తెలుగులో ఇప్పటికే విజయవంతంగా మూడు సీజన్స్ టెలికాస్ట్ అయిన బిగ్‌బాస్ నాల్గవ సీజన్‌కు కరోనా అడ్డు వచ్చింది. కరోనా కారణంగా కాస్త ఆలస్యంగా తెలుగు బిగ్‌బాస్ సీజన్ 4ను ప్రారంభించేందుకు సిద్దం అవుతున్నారు. ఇప్పటికే నిర్వాహకులు కంటెస్టెంట్స్ షార్ట్ లిస్ట్ చేసినట్లుగా సమాచారం అందుతోంది. ఈసారి హీరోయిన్స్ కు ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చినట్లుగా మొదటి నుండి వార్తలు వస్తున్నాయి. గ్లామర్ అద్దాలనే ఉద్దేశ్యంతో ఈ పని చేశారట.
కంటెస్టెంట్స్ లిస్ట్ దాదాపుగా పూర్తి అయ్యిందంటున్నారు. ఇటీవలే మోనాల్ గజ్జర్ ను నిర్వాహకులు ఎంపిక చేశారని తెలుస్తోంది. అల్లరి నరేష్ నటించిన సుడిగాడు చిత్రంలో నటించిన ఈమె ఆ తర్వాత పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో కనుమరుగయ్యింది. ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా మళ్లీ ప్రేక్షకుత ముందుకు వచ్చే అవకాశంను దక్కించుకుంది. తెతుగు బాగా మాట్లాడటం వచ్చిన కారణంగా ఈ అమ్మడిని ఎంపిక చేసినట్లుగా టాక్ వినిపిస్తుంది.
బిగ్ బాస్ షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి ప్రారంభించే అవకాశం ఉందని తెలుస్తోంది. కంటెస్టెంట్స్ విషయంలో తుది నిర్ణయం వచ్చిన నేపథ్యంలో ఏర్పాట్లు మొదలయ్యాయంటూ తెలుస్తోంది. మూడవ సీజన్ తో హోస్ట్ గా ఆకట్టుకున్న నాగార్జున మళ్లీ ఈ సీజన్ కు కూడా హోస్టింగ్ చేస్తాడని తెలుస్తోంది. వచ్చే నెలలో సీజన్ 4 కు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
645475 407443Hi, you used to write exceptional articles, but the last several posts have been kinda boring I miss your super writing. Past several posts are just a little out of track! 252625
557190 487726I truly enjoy examining on this website , it has very good content material . 446505