Switch to English

‘ఖద్దరు’ కనుసన్నల్లో ‘ఖాకీ’.! ఏపీలో అసలేం జరుగుతోంది.?

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

చంద్రబాబు హయాంలో ‘అధికార పార్టీకి ఖాకీలు వంత పాడుతున్నారు’ అనే విమర్శలు విన్పించాయి. ఇప్పుడు కూడా అవే వ్యాఖ్యలు విన్పిస్తున్నాయి. చిన్న తేడా ఏంటంటే.. అప్పుడు చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం. పోలీసులపై విమర్శలు మాత్రం సేమ్ టు సేమ్. ఎందుకిలా.? తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్‌ స్టేషన్‌లో ఓ దళిత యువకుడికి గుండు కొట్టించేశారు. ఈ ఘటనలో ఎస్‌ఐ మీద చర్యలు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఘటనపై విచారణ చేయిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వైసీపీ నేతల అత్యుత్సాహమే ఈ ఘటనకు కారణమని బాధితులు ఆరోపిస్తుండడం గమనార్హం.

ఇక, తూర్పుగోదావరి జిల్లాకి చెందిన ఓ న్యాయవాదిని పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ ఘటనపై న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘అర్థరాత్రి ఓ లాయర్‌ని అరెస్ట్‌ చేయాల్సిన అవసరమేంటి.? ఓ న్యాయవాదికే ఈ పరిస్థితి అంటే, సామాన్యుడి పరిస్థితి ఏంటి.?’ అంటూ జిల్లా ఎస్పీని న్యాయస్థానం చెడామడా వాయించేసిందట. ‘ఖాకీ ధరిస్తే ప్రజలకు భద్రత కల్పించాల్సిందే.. చట్టం ప్రకారం వ్యవహరించాల్సిందే. ఖద్దరు ధరించాలనుకుంటే ఖాకీని వదిలెయ్యండి..’ అని న్యాయస్థానం తీవ్ర వ్యాఖ్యలు చేసిందంటూ వార్తా కథనాలు కన్పిస్తున్నాయి.

మొన్నటికి మొన్న అక్రమ మద్యం కేసుల్లో పట్టుబడిన వాహనాలకు సంబంధించి రాష్ట్ర డీజీపిని పిలిపించి న్యాయస్థానం చురకలంటించిన విషయం విదితమే. అంతకు ముందు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు విశాఖ పర్యటన విషయంలో పోలీస్‌ ఉన్నతాధికారులు అత్యుత్సాహం చూపడంపైనా న్యాయస్థానం తలంటుపోసేసింది. పోలీసులే అనుమతిచ్చి, ఆ పోలీసులే చంద్రబాబుని అరెస్ట్‌ చేయడం అప్పట్లో పెను దుమారం రేపింది. చంద్రబాబు హయాంలోనూ పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరించినా.. మరీ ఈ స్థాయిలో పోలీసులు, ప్రతిసారీ న్యాయస్థానం ముందు తల దించుకుని నిల్చోవాల్సిన పరిస్థితి రాలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

‘ఇదంతా విపక్షాల కుట్ర..’ అని అధికార పార్టీ కొట్టి పారేయొచ్చుగాక. న్యాయస్థానాల మీదా తీవ్రమైన వ్యాఖ్యలు అధికార పార్టీ నేతలు, మద్దతుదారులు చేయొచ్చుగాక.! కానీ, గ్రౌండ్‌ లెవల్‌లో పరిస్థితులు ఎలా వున్నాయో అధికార పార్టీ నేతలకీ తెలుసు. ఐదేళ్ళ కోసారి అధికారంలో వుండే పార్టీలు మారొచ్చు.. కానీ, పోలీసులు అలా కాదు. ఇక్కడ పోలీసుల్నీ గట్టిగా ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే, వారిపై వుండే రాజకీయ ఒత్తిళ్ళు అలాంటివి.. అంటారో ఓ రాజకీయ విశ్లేషకుడు. ఏదిఏమైనా, ఖాకీని ఖద్దరు తన కనుసన్నల్లో నడిపించాలనుకోవడం వల్లే పోలీస్‌ వ్యవస్థకు ఈ దుస్థితి అన్న ప్రజాస్వామ్యవాదుల అభిప్రాయాన్ని తేలిగ్గా కొట్టిపారేయలేం కదా.!

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

Jithender Reddy: యాక్షన్ ప్రధానంగా ‘జితేందర్ రెడ్డి’.. ట్రైలర్ విడుదల

Jithender Reddy: బాహుబలి, ఎవరికి చెప్పొద్దు.. సినిమాలతో నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ వర్రె ప్రధాన పాత్రలో నటించిన సినిమా 'జితేందర్ రెడ్డి' (Jithender Reddy). విరించి వర్మ దర్శకత్వంలో పొలిటికల్ డ్రామాగా...

పెన్షన్లు.. మరణాలు.. శవ రాజకీయాలు.!

తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్‌లోనూ ఎండలు మండిపోతున్నాయి. తెలంగాణలోనూ సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి.. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కూడా సామాజిక పెన్షన్లు లబ్దిదారులకు అందుతున్నాయి. తెలంగాణలోనూ ఎన్నికల కోడ్ అమల్లో...

Chiranjeevi: ఓ లిస్టు తయారు చేసా.. అందులో చిరంజీవి పేరు రాశా: దర్శకుడు వంశీ

Chiranjeevi: చిరంజీవి (Chiranjeevi) మెగాస్టార్ గా మారక ముందు.. కళాత్మక దర్శకుడిగా వంశీ (Vamsi) పేరు తెచ్చుకోకముందు వారిద్దరి కాంబినేషన్లో వచ్చిన సినిమా ‘మంచుపల్లకి’. వంశీకి దర్శకుడిగా తొలి సినిమా. సితార సినిమా...

కూటమి మేనిఫెస్టోతో కుదేలవుతున్న వైఎస్సార్సీపీ.!

ఎన్నికల్లో రాజకీయ పార్టీలు విడుదల చేసే మేనిఫెస్టోలకి జనంలో ఒకింత ఆసక్తి వుండడం సహజం. కేవలం మేనిఫెస్టోల వల్లనే రాజకీయ పార్టీలు గెలిచేస్తాయని అనడమూ సబబు కాదు.! ఎన్నికల వేళ ఓటరు, అనేక...