సినిమా సినిమాకు వివాదాలు ఎలా కొత్తగా క్రియేట్ చేస్తుంటాడో అలాగే సినిమా సినిమాకి సరికొత్త హీరోయిన్స్ ని పరిచయం చేస్తుంటాడు రామ్ గోపాల్ వర్మ. ఎక్కువగా ముంబై అమ్మాయిలని పరిచయం చేసే ఆర్జీవీ అప్పుడప్పుడు టాలెంటెడ్ తెలుగమ్మాయిలను కూడా పరిచయం చేస్తుంటాడు. తాజాగా ఆ జాబితాలో చేరిన హీరోయిన్ దక్షి గుత్తికొండ. లాక్ డౌన్ టైములో ఆర్జీవీ చేసిన కరోనా వైరస్ సినిమాతో దక్షి ఇండియా వైడ్ హీరోయిన్ గా పరిచయం కానుంది.
ఇటీవలే దక్షి రిలీజ్ చేసిన హాట్ ఫోటోషూట్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ఇది పక్కన పెడితే, దక్షి గుత్తికొండ ఒక్క ఆర్జీవీ సినిమాలోనే కాకుండా పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ని కూడా ఫినిష్ చేసింది. ‘ఏ ఫిల్మ్ బై అరవింద్’ లాంటి సినిమా చేసిన టాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ సూరి డైరెక్షన్ లో అమెజాన్ ప్రైమ్ కోసం చేసిన వెబ్ సీరీస్ లో దక్షి హీరోయిన్ గా నటించింది. అలాగే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ‘రాయదుర్గం’ అనే ఓ సినిమాలో కూడా నటించింది.
వెబ్ ప్రాజెక్ట్స్ అయిన ఆర్జీవీ సినిమా ‘కరోనా వైరస్’ మరియు శేఖర్ సూరి వెబ్ సీరీస్ లు ఆన్ లైన్ ద్వారా రిలీజ్ కానున్నాయి. ఈ రెండు రిలీజైతే తన నాటికి గుర్తింపు వచ్చి, ఇంకా మంచి అవకాశాలు తనకి వస్తాయని దక్షి చాలా నమ్మకంగా ఉంది. మరి తెలుగమ్మాయి దక్షి ఇంకా మంచి ఆఫర్స్ చేజిక్కించుకొని స్టార్ గా ఎదగాలని తెలుగుబులెటిన్.కామ్ తరపున ఆల్ ది బెస్ట్ చెబుతున్నాం.
844777 914551Couldn?t be created any much better. Reading this post reminds me of my old room mate! He always kept talking about this. I will forward this report to him. Pretty certain he will possess a good read. Thanks for sharing! 167379
722041 192768Some actually good articles on this website , thankyou for contribution. 642779