Switch to English

ఐపీఎల్‌ 2020 రివ్యూ: కొంచెం ఇష్టం కొంచెం కష్టం.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

ఐపీఎల్‌ 2020 ఎలా జరుగుతుంది.? అన్న సందేహాలు పటాపంచలయ్యాయి.. కరోనా నేపథ్యంలో వాయిదా పడ్డ ఐపీఎల్‌ 2020, ఇండియాలో కాకుండా యూఏఈలో షురూ అయ్యింది.. రోజులు గడిచిపోతున్నాయ్‌.. మ్యాచ్‌లు జరిగిపోతున్నాయ్‌.. కొన్ని జట్లు అదరగొట్టేస్తున్నాయ్‌.. కొన్ని జట్లు పేలవమైన ప్రదర్శనలిస్తున్నాయి. బౌలర్లు చెలరేగిపోతున్నారు.. బ్యాట్స్‌మెన్‌ అదరగొట్టేస్తున్నారు. ఫీల్డింగ్‌ విన్యాసాలూ దుమ్ము రేపేస్తున్నాయ్‌. కానీ, మైదానంలో క్రికెట్‌ అభిమానుల్లేరు. ఎవరైనాసరే, మ్యాచ్‌ని ఇంట్లోని స్క్రీన్స్‌ మీద చూడాల్సిందే.

గతంలో పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నం. మైదానంలో వేలాదిమంది అభిమానులు, తమ అభిమాన జట్లకు అనుకూలంగా నినాదాలు చేసేవారు.. తమ తమ అభిమాన క్రికెటర్లను ఉత్సాహపరిచేవారు. ఇక, బిగ్‌ స్క్రీన్స్‌ ఎక్కడికక్కడ ఏర్పాటు చేసి, జనానికి ఎంటర్‌టైన్‌మెంట్‌ పంచేది ఐపీఎల్‌. వీటన్నిటికీ తోడుగా పబ్బులు, క్లబ్బుల్లోనూ ప్రత్యేక ప్రదర్శనలుండేవి. ఆ హంగమా అంతా ఇప్పుడు లేదు. గొప్ప విషయం ఏంటంటే, ఐపీఎల్‌ ప్రారంభమయ్యాక ఇప్పటిదాకా ఏ ఆటగాడూ కరోనా బారిన పడకపోవడం.

ఇలాగే ఈ సీజన్‌ అంతా ఎలాంటి కరోనా టెన్షన్లూ లేకుండా సజావుగా సాగాలన్నది సగటు క్రికెట్‌ అభిమాని కోరిక. చాలాకాలం తర్వాత ఎమ్మెస్‌ ధోనీని మైదానంలో చూస్తున్నాం. బ్యాటింగ్‌లో ఫెయిలవుతున్నా, ధోనీ ఓ మ్యాచ్‌లో వరుసగా బాదిన మూడు సిక్సర్లు అభిమానులకి బోల్డంత కిక్‌ ఇచ్చాయి. విరాట్‌ కోహ్లీ నుంచి మెరుపులు చూడాల్సి వుంది. ఆటగాళ్ళ ఆట తీరు సంగతి పక్కన పెడితే, సునీల్‌ గవాస్కర్‌ – కోహ్లీ – అనుష్క శర్మ వివాదం తారాస్థాయికి చేరింది.

మైదానంలో ఆటగాళ్ళు కొంత గాయాలపాలవుతున్నారు. అభిమానుల్లేకపోవడం వల్లేనేమో.. ఆటగాళ్ళు తొందరగా అలసిపోతున్న పరిస్థితిని చూస్తున్నాం. ఓవరాల్‌గా చూసుకుంటే, ఐపీఎల్‌ 2020 క్రికెట్‌ అభిమానులకు కాస్త ఊరటగా వుందే తప్ప.. ఓ స్థాయిలో అలరించేలా లేదని నిస్సందేహంగా చెప్పొచ్చు. నిజానికి, ఇప్పుడున్న ప్రత్యేక పరిస్థితుల్లో ఇదే చాలా ఎక్కువ. అన్‌ లాక్‌ 5 అక్టోబర్‌ 1 నుంచి షురూ కానున్న దరిమిలా, కొత్త వెసులుబాట్లతో ఐపీఎల్‌ అభిమానులకు ఇంకాస్త జోష్‌ వస్తుందేమో వేచి చూడాలిక.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Samantha: పెళ్లి గౌను రీమోడల్ చేయించి ధరించిన సమంత.. పిక్స్ వైరల్

Samantha: సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే సమంత (Samantha) చేసిన ఓ పని చర్చనీయాంశంగా మారింది. ముంబై వేదికగా జరిగిన ‘ఎల్లే సస్టైనబిలిటీ అవార్డుల’...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ:...

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

రాజకీయం

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

ఎక్కువ చదివినవి

నర్సాపురం అసెంబ్లీ గ్రౌండ్ రిపోర్ట్: ఎడ్జ్ జనసేన పార్టీకే.!

2024 ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నర్సాపురం కూడా ఒకింత హాట్ టాపిక్ అవుతున్న నియోజకవర్గమే. నర్సాపురం లోక్ సభ నియోజకవర్గం అలాగే, ఆ పరిధిలోని నర్సాపురం అసెంబ్లీ నియోజకవర్గం.. ఈ...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను హైదరాబాద్ లోని సుదర్శన్ ధియేటర్లో స్పెషల్...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....