Switch to English

జగనన్న, చంద్రన్న సరే.. పవనన్న సంగతేంటి.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

చంద్రన్న కానుక అట.! కానీ, చంద్రబాబు జేబులోంచి రూపాయి కూడా ఆ కానుక కోసం వెచ్చించలేదు. ఇప్పుడు జగనన్న దీవెన అట.. కానీ, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జేబులోంచి అర్థ రూపాయి కూడా ఆ దీవెన కోసం ఖర్చు చేయరు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలా కాదు.. సినిమాల్లో నటించడం ద్వారా తాను సంపాదించిన రెమ్యునరేషన్‌లోంచి కొంత భాగాన్ని కౌలు రైతుల కుటుంబాల కోసం వెచ్చిస్తున్నారు. ఆర్థిక ఇబ్బందులతో ప్రాణాలు కోల్పోయిన కౌలు రైతుల కుటుంబాల్ని ఆదుకునేందుకు, ఒక్కో కుటుంబానికీ లక్ష రూపాయలు అందిస్తున్నారు.

దేన్ని చంద్రన్న కానుక అనాలి.? దేన్ని జగనన్న దీవెన అనాలి.? దేన్ని పవనన్న త్యాగం అనాలి.? రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోవాల్సిన సందర్భమిది.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ‘జగనన్న విద్యా దీవెన’ పేరుతో ఓ సంక్షేమ పథకాన్ని అమలు చేస్తోంది. విద్యార్థుల కోసం ప్రభుత్వాలు ఎంత ఖర్చు చేసినా తప్పు పట్టడానికి వీల్లేదు. కానీ, అక్కు పక్షి రాతలెలా వున్నాయో తెలుసా.? ‘జగనన్నే నా ఇద్దరు బిడ్డల్ని చదివిస్తున్నారు..’ అని లబ్దిదారులతో చెప్పించి, తదనుగుణంగా దిక్కుమాలిన రాతలు రాసేలా.

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరుతోనో, వైఎస్ రాజశేఖర్ రెడ్డి పేరుతోనో.. ఆయా సంక్షేమ పథకాల్ని పిలవడం.. ఓ రాజకీయ కోణం.. అదొక పబ్లిసిటీ స్టంట్. అంతే తప్ప, అది వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కష్టార్జితం ద్వారా లబ్దిదారులకు అందే సంక్షేమం కానే కాదు. మరెలా, అది జగనన్న విద్యా కానుక, జగనన్న విద్యా దీవెన అవుతుంది.?

రాష్ట్ర ఖజానా అంటే, అది రాష్ట్ర ప్రజల కష్టార్జితం. ఏ సంక్షేమ పథకం అమలవుతున్నా, రాష్ట్ర ప్రజలు కట్టే పన్నుల ద్వారా నిండే ఖజానా ద్వారా లభించే సౌకర్యమే. దానికి మించి, రాష్ట్ర ప్రజల నెత్తిన అప్పుల భారాన్ని మోపేసి, సంక్షేమ పథకాలు అమలు చేయడమంటే.. జనాన్ని అప్పుల్లో ముంచేసి, ఆ జనాన్ని మభ్యపెట్టి, తమ సొంత పబ్లిసిటీ చేసుకోవడమన్నమాట.

జనానికి ఇవేవీ అర్థం కావన్న భ్రమల్లో రాజకీయ పార్టీలు వుండడం వల్లే ఈ దుస్థితి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

ఎక్కువ చదివినవి

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

Vote: ఓటు గొప్పదనం ఇదే..! ఒక్క ఓటరు కోసం 18కి.మీ అడవి బాట.. ఎక్కడంటే..

Vote: ప్రస్తుతం దేశంలో ఎలక్షన్ (Elections 2024) ఫీవర్ నడుస్తోంది. ఈక్రమంలో మొదటి విడత పోలింగ్ కొన్ని రాష్ట్రాల్లో నిన్న ప్రారంభమైంది. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి.. రాజ్యాంగం కల్పించిన హక్కు...

ఎలక్షన్ కమిషన్ నెక్స్ట్ టార్గెట్ ఏపీ సీఎస్, డీజీపీ!

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలపై కేంద్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించాలన్న ఉద్దేశంతో ఫిర్యాదులు అందిన పలువురు సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను ఇప్పటికే బదిలీ...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

Jithender Reddy: ‘జితేందర్ రెడ్డి’ నుంచి మంగ్లీ పాట.. “లచ్చిమక్క” విడుదల

Jithender Reddy: బాహుబలి, మిర్చి సినిమాలతో నటుడిగా పేరు తెచ్చుకున్న రాకేష్ వర్రె హీరోగా నటించిన సినిమా ‘జితేందర్ రెడ్డి’ (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో ముదుగంటి క్రియేషన్స్ పై ముదుగంటి...