Switch to English

వరల్డ్‌ కప్‌ 2019: టీమిండియా ‘వేట’ షురూ!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

అది 20 ఓవర్ల టీ20 కావొచ్చు, 50 ఓవర్ల వన్డే కావొచ్చు.. వరల్డ్‌ కప్‌ పోటీలనగానే, టీమిండియానే హాట్‌ ఫేవరెట్‌గా క్రికెట్‌ ఆడే అన్ని జట్లకూ కన్పిస్తుంది. గత కొంత కాలంగా ‘టైటిల్‌ ఫేవరెట్‌’ హోదాలోనే టీమిండియా వరల్డ్‌ కప్‌ పోటీల్ని ఎదుర్కొంటోంది. కొన్ని పరాజయాలు, మరికొన్ని విజయాలు.. వెరసి, మెగా టోర్నీలో టీమిండియా సత్తా చాటుతూనే వుంది. గతంతో పోల్చితే, ఈసారి టీమిండియాపై మరిన్ని అంచనాలున్నాయి. ‘ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీమిండియానే టైటిల్‌ ఫేవరెట్‌..’ అని దాదాపుగా క్రికెట్‌ ఆడే అన్ని దేశాలూ ఓ అవగాహనకు వచ్చేసి, ముక్త కంఠంతో నినదిస్తున్న వేళ, టీమిండియా టైటిల్‌ వేట మొదలైంది. తొలి ప్రత్యర్థి సౌతాఫ్రికా కావడంతో, సహజంగానే నరాలు తెగే ఉత్కంఠను ఆశిస్తున్నారు క్రికెట్‌ అభిమానులు.

మ్యాచ్‌ గెలుపోటముల సంగతి పక్కన పెడితే, ఈ టోర్నీలో టీమిండియా బలాలు, బలహీనతల గురించి జరుగుతున్న చర్చ అంతా ఇంతా కాదు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌.. ఇలా అన్ని విభాగాల్లోనూ టీమిండియా అత్యంత బలంగా వున్న మాట వాస్తవం. అదే సమయంలో, టీమిండియాకి బలహీనతలు కూడా లేకపోలేదు. అత్యంత సంక్లిష్టమైన మ్యాచ్‌ని సైతం అవలీలగా గెలిచే సత్తా వున్న టీమిండియా, తేలికపాటి మ్యాచ్‌లను చేజార్చుకోవడం అతి పెద్ద బలహీనత. మెరుపు ఫీల్డింగ్‌ చేయగల ఆటగాళ్ళున్నారు, సులభంగా వచ్చే క్యాచ్‌లను వదిలేసే నిర్లక్ష్యమూ వుంది. నిప్పులు చెరిగే బంతులు విసరడమే కాదు, చెత్త బంతులతో మ్యాచ్‌ని ప్రత్యర్థుల చేతుల్లో పెట్టడం కూడా మన బౌలర్లకి బాగా తెలుసు.

ప్రతి జట్టుకీ బలంతోపాటు, బలహీనతలుండడం మామూలే. టీమిండియా ఇందుకు అతీతమేమీ కాదు. ఇక్కడే, టీమిండియా ‘టైటిల్‌ ఫేవరెట్‌’ అనదగ్గ పెర్ఫామెన్స్‌పై దృష్టి పెట్టాల్సి వుంది. నిజానికి టీమిండియాకి కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మాత్రమే కాదు, మహేంద్ర సింగ్‌ ధోనీ కూడా. అవును, టీమిండియాకి ఇద్దరు కెప్టెన్లు వున్నారు. అయితే ఈ ఇద్దరు కెప్టెన్ల మధ్య ఎలాంటి బేధాభిప్రాయాలకూ తావు లేదు. ధోనీ ఇచ్చే సలహాల్ని కోహ్లీ ఎప్పుడూ గౌరవిస్తాడు. కోహ్లీ తనకు ఇచ్చే గౌరవాన్ని ధోనీ ఎప్పుడూ వమ్ము చేయడు. ప్రస్తుతం టీమిండియాకి ధోనీనే పెద్దన్న. సో, అందరూ ధోనీ సూచనల మేరకు, కోహ్లీ కెప్టెన్సీలో సత్తా చాటాల్సి వుంది. మెరుపు వ్యూహాలు రచించడంలో కోహ్లీ – ధోనీ జోడీ ఎప్పటికప్పుడు సత్ఫలితాలు సాధిస్తూనే వుంది. ఈ వరల్డ్‌ కప్‌లో ఈ కమ్యూనికేషన్‌ ఇంకా బెటర్‌గా వుండి తీరాల్సిందే.

కోహ్లీ మ్యాచ్‌ విన్నర్‌, ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. కానీ, కెప్టెన్‌ మీద ఒత్తిడి పెరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఇతర బ్యాట్స్‌మెన్‌ మీద వుంది. తన సహజమైన ఆటతీరు ప్రదర్శించే అవకాశం కోహ్లీకి దక్కుతోందంటే, కెప్టెన్సీ భారాన్ని చాలావరకు ధోనీ తీసేసుకుంటున్నాడు కాబట్టే. అది టీమిండియాకి అదనపు బోనస్‌. ‘వరల్డ్‌ కోసం ప్రత్యేకమైన వ్యూహాలేమీ లేవు. కానీ, ఇక్కడ సమిష్టి కృషి సత్ఫలితాలనిస్తుంది. చిన్న చిన్న పొరపాట్లు ఖరీదైన తప్పిదాలుగా మారిపోతాయి. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ విభాగాల్లో పటిష్టంగా వున్నాం. అలాగే మాకూ కొన్ని బలహీనతలున్నాయి. ఎంత తక్కువ బలహీనతలుంటే, అంత మంచి జట్టుగా మేం మారగలం. అన్నిటికీ మించి, తప్పిదాల్ని తక్కువగా చేసే జట్టు మాత్రమే టైటిల్‌ని ఎగరేసుకుపోతుంది.

సో, మా దృష్టి అతి తక్కువ తప్పిదాల మీదనే వుంది’ అని నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని ఇటీవలే కోహ్లీ కుండబద్దలుగొట్టేశాడు. ఇదివరకటిలా స్వదేశాల్లో పులులు, విదేశాల్లో పిల్లులు.. అనే విమర్శ ఇప్పుడు టీమిండియాపైన లేదు. ఎక్కడన్నాసరే సత్తా చాటగల పూర్తి బలంతో కన్పిస్తోంది టీమిండియా. ముచ్చటగా మూడోసారి వన్డే వరల్డ్‌ కప్‌ని టీమిండియా సొంతం చేసుకోవడానికి పరిస్థితులు అనుకూలంగా కన్పిస్తున్నాయి. మరి, కెప్టెన్‌గా కోహ్లీ ఆ ఘనతని సాధించి పెడతాడా.? వేచి చూడాల్సిందే.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు తెలిపిన చిరంజీవి..

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ ప్రాణకోటిలో మెగాస్టార్ చిరంజీవి కూడా ఉన్నారు....

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ సరికొత్త కథాంశంతో సినిమా నిర్మిస్తోంది....

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...