Switch to English

రూ.300 ఆర్డర్ కి రూ.19వేల ఐటెం.. ఉంచేసుకోమన్న అమెజాన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,455FansLike
57,764FollowersFollow

ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ పెరిగిన తర్వాత జనాలు వాటికే అలవాటు పడిపోయారు. గుండు సూది దగ్గర నుంచి పేద్ద టీవీ వరకు ఏదైనా ఆన్ లైన్ లో కొనుగోలు చేసేవారు అంతకంతకూ పెరుగుతున్నారు. ఇక లాక్ డౌన్ కారణంగా ఆన్ లైన్ అమ్మకాలకు మరింత గిరాకీ పెరిగింది. అయితే, ఒక్కోసారి మనం ఒకటి ఆర్డర్ ఇస్తే మరొకటి కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని సదరు సైట్ కి చెబితే, వారు దానిని వెనక్కి తీసుకుని మన అసలు ఆర్డర్ డెలివరీ చేస్తుంటారు.

తాజాగా జోష్ సాప్ట్ వేర్ డాట్ కంపెనీ డైరెక్టర్ గౌతమ్ రేజ్ కు అమెజాన్ నుంచి వింత అనుభవం ఎదురైంది. ఆయన రూ.300 విలువైన స్కిన్ లోషన్ ఆర్డర్ చేయగా.. ఏకంగా రూ.19వేల విలువైన బోస్ ఇయర్ బడ్స్ వచ్చాయి. ప్యాక్ విప్పి చూసి ఆశ్చర్యపోయిన గౌతమ్.. వాటిని తిరిగి ఇచ్చేయాలని భావించారు. అమెజాన్ కస్టమర్ కేర్ కు ఫోన్ చేసి విషయం చెప్పారు. అయితే, ఆయన ఆర్డర్ చేసిన స్కిన్ లోషన్ నాన్ రిటర్నబుల్ ఐటెం కావడంతో దానిని వెనక్కి తీసుకోలేమని, మీరే ఉంచేసుకోవాలని సమాధానం వచ్చింది. ఈ విషయాన్ని గౌతమ్ ట్విట్టర్ లో పోస్టు చేయడంతో ఒక్కసారిగా వైరల్ గా మారింది.

కొందరు గౌతమ్ నిజాయతీకి నీరాజనాలు పట్టగా.. మరికొందరు సరదాగా ఛలోక్తులు వేస్తున్నారు. ‘భయ్యా.. అది ఏ లోషనో కాస్త చెబుతారా’ అని ఒకరు ట్వీటేస్తే.. ‘బ్రో.. నేను ఆర్డర్ చేసిన బోస్ ఇయర్ బడ్స్ బదులు నాకు స్కిన్ లోషన్ వచ్చింది. ఇద్దరం ఎక్స్ఛేంజ్ చేసుకుందామా’ అంటూ కొంటెగా మరొకరు ట్వీట్ చేశారు. దీనికి గౌతమ్ కూడా అంతే కొంటెగా బదులిచ్చారు. ‘దానికేం భాగ్యం బ్రదర్.. రండి. వస్తూ వస్తూ ఆర్డిబెగ్ తీసుకుని రండి. ఎక్స్ఛేంజ్ ని ఎంజాయ్ చేద్దాం’ అని సమాధానం ఇచ్చారు. ఆర్డిబెగ్ అంటే.. అతి ఖరీదైన స్కాచ్ బాటిల్. ‘బ్రదర్.. నేను ఆ బోస్ ఇయర్ బడ్స్ వాడుతున్నాను. నేను రూ.18వేలు పెట్టి కొన్నాను. అవి మీకు రూ.300కే వచ్చాయి. ఎంజాయ్ ది సౌండ్’ అని మరొకరు సూచించారు. ‘మీకు అమెజాన్ నుంచి అదిరిపోయే గిప్ట్ వచ్చింది. కాదనకుండా తీసుకుని ఎంజాయ్ చేయండి’ అంటూ ఇంకో నెటిజన్ ట్వీట్ చేశారు.

మొత్తానికి గౌతమ్ అనుభవం సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సందర్భంగా కొందరు అమెజాన్ లో తమకు ఎదురైన చేదు అనుభవాలు కూడా ఏకరువు పెట్టడం విశేషం. కొసమెరుపు ఏమిటంటే.. గౌతమ్ ఆర్డర్ చేసిన స్కిన్ లోషన్ డెలివరీ కానందుకు ఆయన చెల్లించిన రూ.300 కూడా అమెజాన్ నుంచి వెనక్కి వచ్చాయి.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ileana: ఆ ప్రచారం వల్లే నాకు తెలుగులో అవకాశాలు తగ్గాయేమో: ఇలియానా

Ileana: తెలుగులో ఓదశలో స్టార్ హీరోయిన్ గా రాణించింది ఇలియానా (Ileana). తెలుగులో తొలిసారి కోటి రూపాయలు రెమ్యునరేషన్ కూడా తీసుకున్న నటిగా ఇలియానాకు పేరు....

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు...

Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’లో పెళ్లి కాన్సెప్ట్ హైలైట్: దర్శకుడు...

Allari Naresh: చాలా కాలం తర్వాత అల్లరి నరేష్ (Allari Naresh) కామెడీ టైమింగ్ మళ్లీ తీసుకొస్తున్నారు దర్శకుడు మల్లి అంకం. ఆయన దర్శకత్వం వహించిన...

Anand Devarakonda: మే 31న ఆనంద్ దేవరకొండ “గం..గం..గణేశా”

Anand Devarakonda: ‘బేబి’ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ సాధించిన యంగ్ హీరో ఆనంద్ దేవరకొండ (Anand Devarakonda) నటించిన కొత్త సినిమా "గం..గం..గణేశా" (Gum...

Betting case: బెట్టింగ్ కేసులో బాలీవుడ్ నటుడు అరెస్టు.. సినీ ఫక్కీలో...

Betting case: సంచలనం రేపిన మహదేవ్ బెట్టింగ్ యాప్ (Mahadev betting app case) కుంభకోణంలో బాలీవుడ్ నటుడు సాహిల్ ఖాన్ (Sahil Khan) ను...

రాజకీయం

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

వైఎస్ షర్మిల ఓటమిపై వైఎస్ జగన్ మొసలి కన్నీరు.!

కడపలో వైఎస్ షర్మిల ఓడిపోతుందనీ, డిపాజిట్లు కూడా ఆమెకు రావనీ వైసీపీ అధినేత, ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జోస్యం చెప్పారు. నేషనల్ మీడియాకి చెందిన ఓ న్యూస్...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Hassan Sex Scandal: హాసన్ లో సెక్స్ కుంభకోణం.. బాధితురాలు ఎంపీకి బంధువే

Hassan: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కర్ణాటకలో హాసన్ సెక్స్ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మాజీ మంత్రి రేవణ్ణ, ఆయన కుమారుడు ఎంపీ ప్రజ్వల్ పై లైంగిక దౌర్జన్యం కేసులు నమోదవడమే ఇందుకు...

సీమలో ‘సిరిగిపోయిన’ వైసీపీ మేనిఫెస్టో.!

దీన్ని మేనిఫెస్టో అంటారా.? 2019 ఎన్నికల మేనిఫెస్టోలోంచి కొన్ని అంశాల్ని తీసేస్తే, అది ‘నవరత్నాలు మైనస్’ అవుతుందిగానీ, ‘నవరత్నాలు ప్లస్’ ఎలా అవుతుంది.? ఈ మేనిఫెస్టో దెబ్బకి, ‘వైసీపీకి అధికారం మైనస్’ అంటూ...

ఎక్కువ చదివినవి

ఎన్టీయార్ అభిమానుల్నే నమ్ముకున్న కొడాలి నాని.!

మామూలుగా అయితే, గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే కొడాలి నానికి తిరుగే లేదు.! కానీ, ఈసారి ఈక్వేషన్ మారినట్లే కనిపిస్తోంది. నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి దగ్గర్నుంచి, చాలా విషయాలు కొడాలి నానికి...

వంగా గీత ‘పార్టీ మార్పు’ ప్రచారం వెనుక.!

వంగా గీత పార్టీ మారుతున్నారట కదా.! వైసీపీకి గుడ్ బై చెప్పి, జనసేనలోకి ఆమె వెళ్ళబోతున్నారట కదా.! నామినేషన్‌ని వంగా గీత వెనక్కి తీసుకుంటున్నారట కదా.! ఇవన్నీ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న...

Chiranjeevi: పిఠాపురం కు చిరంజీవి వస్తున్నారా..? వాస్తవం ఇదీ..

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవిపై ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ్ముడు పవన్ కళ్యాణ్ తరపున ప్రచారం చేయనున్నారని.. ఇందుకు మే 5వ తేదీన...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...