.5:06 వరకు
రాహుకాలం: సా.4:30 నుండి 6:00 వరకు
యమగండం: మ.12:00 నుండి 1:30 వరకు
గుళికా కాలం : మ.3:23 ని.నుండి 4:53 వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:49 నుండి 5:37 వరకు
అమృతఘడియలు:ఉ.11:11 నుండి మ.12:41 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : మ.12:00 నుండి 12:48 వరకు
ఈరోజు (19-03-2023) రాశి ఫలితాలు
మేషం: కొన్ని వ్యవహారాలలో ఆత్మీయులు సలహాలు తీసుకొన్ని ముందుకు సాగడం మంచిది. చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి అవుతాయి. వృత్తి ఉద్యోగములలో సమస్యలను తెలివితేటలతో అధిగమిస్తారు. అవసరానికి ధన సహాయం అందుతుంది. వ్యాపారాలు ఉన్నతికి చేసిన శ్రమ ఫలిస్తుంది.
వృషభం: చాలా రోజులుగా ఉన్న సమస్యలు తొలగుతాయి. మానసికంగా ప్రశాంతత లభిస్తుంది. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఉద్యోగమున మీ విలువ పెరుగుతుంది. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు లాభాలబాట పడతాయి.
మిథునం: ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలలో నిలకడ లోపిస్తుంది. ఉద్యోగమున అదనపు భాధ్యతలుంటాయి. వృధా ప్రయాణాలు చెయ్యవలసి వస్తుంది. ఇంటాబయటా నూతన సమస్యలు ఉత్పన్నమౌతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. రుణ భారం అధికమౌతుంది.
కర్కాటకం: దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు. సన్నిహితులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ముఖ్యమైన వ్యవహారాలలో స్థిరత్వం లేని ఆలోచనలు వలన నష్టాలుంటాయి. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి.
సింహం: సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు వింటారు. సమాజంలో గౌరవ మర్యాదలకు లోటుండదు ఉద్యోగమున ఆశించిన పురోగతి సాధిస్తారు. ఆర్ధిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన వ్యాపారాలకు మిత్రుల నుండి పెట్టుబడులకు ధన సహాయం అందుతుంది.
కన్య: నూతన వాహనం కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారాల విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. నిరుద్యోగుల కలలు సాకరమౌతాయి ధన వ్యవహారాలు కలసివస్తాయి. మిత్రుల నుండి శుభవార్తలు అందుతాయి.
తుల: దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల ఆగ్రహానికి గురికావలసి వస్తుంది. చేపట్టిన పనులలో జాప్యం తప్పదు. కుటుంబ సభ్యులతో మాట పట్టింపులు ఉంటాయి.
వృశ్చికం: వ్యాపారమున భాగస్థులతో వివాదాలు తొలగుతాయి. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు వలన సకాలంలో పనులు పూర్తి కావు. వృత్తి ఉద్యోగాలలో చిన్నపాటి సమస్యలు ఉంటాయి. బంధువుల నుండి ఊహించని ఒత్తిడి కలుగుతుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శ్రద్ధ వహించాలి.
ధనస్సు: బంధు మిత్రుల నుండి అందిన సమాచారం ఆశ్చర్యం కలిగిస్తుంది. కుటుంబ సభ్యుల సహాయంతో చాలకాలంగా పూర్తి కానీ పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలలో సమస్యలను అధిగమిస్తారు. ఉద్యోగమున వివాదాలు పరిష్కారమౌతాయి తొలగుతాయి. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి. ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి.
మకరం: ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది. ఉద్యోగమున స్థానచలన సూచనలు ఉన్నవి. జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉంటాయి. దైవ చింతన పెరుగుతుంది వృత్తి వ్యాపారాలలో కష్టానికి తగిన ఫలితం లభించదు. చేపట్టిన వ్యవహారాలు సకాలంలో పూర్తికాక చికాకులు పెరుగుతాయి.
కుంభం: ఆర్ధికంగా పురోగతి కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. ఆత్మీయులతో శుభకార్యాలకు హాజరవుతారు. విందు వినోద కార్యక్రమాలకు ఆహ్వానాలు అందుతాయి.
మీనం: బంధువర్గం నుండి ఊహించని మాటలు వినవలసి వస్తుంది. వ్యయ ప్రయాసలతో కానీ పనులు పూర్తికావు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. కొన్ని వ్యవహారాలలో ఆలోచనలలో ఆలోచించి ముందుకు సాగడం మంచిది. కుటుంబ వాతావరణం చికాకుగా ఉంటుంది.
834497 151468I definitely did not realize that. Learnt something new nowadays! Thanks for that. 819357
833759 235712Ill correct away grasp your rss feed as I cant in discovering your email subscription hyperlink or e-newsletter service. Do youve any? Please let me recognize so that I may possibly subscribe. Thanks. 463700