Switch to English

సిగ్గులేని రాత: చంద్రబాబు ప్రభుత్వమేంటి.? జగన్ ప్రభుత్వమేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

చంద్రబాబు హయాంలో.. వైఎస్ జగన్ హయాంలో.. అనాల్సింది పోయి.. చంద్రబాబు ప్రభుత్వం, వైఎస్ జగన్ ప్రభుత్వం.. అనే స్థాయికి జర్నలిజం ఏనాడో దిగజారిపోయింది. తప్పనిసరి పరిస్థితుల్లో అందరూ ఆ విధానాన్నే ఫాలో అవ్వాల్సి వస్తోందనుకోండి.. అది వేరే సంగతి.

చంద్రబాబు నియోజకవర్గంలో ఓ స్కూలుని వైఎస్ జగన్ ప్రభుత్వం తీర్చిదిద్దలేదా.? అంటూ అత్యంత అమాయకంగా ఓ సీనియర్ జర్నలిస్టు ప్రశ్నించేస్తే, అమాయకపు బులుగు కార్మికులు దాన్ని సోషల్ మీడియాలో నిస్సిగ్గుగా ప్రచారం చేసుకుంటున్నారు.

అప్పుడు చంద్రబాబు కావొచ్చు, ఇప్పుడు వైఎస్ జగన్ కావొచ్చు.. తమ తమ పాలనలో ప్రజల కోసం ఏం చేసినా, అది ప్రజల సొమ్ము నుంచి చేసిందే తప్ప, సొంత జేబుల్లోంచి తీసి ఇచ్చింది కానే కాదు. సాధారణ ప్రజానీకానికి ఈ విషయమై స్పష్టత లేదా.? లేదంటే, పచ్చ కార్మికులు అలాగే బులుగు కార్మికులు ప్రజల్ని ఏమార్చుతున్నారా.? అన్నదానిపై చర్చ జరిగి తీరాలి.

చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పం అయినంతమాత్రాన, వైసీపీ అధికారంలో వుంటే.. ఆ కుప్పంలో అభివృద్ధి కార్యక్రమాల్ని చేపట్టకుండా వుండలేదు కదా.? అదే సూత్రం చంద్రబాబు పాలనకీ వర్తిస్తుంది. ఎవరు అధికారంలో వున్నా, ప్రభుత్వ ఖజానా నుంచే అభివృద్ధి, సంక్షేమ పథకాలకు నిధులు వెచ్చించాల్సి వుంటుంది.

ప్రభుత్వాలు అప్పులు చేస్తే, ఆ అప్పులు తీర్చేది ప్రజలే తప్ప చంద్రబాబుగానీ, వైఎస్ జగన్ గానీ తీర్చరు. మరెందుకు ఆయా సంక్షేమ పథకాలకి ఆయా నేతల పేర్లు, ఫొటోలు పెట్టుకుంటారా.? అంటే, అదే ప్రజాస్వామ్యంలో వింత పోకడ. దీన్ని పబ్లిసిటీ పైత్యం అనాలా.? అంతకు మించిన పెద్ద పదం ఇంకేన్నా వాడాలా.?

రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్ని సమానంగా చూడటం అధికారంలో ఎవరున్నా వారు చేయాల్సిన పని. ఆ పని చేసినందుకు ప్రత్యేకమైన భజన ఎందుకు.? మరీ మీడియా ఇంతలా దిగజారిపోవాలా.? పైగా, ఒకప్పుడు చంద్రబాబు భజనలో మునిగి తేలు, ఇప్పుడు బులుగు రంగు ఒంటికి పులుముకున్న ఓ ‘మతిలేని’ సీనియర్ జర్నలిస్టు.. ‘కుప్పంలో వైఎస్ జగన్, స్కూలు తీర్చిదిద్దారు తెలుసా.?’ అంటూ అధికార పార్టీ అనుకూల మీడియాలో కాలమ్ రాయడం దిగజారిపోయిన పాత్రికేయ విలువలకు నిలువెత్తు నిదర్శనం.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

ఎక్కువ చదివినవి

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

స్క్రిప్ట్ చేతిలో వైఎస్ జగన్ ఎందుకు బందీ అయ్యారు.!?

అసలేమయ్యింది వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి.? సుదీర్ఘ పాదయాత్ర చేసిన సమయంలో ఎవరి స్క్రిప్ట్ అవసరం లేకుండానే ప్రసంగాలు చేశారు కదా.? కానీ, ఇప్పుడేమయ్యింది.? స్క్రిప్టు చేతిలో వుంటే తప్ప మాట్లాడలేకపోతున్నారు.. ఆ...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...