గోరంట్ల లీక్స్.. అంటూ సోషల్ మీడియాలో హిందూపూర్ ‘యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ’ ఎంపీ గోరంట్ల మాధవ్‌కి సంబంధించిన ఓ వీడియో హల్‌చల్ చేస్తున్న విషయం విదితమే. మార్పింగ్ వీడియో అంటున్నారు గోరంట్ల.. సైబర్ క్రైమ్ పోలీసులకూ ఫిర్యాదు చేశారట ఈ విషయమై.! మంచిదే, ఓ ప్రజా ప్రతినిథికి సంబంధించిన న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడమంటే చిన్న విషయం కాదు. దోషులెవరో పట్టుకుని శిక్షించాల్సిందే.!
కానీ, ఇక్కడ వ్యవహారం కాస్త తేడాగా కనిపిస్తోందన్నది హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలోనే స్థానికంగా జరుగుతున్న రచ్చ. హిందూపురం లోక్ సభ నియోజకవర్గ పరిధిలో.. అందునా, హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని వైసీపీ నేతల్లో గత కొంతకాలంగా ఆధిపత్య పోరు నడుస్తోంది. ఈ మొత్తం ఆధిపత్య పోరు వెనుకాల గోరంట్ల మాధవ్ హస్తం వుందంటూ. పంచాయితీని అధిష్టానం దృష్టికి కూడా తీసుకెళ్ళారు హిందూపురం వైసీపీ నేతలు కొన్నాళ్ళ క్రితం.
ఈ నేపథ్యంలో ఎంపీ గోరంట్ల మాధవ్‌దిగా చెప్పబడుతున్న న్యూడ్ వీడియో క్లిప్ వెనుకాల, ఆ హిందూపురం వైసీపీ నేతలే లేరన్న గ్యారంటీ ఏంటి.? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తెలుగుదేశం పార్టీనో, జనసేన పార్టీనో వుందంటూ వైసీపీకి చెందిన కొందరు నేతలు రాజకీయ విమర్శలు చేయొచ్చుగాక. వైసీపీ సోషల్ మీడియా విభాగం కూడా ఈ తరహా అడ్డగోలు ఆరోపణలు చేయొచ్చుగాక.!
కానీ, హిందూపురం లోక్‌సభ నియోజకవర్గంలో వైసీపీ అంతర్గత పోరు గురించి తెలిసినవారెవరైనా.. వాళ్ళు వైసీపీ మద్దతుదారులైనాసరే, ఈ లీకు వెనుక వైసీపీ నేతల హస్తం వుండే వుంటుందనే అనుమానాలు వ్యక్తం చేయడాన్ని ఎలా తప్పు పట్టగలం.?
గతంలో అవంతి శ్రీనివాస్ విషయంలోనూ సొంత పార్టీ నేతలపై అనుమానాలు వచ్చాయి. అంబటి రాంబాబుకి మంత్రి పదవి రాకుండా వైసీపీ నేతలే ఆయనకు సంబంధించిన ఆడియో టేపుల్ని లీక్ చేశారన్న ప్రచారమూ జరిగింది. ఆయా ఘటనల్లో ఆయా నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేసినా, ‘లీకు వీరుల్ని’ గుర్తించలేకపోయారంటే, దానర్థమేంటి.?