Switch to English

‘అమ్మకం’ ఐడియా ఎవరిది.. వెన్నుపోటు డౌటెందుకు చెప్మా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,459FansLike
57,764FollowersFollow

వైఎస్ జగన్ సర్కార్ ‘మటన్ మార్ట్’ ఆలోచన చేయడం వివాదాస్పదమయ్యింది. అంతకు ముందే సినిమా టిక్కెట్ల అమ్మకం కోసం ప్రభుత్వ పోర్టల్ రూపొందించేలా తీసుకున్న నిర్ణయమూ వివాదాస్పదమయ్యింది.. వాట్ నాట్.. గడచిన రెండేళ్ళలో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి.. వివాదాస్పదమవుతూనే వున్నాయి. వాటిల్లో కొన్నింటిని న్యాయస్థానాలు కొట్టి పారేశాయి. తీసుకుంటున్న నిర్ణయాలు ఇలా బెడిసి కొడుతోంటే, వైఎస్ జగన్ సర్కార్ ఆత్మ విమర్శ ఎందుకు చేసుకోవడంలేదు.? అన్నదే మిలియన్ డాలర్ల ప్రశ్న.

ప్రభుత్వానికి బోల్డంతమంది సలహాదారులున్నారు. అందులో బలమైన సలహాదారు ఎవరో ప్రభుత్వ పెద్దల్ని తప్పుదోవ పట్టిస్తున్నారనే చర్చ ప్రజానీకంలో జరుగుతోంది. వైసీపీ శ్రేణుల్లో కూడా ఇదే చర్చ జరుగుతోంది. ‘ఇది నిఖార్సయిన వెన్నుపోటు వ్యవహారమే.. ప్రభుత్వ పెద్దలు మాత్రం వాస్తవాన్ని గ్రహించే స్థితిలో లేరు.

రికార్డు స్థాయి మెజార్టీ సాధించాక.. దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. గ్రౌండ్ లెవల్‌లో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. సంక్షేమ పథకాలు ఓట్లు రాల్చుతాయనుకోవడం మూర్ఖత్వం..’ అంటూ ప్రజల్లోనే కాదు.. అధికార పార్టీకి చెందిన కింది స్థాయి నేతలు, కార్యకర్తల్లోనూ చర్చ జరుగుతోంటే, ఆ వ్యవహారం అధిష్టానం దృష్టికి వెళ్ళనీకుండా కొందరు ముఖ్య నేతలు ‘అడ్డుపుల్ల’ వేసేస్తున్నారట.

ఇటు పార్టీ పరంగా, అటు ప్రభుత్వంలో సలహాల పరంగా.. చోటు చేసుకుంటున్న ఈ విపరీత పోకడలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా ఎటువైపు తీసుకెళతాయన్నది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రభుత్వ భూముల్ని అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వస్తోంది.? అదే సమయంలో, ప్రైవేటు వ్యవహారాలైన సినిమాలకు సంబంధించి, మటన్ దుకాణాలకు సంబంధించి.. ఆయా వ్యవహారాల్లో ప్రభుత్వమెందుకు వేలు పెడుతోంది.? ఎక్కడో తేడా కొడుతోంది.

అభివృద్ధి ద్వారా వందల కోట్ల, వేల కోట్ల ఆదాయానికి రాచబాటలు వేయాల్సింది పోయి, ‘చిల్లర పనులు’ చేయాలన్న ‘దుష్ట సలహా’ ఎవరిది.? ఆ సలహా ఇచ్చిన వెన్నుపోటుదారుడెవరు.? అని సోషల్ మీడియా వేదికగా ‘బులుగు కార్మికులే’ ప్రశ్నలు సంధిస్తుండడం గమనార్హం.

5 COMMENTS

  1. మహభారత గాధలో కురుసార్వభౌముడు దుర్యోధనుడుకి వెన్నంటి ఉండి తన సలహాలతో కురువంశాన్ని ఏవిధంగా సర్వనాశనం చేయించాడో ఆ శకుని అదేవిధంగా ఆయన వారసులు కొందరు నేడు తమ సలహాలతో రాష్ట్రం సర్వనాశనం కావడానికి సర్వశక్తులు ప్రయోగిస్తున్నారు. ఇటవంటి దుర్మార్గ సలహాల పీడ ఈ రాష్ట్రానికి ఎప్పటికి విరగడ అవుతుందో?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...

గెలిచాక పార్టీ మారతారట.! ఏపీలో ఇదో కొత్త ట్రెండ్.!

‘మమ్మల్ని గెలిపించండి.. గెలిచాక, ఈ పార్టీలో వుండం. మేం పార్టీ మారతాం.. ఖచ్చితంగా..!’ అంటూ కొందరు అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలు, ఓటర్లకు భలే వినోదాన్ని ఇస్తున్నాయి. అధికార వైసీపీకి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఎక్కువ చదివినవి

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో ఎదురు చూస్తున్నారు. నేడు ఆమె పుట్టినరోజు...

ఉప్మాకి అమ్ముడుపోవద్దు: పవన్ కళ్యాణ్ స్ట్రాంగ్ వార్నింగ్.!

ఇది మామూలు వార్నింగ్ కాదు.! చాలా చాలా స్ట్రాంగ్ వార్నింగ్.! అయితే, ఆ హెచ్చరిక ఎవర్ని ఉద్దేశించి.? ఉప్మాకి అమ్ముడుపోయేటోళ్ళు రాజకీయాల్లో ఎవరుంటారు.? ఉప్మాకి అమ్ముడుపోవద్దని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎవర్ని...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్ తేజ్

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన (Janasena) గెలుపుకు తన వంతు కృషి...

Chiranjeevi: పిఠాపురంలో చిరంజీవి ప్రచారానికి వస్తారా..?!

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ రాజకీయాలు వేసవి ఎండలకుమల్లే రోజురోజుకీ హీటెక్కిపోతున్నాయి. పార్టీలన్నీ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఈక్రమంలో రాజకీయాల్లో మిక్స్ అయ్యే సినీ గ్లామర్ ఈసారీ కనిపిస్తోంది. ఎన్నికల సమయంలో...