Switch to English

ఇన్‌సైడ్‌ స్టోరీ: పేరులో ‘రెడ్డి’ వుంటే సరిపోతుందేమో.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,458FansLike
57,764FollowersFollow

కమ్మ పోయి రెడ్డి వచ్చే డాం డాం డాం.. అంటూ రాష్ట్ర ప్రజానీకం పాటలు పాడుకోవాల్సిన దుస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు మునుపెన్నడూ లేని అసభ్యకరమైన స్థాయికి దిగజారిపోయాయి. చంద్రబాబు హయాంలో అన్ని కీలక పదవులూ ‘కమ్మ’ సామాజిక వర్గానికే దక్కుతున్నాయంటూ అప్పటి ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నానా యాగీ చేసింది. అందులో నిజం లేకపోలేదు. కానీ, అధికారంలోకి వచ్చాక వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఏం చేస్తోంది.? ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన వారిని తొలగించి, ఆ స్థానంలో ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని కూర్చోబెడ్తోంది.

కీలకమైన పదవులకి ‘రెడ్డి’ రిజర్వేషన్‌ వర్తిస్తోంటే, పెద్దగా ప్రాధాన్యత లేని పదవుల్ని మాత్రం ‘వెనుకబడిన వర్గాలు – దళితులు’ అనే కోటాలో పడేస్తూ వైసీపీ ప్రభుత్వం పబ్లిసిటీ స్టంట్లు చేస్తోంది. ‘పేరు చివరన రెడ్డి వుంటే చాలు.. ఏదో ఒక పదవి ఆటోమేటిక్‌గా వచ్చేస్తుంది..’ అన్న అభిప్రాయం బలపడిపోయిందంటే పరిస్థితి ఎంత జుగుప్సాకరంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.

‘అర్హత కలిగి వుంటే’ సామాజిక వర్గం అనేది అడ్డంకి కాదు ఏ పదవికి అయినాసరే. కానీ, ఇక్కడ పరిస్థితి వేరు. యావత్‌ ప్రపంచం కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంటే, ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం మాత్రం, ‘తెరవెనుక వ్యవహారాల్ని’ చక్కబెట్టేస్తుండడం గమనార్హం.

ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ని మార్చాల్సిన అవసరమేమొచ్చింది.? కానీ, మార్చేశారు. ‘కమ్మ’ సామాజిక వర్గానికి చెందిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించి, ఆ స్థానంలో ‘రెడ్డి’ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని వైఎస్‌ జగన్‌ సర్కార్‌ నిర్ణయం తీసుకుందంటూ నిన్న ప్రచారం జరిగింది. చివరి నిమిషంలో చిన్న మార్పు చోటు చేసుకుంది.

సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ, రిటైర్డ్‌ జడ్జిని (రెడ్డి కాదండోయ్‌..) తెరపైకి తెచ్చింది వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. మరోపక్క, ఏపీ డిజిటల్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌గా, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తికి కీలక పదవి జగన్‌ ప్రభుత్వం అప్పగించడం గమనార్హం.

‘అబ్బే, ఇది రెడ్డి కోటా కాదు..’ అని అధికార పార్టీ నేతలు బుకాయించొచ్చుగాక.. కానీ, జరుగుతున్నదేంటో జనానికి అర్థమవుతోంది. పైగా, కరోనా దెబ్బకి విలవిల్లాడుతోంటే, జగన్‌ ప్రభుత్వం ‘నియామకాల’ పేరుతో పండగ చేసుకోవడం హాస్యాస్పదం కాక మరేమిటి.? రోమ్ తగలబడిపోతోంటే, నీరో చక్రవర్తి ఫిడేల్‌ వాయించాడట.. అన్నట్టుంది పరిస్థితి.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

రాజకీయం

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

Viral News: మాజీ క్రికెటర్ పై చిరుత దాడి.. పోరాడి కాపాడిన పెంపుడు శునకం

Viral News: పెంపుడు జంతువులు మనుషులపై ఎంతటి ప్రేమ చూపిస్తాయో తెలిపేందుకు జింబాబ్వేలో జరిగిన ఘటనే నిదర్శనం. జింబాబ్వే (zimbabwe) మాజీ క్రికెటర్ గయ్ విట్టల్ (Guy Whittal) పై చిరుతపులి దాడి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...