Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: నవీన్ చంద్ర – రామకృష్ణ ఎంటర్టైన్ చేయడమే కాదు ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాడు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

‘అందాల రాక్షసి’తో హీరోగా పరిచయమై రీసెంట్ గా అరవింద సమేత, ఎవరు సినిమాలలో తన పాత్రతో ప్రేక్షకులను మెప్పించాడు యంగ్ హీరో నవీన్ చంద్ర. లాక్ డౌన్ కారణంగా పలు చిన్న సినిమాలు ఓటిటి ప్లేట్ ఫామ్ లో రిలీజ్ అవుతున్నాయి. అందులో భాగంగా నవీన్ చంద్ర – సలోనీ లుథ్రా జంటగా నటించిన ‘భానుమతి రామకృష్ణ’ సినిమా జులై 3న ఆహాలో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నవీన్ చంద్రతో ఎక్స్ క్లూజివ్ గా చేసిన ఇంటర్వ్యూ మీకోసం..

ప్రశ్న. లాక్ డౌన్ సమయంలో ఇంట్లోనే ఉండిపోవడం ఎలా అనిపించింది? అలాగే ఈ లాక్ డౌన్ వల్ల కొత్తగా ఏం నేర్చుకున్నారు?

స. స్వతహాగానే నేను సోలోగా ఉండటానికి, సోలో ట్రావెలింగ్ కి, ఎక్కువ సోషలైజ్ లైఫ్ లేకుండా ఉండటానికి ఇష్టపడతాను. కాబట్టి నాకు లాక్ డౌన్ అనేది పెద్ద ఇబ్బందిగా అనిపించలేదు. ఈ లాక్ డౌన్ టైం మొత్తం నేను, నా పెట్ డాగ్ మాత్రమే ఉన్నాం. కరోనా ఏం నేర్పించింది అంటే నాకే కాదు చాలా మందికి కేలీన్ గా ఉండాలనేది నేర్పించింది. కరోనా వల్ల ఇప్పుడు ఎక్కడికి వెళ్లినా చాలా క్లీన్ గా ఉంటోంది. కరోనాని పక్కన పెడితే ఇలానే మనం ఉండగలితే రేపు కరోనా కాదు, ఏది వచ్చినా పేస్ చేయచ్చు. అలాగే ఆ పాండెమిక్ అనేది నేచర్ రీబూట్ లా ఫీలవుతున్నాను. మనిషి ఇంత అడ్వాన్స్ అయినా దీనికి ఇంకా మందు కనిపెట్టలేకపోతున్నాం, అందుకే ప్రకృతే తనని తాను రీబూట్ చేసుకోవడానైకి ఈ వైరస్ సృష్టించిందా అనిపిస్తుంటుంది.

ప్రశ్న. థియేటర్స్ మిస్ చేసి, ‘భానుమతి రామకృష్ణ’ సినిమా ఓటిటి లో రిలీజ్ అవుతుండడం పట్ల మీ రెస్పాన్స్ ఏంటి?

స. మొదట ఈ సినిమా ప్లాన్ చేసినప్పుడే మేము ఫిల్మ్ ఫెస్టివల్స్ కి పంపేలా ఓ ఇండిపెండెంట్ ఫిల్మ్ లాగా అనుకున్నాం. ఫిల్మ్ ఫెస్టివల్స్ తర్వాత పరిస్థితిని బట్టి థియేటర్స్ లేదా ఓటిటి అనుకున్నాం. కానీ మేకింగ్ టైంలో ఫిక్స్ అయ్యాం ఇది ఓటిటి కి పర్ఫెక్ట్ అని, ఎందుకంటే ‘భానుమతి రామకృష్ణ’ అనేది సింపుల్ ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. థియేటర్ అనగానే లవ్ స్టోరీలో కూడా కొన్ని స్పెషల్ ఎఫెక్ట్స్(పూల మధ్యలో ఇంట్రడక్షన్స్, వైట్ అండ్ వైట్, గాలి, వర్షం ఇలా) ఆశిస్తారు. థియేటర్ కి అవన్నీ ఉండాలి కూడా.. కానీ ఈ సినిమా చాలా నాచురల్ గా ఉంటుంది. అందుకే ఓటిటి రిలీజ్ కి పర్ఫెక్ట్ ఫిల్మ్.

ప్రశ్న. ఇందులో మీ పాత్ర ‘రాముడు మంచి బాలుడు’ టైపు ఉంది. ఈ పాత్ర ప్రేక్షకులను ఎంతవరకూ ఎంటర్టైన్చేస్తుంది.?

స. ప్రతి ఒక్కరిలోనూ రాముడు మంచి బాలుడు అనే కోణం ఉంటుంది. కానీ ఇప్పుడున్న స్పీడ్ అండ్ పోటీ ప్రపంచంలో మనలో ఉన్న మంచి బాలుడు మనకే కనపడట్లేదు. కానీ రామకృష్ణ పాత్ర ఏం జరిగినా తనలా తాను ఉంటూ, తన లైఫ్ ని ఉన్నంతలో ఎంజాయ్ చేస్తుంటాడు. వాడికి బాధ వచ్చినా అందులో హ్యాపీనెస్ ఎతుక్కుంటాడు. లేని వాటి కోసం ఆరాటపడకుండా, ఉన్నంతలో హ్యాపీగా ఉండాలని చెప్పేదే రామకృష్ణ పాత్ర. చెప్పాలంటే గమనిస్తే మన ఫ్రెండ్స్ గ్యాంగ్ లో కూడా టైంకి రావడం, అన్నీ చెయ్యడం, ఏమన్నా జోవియల్ గా తీసుకునేవాడు ఒకడుంటాడు. కావున రామకృష్ణ ఎంటర్టైన్ చేస్తాడు, అలాగే అందరికీ కనెక్ట్ అవుతాడు కూడా..

ప్రశ్న. ఇలాంటి పాత్ర మీరు ఇదివరకూ చేయలేదు. ఈ పాత్ర కోసం మీరు తీసుకున్న స్పెషల్ కేర్ ఏంటి?

స. అవును చేయలేదు. అందుకే ఇలా సింపుల్ గా ఎప్పుడూ హ్యాపీగా ఉండే కొంతమంది రెఫెరెన్స్ తీసుకొని ఈ పాత్ర ఎలా చేయాలా అని ఆలోచిస్తూ ఈ పాత్రతో ట్రావెల్ అవుతున్న టైంలో నాలో ఉన్న రామకృష్ణ పాత్ర నాకు పరిచయం అయ్యింది. అలా జరగడం వల్లే ఇంత బాగా నేను ఆ పాత్ర చేయగలిగాను.

ప్రశ్న. ఇలాంటి తరహా కథలు ఇదివరకే చూసి ఉన్నారు. మరి ‘భానుమతి రామకృష్ణ’లోని కొత్త పాయింట్ ఏంటి?

స. మన వాళ్ళ ప్రకారం పెళ్లి చేసుకుంటే సెటిల్ అయిపోయినట్టు.. 30 వరకూ పెళ్లి చేసుకోకుండా ఉంటే, అలాంటి వారికి 30 నుంచి 35 వయసు మధ్యలో ఇంట్లో నుంచి బయట నుంచి వచ్చే ప్రెజర్ మాములుగా ఉండదు. పెళ్లి అనేది వాడికి ప్రాబ్లెమ్ కాకపోవచ్చు, కానీ చుట్టూ ఉన్న వాళ్ళు మాటలతో చంపేస్తుంటారు. అలాంటి సందర్భంలో అతను వాళ్ళ ప్రెజర్ తీసుకుంటూ, తనకి కావాల్సిన లైఫ్ పార్ట్నర్ ని ఎలా సెలక్ట్ చేసుకోవాలి అని చెప్పడమే ఈ కథలోని కీ పాయింట్. ఇది ఇప్పటివరకూ ఎవరూ చెప్పలేదు. ప్రతి ఒక్కరూ ఇలాంటి ఫేజ్ పేస్ చేసి ఉంటారు. అందుకే చాలా ఫ్రెష్ గా ఉంటుంది. చాలా మంది పిచ్చి పిచ్చిగా కనెక్ట్ అవుతారు.

ప్రశ్న. కొత్త డైరెక్టర్ శ్రీకాంత్.. మీకు చెప్పిన కథని ఎంతవరకూ ఆన్ స్క్రీన్ పైకి తీసుకురాగలిగాడు?

స. చెప్పించి చెప్పినట్టు తీసాడు. సినిమా విషయంలో 100% సంతృప్తిగా ఉన్నాను. శ్రీకాంత్ ఎంత బాగా చేయించుకున్నాడు అని చెప్పాలంటే.. సినిమా చూస్తున్నప్పుడు నాకు నవీన్ చంద్ర కనిపించలేదు, రామకృష్ణనే కనిపించాడు. నాకెరీర్లో అలా అనిపించి రెండు సార్లే.. ఒకటి అందాల రాక్షసి లో సూర్య పాత్ర చూస్తున్నప్పుడు వీడెవడో భలే ఉన్నాడే అనిపించింది. మళ్ళీ రెండో సారి రామకృష్ణ పాత్ర అలా అనిపించింది. అది నేనేనా అనే ఫీలింగ్ నాకు కలిగింది.

ప్రశ్న. అల్లు అరవింద్ గారు సినిమా చూసాక ఎలా రెస్పాండ్ అయ్యారు?

స. ముందుగా అల్లు అరవింద్ గారు ముందు మా స్టోరీ ప్లాట్ పాయింట్ పంపాము, అది బాగా నచ్చి సినిమా చూసారు. ఆయనకి సినిమా బాగా నచ్చడంతో అందరినీ పేరు పేరునా మెచ్చుకున్నారు. ఆయనే కాకూండా చాలా మంది పెద్దలు, క్రిటిక్స్ కొందరు సినిమా చూసారు. అందరూ మంచి ఫీల్ గుడ్ మూవీ చూశామని చెప్పారు. అందుకే అల్లు అరవింద్ గారు ఈ సినిమా తీసుకొని అందరికీ రీచ్ అయ్యేలా భారీగా ప్రమోషన్స్ చేసి, రిలీజ్ చేస్తున్నారు.

ప్రశ్న. భానుమతి పాత్రలో చేసిన సోనీ లుథ్రా ఎలా చేసింది?

స. విజయవాడ అమ్మాయిలు కాస్త గడుసుగా ఉంటారు అనే టాక్ ఉంది. మా భానుమతి పాత్ర విజయవాడ గర్ల్స్ ని రెప్రజెంట్ చేస్తుంది. భానుమతి పాత్రలో సలోనీ చాలా బాగా చేసింది.

ప్రశ్న. బాలకృష్ణ – బోయపాటి సినిమాలో మీరు విలన్ రోల్ చేస్తున్నారు అనే వార్త ప్రచారంలో ఉంది. అందులో నిజమెంత?

స. ప్రస్తుతానికైతే.. ఇప్పుడున్న సస్పెన్స్ అలానే ఉండనివ్వండని మాత్రమే చెప్పగలను.

ప్రశ్న. మీరు పనిచేసిన కొంతమంది స్టార్స్ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే..

ఎన్.టి.ఆర్: మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీఎరియన్స్. నాలాంటి యాక్టర్ జీరో అవ్వడానికి చాలా నేర్చుకోవచ్చు. మళ్ళీ ఒక్క షాట్ లో ఛాన్స్ దొరికినా నటించడానికి రెడీ ఉన్నాను.

త్రివిక్రమ్: సూపర్ క్లీన్ సోల్.

నాని: ఫుల్ అఫ్ లైఫ్. గుడ్ హ్యూమన్.

ధనుష్: అయన మల్టీ టాలెంట్ చూస్తే, కథల కోసం, సినిమాల కోసమే పుట్టాడా అనిపిస్తుంది.

అడివి శేష్: స్క్రిప్ట్ మీద సూపర్బ్ కమాండ్ ఉన్న హీరో.

కీర్తి సురేష్: చాలా పాషన్ ఉన్న హీరోయిన్. క్లోజ్ గా ఉండకపోయినా టెక్నీషియన్స్ కి తను ఇచ్చే రెస్పెక్ట్ వేరే లెవల్.

రెజీనా కసాండ్ర: టాలెంటెడ్ అండ్ వండర్ఫుల్ కో స్టార్.

ఇంటర్వ్యూ – రాఘవ

7 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి...

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో...

Jai Hanuman: ‘జై హనుమాన్’ అప్డేట్.. అంచనాలు పెంచేసిన ప్రశాంత్ వర్మ

Jai Hanuman: తేజ సజ్జా (Teja Sajja) హీరోగా ప్రశాంత్ వర్మ (Prasanth Varma) దర్శకత్వంలో తెరకెక్కిన ‘హను-మాన్’ (Hanu-man) సంచలన విజయం సాధించడమే కాకుండా...

Chiranjeevi: ‘ఆ చిరంజీవే ఈ చిరంజీవికి తోడు..’ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు...

Chiranjeevi: ఆంజనేయుడు.. హనుమంతుడు.. భజరంగభళి.. వాయు నందనుడు.. ఇవన్నీ శ్రీరామ భక్త హనుమంతుడి పేర్లే. ధైర్యానికి.. అభయానికి ఆయనే చిహ్నం. ప్రాణకోటి తలచుకునే దైవం. ఆ...

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

పిఠాపురంలో జనసునామీ.! నభూతో నభవిష్యతి.!

సమీప భవిష్యత్తులో ఇలాంటి జనసునామీ ఇంకోసారి చూస్తామా.? ప్చ్.. కష్టమే.! అయినాసరే, ఆ రికార్డు మళ్ళీ ఆయనే బ్రేక్ చేయాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్, పిఠాపురం అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు...

సింగిల్ సింహం కాదు సజ్జలా.! అది రేబిస్ సోకిన కుక్క.!

‘మెగాస్టార్ చిరంజీవి గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్త.! నోటికొచ్చినట్లు మాట్లాడితే బాగోదు.!’ అంటూ స్వీట్ వార్నింగ్ ఇచ్చారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అది కూడా వైసీపీ ముఖ్య నేతల్లో ఒకరైన సజ్జల...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

Sai Durga Tej: సాయి దుర్గ తేజ్ విడుదల చేసిన ‘పడమటి కొండల్లో’ ఫస్ట్ లుక్

Sai Durga Tej: అనురోప్ కటారి హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘పడమటి కొండల్లో’ (Padamati Kondallo). జయకృష్ణ దురుగడ్డ నిర్మాతగా నూతన దర్శకుడు చిత్ర దర్శకత్వంలో తెరకెక్కుతోందీ సినిమా. ఈ సందర్భంగా సినిమా...

Mad Square: మ్యాడ్ సీక్వెల్ ‘మ్యాడ్ స్క్వేర్’ ప్రారంభం.. ఫన్ డబుల్ అంటున్న మేకర్స్

Mad Square: గతేడాది విడుదలై యూత్ ని ఆకట్టుకున్న సక్సెస్ ఫుల్ మూవీ 'మ్యాడ్' (Mad). ఈ సినిమాకి సీక్వెల్‌ గా 'మ్యాడ్ స్క్వేర్' (Mad Square) తెరకెక్కబోతోంది. యూత్ ఓరియంటెడ్ మూవీస్...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...

పిఠాపురంలో వంగా గీతకు అదే పెద్ద మైనస్.!

నామినేషన్ల పర్వం షురూ అయ్యింది.! జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ నెల 23న పిఠాపురం నియోజకవర్గంలో జనసేన అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. పిఠాపురంలో జనసేనాని పోటీ చేస్తున్నారని కన్ఫామ్ అయినప్పటికీ, ఇప్పటికీ.....