వైఎస్ జగన్ తీసుకునే నిర్ణయాలు దారుణంగా ఉంటున్నాయి. ఎప్పుడు ఎవరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో అర్ధం కావడం లేదు. 2024 ఎన్నికల సమయానికి రాష్ట్రంలో సంపూర్ణ మద్యపాన నిషేధం తీసుకొస్తానని మాట ఇచ్చారు. ఒకవేళ అలా చేయకుంటే ఎన్నికల్లో ఓట్లు అడిగేందుకు రానని చెప్పారు. జగన్ మొండిఘటం అనే సంగతి అందరికి తెలుసు. ఒకేసారి ఒకదానివైపు చూశాడు అంటే దాని అంతు తేల్చందే నిద్రపోడు.
ఈ విషయం అందరికి తెలుసు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో మద్యం దుకాణాలను మూసివేశారు. ప్రభుత్వమే అక్కడ మద్యం దుకాణాలు నిర్వహిస్తోంది. అదే విధంగా పర్మిట్ రూమ్ ఫెసిలిటీ కూడా లేకుండా చేశారు. అంతేకాదు, మద్యం ధరలను అధికం చేయడంతో మధ్యం కొనుగోలు తగ్గిపోతుంది అనుకున్నారు.
కానీ, ఒకసారి తాగుడుకు బానిసైన వ్యక్తికి సీసా ధర డబుల్ చేస్తే ఏంటి త్రిబుల్ చేస్తే ఏంటి ఎలాగైనా మందు తాగాలని అనుకుంటాడు తాగుతాడు అంతే. ఆ డబ్బు ఎలాగైతే తీసుకురావొచ్చు. దాని గురించి జగన్ ఆలోచించి ఉంటె బాగుండేది. కేవలం మద్యం నిషేధంపై దృష్టిపెట్టారుగాని, మద్యం కోసం మందుబాబులు డబ్బు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవర్ని హింసించి తెస్తున్నారు అనే విషయాలను పట్టించుకోలేదు.
ఇక ఇప్పుడు జగన్ స్టార్ హోటల్స్ పై కన్నేశాడు. స్టార్ హోటల్స్ లో బార్ లైసెన్స్ ఫీజును ఏకంగా కోటి రూపాయలకు పెంచుతున్నట్టు తెలిపారు. కోటి రూపాయలతో లైసెన్స్ ఫీజు అంటే హోటల్స్ ముందుకు వస్తాయా చెప్పండి. ఛస్తే రావు. స్టార్స్ హోటల్స్ కు కేవలం చాలామంది మందు కొడుతూ ఎంజాయ్ చేయాలనీ వస్తారు.. ఒకవేళ కోటి రూపాయలు లైసెన్స్ ఫీజు చెల్లించి బార్ తీసుకుంటే.. అక్కడ మద్యం రేట్లు ఏ స్థాయిలో పెంచుతారో చెప్పక్కర్లదు.
జగన్ మద్యం లైసెన్స్ ఫీజ్ ను భారీగా పెంచుతున్నట్టు ప్రకటించడంతో కేబినెట్ మంత్రులు సైతం షాక్ అయ్యారు. ఎందుకంటే అక్కడ చాలామంది వైకాపా మంత్రులకు స్టార్స్ హోటల్స్ లో వాటాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళకే కదా నష్టం. జగన్ మాత్రం కోటి ఇవ్వాల్సిందే అంటున్నారు. పాపం ఇక వాళ్లకు కష్టకాలమే మరి.
502090 432712This is some wonderful information. I expect additional facts like this was distributed across the web today. 265545
724947 651556Some genuinely great blog posts on this internet website , regards for contribution. 103675
118562 436406Normally I do not learn post on blogs, nevertheless I would like to say that this write-up very pressured me to look at and do so! Your writing style has been surprised me. Thank you, quite excellent post. 335554
897816 795022whoah this blog is magnificent i enjoy reading your posts. Maintain up the excellent work! You know, lots of individuals are looking around for this info, you could support them greatly. 158060