Switch to English

అఘాయిత్యాలపై ‘ఆర్థిక సాయం’ అస్త్రంగా పనిచేస్తుందా.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,429FansLike
57,764FollowersFollow

మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. నెలల వయసున్న చిన్నారి నుంచి, కాటికి కాలు చాపిన వృద్ధురాలి వరకు.. ఎవర్నీ మృగాళ్ళు వదిలిపెట్టడంలేదు. ఎందుకీ పరిస్థితి.? ఇది ఓ రాష్ట్రానికి పరిమితమైన సమస్య కాదు. దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇదే పరిస్థితి.

నిర్భయ పేరుతో చట్టం వచ్చింది.. దిశ పేరుతో పబ్లిసిటీ స్టంట్లు జరుగుతున్నాయి.. ‘తక్షణ న్యాయం’ పేరుతో ఎన్‌కౌంటర్లు కూడా జరిగాయి.. అయినాగానీ, పరిస్థితిలో మార్పు కనిపించడంలేదు. నేరానికి శిక్ష పడాలి.. అదీ చట్టబద్ధంగా. కానీ, అదే జరగడంలేదన్న ఆవేదన చాలామందిలో వుంది.

నిజమే.. ఆయా కేసుల విచారణ ఏళ్ళ తరబడి సాగుతోంది. నిర్భయ ఘటననే తీసుకుంటే.. బాధితురాలు కొన్నిరోజులపాటు నరకయాతన భరించి చివరికి ప్రాణాలు విడిచింది. కానీ, నిందితులకి ఎప్పుడు శిక్ష పడింది.? పదే పదే నాటకాలాడారు శిక్ష తప్పించుకోవడానికి మృగాళ్ళు.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే, ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో వరుస ఘటనలు జరుగుతున్నాయి. తెలంగాణలోనూ తక్కువేమీ కాదు. తెలంగాణతో పోల్చితే, ఏపీలో రాజకీయ రాద్ధాంతం ఎక్కువైపోయింది. బాధిత కుటుంబాన్ని పరామర్శించేందుకు విపక్షాలకు అధికారపక్షం అవకాశమే ఇవ్వడంలేదు. కోవిడ్ పేరుతో పోలీసు శాఖ పెడుతోన్న ఆంక్షలు అదనం. బాధిత కుటుంబాన్ని తన వద్దకు పిలిపించుకుని ముఖ్యమంత్రి ఓదార్చుతున్న పరిస్థితుల్ని చూస్తున్నాం.

‘ఆర్థిక సాయం అందించేశాం.. బాధిత కుటుంబానికి న్యాయం చేసేశాం..’ అంటోంది ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీ. కానీ, న్యాయం జరిగిందెక్కడ.? దోషులకు శిక్ష పడిందెక్కడ.? అన్న ప్రశ్న విపక్షాల నుంచి దూసుకొస్తోంది. తెలంగాణలో కొద్ది రోజుల క్రితమే ఓ చిన్నారిపై అఘాయిత్యం జరిగింది. ఆ ఘటన కంటే మీడియాకి సినీ నటుడు సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన ఘటన ఎక్కువ ‘ఎట్రాక్ట్’ చేయడం గమనార్హం.

చిన్నారిపై అఘాయిత్యం ఘటనను సైడ్ లైన్ చేయడానికి మీడియానే ఇంతలా కక్కుర్తి పడిందా.? అన్న వాదనా లేకపోలేదు. ఏం చేస్తే ఈ అఘాయిత్యాలు ఆగుతాయి.? ఇదొక సమాధానం లేని ప్రశ్నగా మారిపోయింది. ఆర్థిక సాయం చేయడం కాదు.. రాజకీయ పరామర్శలు, రాజకీయ ఓదార్పులు కాదు.. నేరానికి శిక్ష పడాలి. కానీ, అదే జరగడంలేదు. ఎందుకీ దుస్థితి.? ఎవరిది పాపం.?

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rashmika: ముంబై బ్రిడ్జి ప్రయాణంపై రష్మిక పోస్టు.. నెటిజన్స్ ట్రోలింగ్స్

Rashmika: ముంబైలో ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన ‘ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్’ (MTHL)పై నేషనల్ క్రష్ రష్మిక (Rashmika) మందన ప్రయాణించి తన అనుభూతిని పంచుకున్నారు. మీడియాలో...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్...

Telangana: తెలంగాణలో 2వారాలపాటు సినిమాలు బంద్..! కారణాలివే..

Telangana: ప్రస్తుత రోజుల్లో ధియేటర్లలో సినిమా నడవడమే కష్టమవుతోంది. బాగున్న సినిమా.. పెద్ద సినిమా.. చిన్న సినిమాగా లెక్కలు మారిపోయాయి. విడుదలైన కొద్దిరోజుల్లోనే ఓటీటీల్లో రావడం.....

‘రామ జన్మభూమి’ తో సీనియర్‌ స్టార్‌ డైరెక్టర్‌ రీ ఎంట్రీ

సినీ ప్రేక్షకులకు ఎన్నో సూపర్‌ హిట్ సినిమాలను అందించిన సీనియర్ దర్శకుడు సముద్ర ఈ మధ్య కాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారు. ఆయన నుంచి...

Chiranjeevi : అసెంబ్లీలో వాళ్ల భాష విని షాక్ అయ్యాను :...

Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్‌ అందుకున్న నేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. చిరంజీవిని సన్మానించిన కిషన్ రెడ్డి...

రాజకీయం

బాబూ.. రాంబాబూ.! రీపోలింగ్ కావాలా.?

మంత్రి అంబటి రాంబాబుకి రీ-పోలింగ్ కావాలట.! ఎంత కష్టమొచ్చింది.? రీ-పోలింగ్ అడుగుతున్నారంటే, ఓటమిని ముందే ఒప్పుకున్నట్లు కదా.? పోలింగ్ సరళి చూశాక ‘సంబరాల’ రాంబాబుకి మైండ్ బ్లాంక్ అయ్యిందని, సత్తెనపల్లి నియోజకవర్గ ప్రజలే...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

వైసీపీ కొంప ముంచేసిన ‘నాడు – నేడు’.!

రాష్ట్ర వ్యాప్తంగా ‘నాడు - నేడు’ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ స్కూళ్ళలో అత్యద్భుతమైన అభివృద్ధి చూపించామని వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెబుతూ వచ్చారు. వైసీపీ...

ఎమ్మెల్యే చెంప పగలగొట్టిన సామాన్యుడికి ‘కులాన్ని’ ఆపాదిస్తారా.?

ఎమ్మెల్యేని ఓ సామాన్యుడు దూషించాడట.! దాంతో, ఎమ్మెల్యేకి కోపమొచ్చిందట. అయినాగానీ, శాంతంగానే వున్నాడట ఆయన. సదరు సామాన్యుడే, కులోన్మాదంతో సదరు ఎమ్మెల్యే చెంప పగలగొట్టేశాడట. తీవ్రంగా దాడి చేశాడట. దాడిలో గాయపడి ఆసుపత్రి పాలయ్యింది...

పాపం రోజా.! ఓటమి ఖాయమైనట్టే కనిపిస్తోంది.!

అంతా అనుకున్నట్టే జరుగుతోంది. రోజా భయపడ్డట్టే జరుగుతోంది నగిరిలో.! రోజాకి శతృవులు టీడీపీలోనో, ఇంకో పార్టీలోనో లేరు.. సాక్షాత్తూ సొంత పార్టీలోనే రోజాకి శతృవులున్నారన్న విషయం ఇంకోసారి స్పష్టమైంది. ‘నాకు టీడీపీతో ఇబ్బంది లేదు.....

ఎక్కువ చదివినవి

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...

Allu Shirish : ఎట్టకేలకు అల్లు శిరీష్ అప్‌డేట్‌ తో వచ్చాడు

Allu Shirish : అల్లు శిరీష్ హీరోగా గాయత్రి భరద్వాజ్ హీరోయిన్‌ గా శామ్‌ ఆంటోనీ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'బడ్డీ'. స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌ పై కేఈ జ్ఞానవేల్‌ రాజా,...

ఓట్ల కోసం కరెన్సీ నోట్లు.! విడతలవారీగా పంపిణీ.!

పిఠాపురం నియోజకవర్గమది.! ఇప్పటికే ఓట్ల కోసం తొలి విడతలో కరెన్సీ పంపిణీ పూర్తయిపోయింది.! రెండో విడత కూడా షురూ అయ్యింది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ని ఎలాగైనా ఓడించాలన్న కోణంలో, ఓ పెద్ద...

ట్రోలింగ్ కంటెంట్: జగన్ ఇంటర్వ్యూతో వైసీపీకే నష్టం.!

మద్రాసు ఎలా చెన్నయ్ అయ్యిందో తెలుసా.? పోర్టు వల్లనే.! ముంబై ఎందుకు ముంబై అయ్యిందో తెలుసా.? అది కూడా పోర్టు వల్లనే.! ఆంధ్ర ప్రదేశ్‌లోనూ పోర్టులు కడుతున్నాం.. కాబట్టి, ఆయా పోర్టులున్న ప్రాంతాలు...

వైసీపీ గెలిస్తే, ఏపీకి కేసీయార్ పారిపోతారా.?

అసలు తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకి ‘సమాచారం’ ఎవరు ఇస్తున్నట్లు.? ‘మాకున్న సమాచారం మేరకు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో మళ్ళీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డే ముఖ్యమంత్రి అవుతారు..’ అని...