Switch to English

స్పెషల్ ఫోకస్: థియేటర్ దద్దరిల్లేలా చేసిన ‘హరీష్ శంకర్’ అల్ టైం పవర్ ఫుల్ డైలాగ్స్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,464FansLike
57,764FollowersFollow

ప్రతి రోజూ ఉరుకుల పరుగుల జీవితం, జీతం కోసం పరిగెడుతూ పగటిని చూడట్లే, మొబైల్ బానిసత్యవంలో రాత్రిని చూడటం మరచిపోయాం. అలాంటి బిజీ లైఫ్ లీడ్ చేసే వారైనా, కాలేజ్ స్టూడెంట్స్ అయినా ఎంటర్టైన్మెంట్ కావాలంటే అందరూ ఎంచుకునే ఒకే ఒక్క ఛాయస్ ‘సినిమా’. వీళ్ళకే తెలియకుండానే వీళ్ళ లైఫ్ ని సినిమాలు చాలా ప్రభావితం చేసేస్తుంటాయి. అందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది హీరోలు చెప్పే పంచ్ డైలాగ్స్ ని మన డైలీ లైఫ్ లో ఎక్కువ వాడుతూ ఉంటాం.

ఈ డైలాగ్స్ కి సినిమా జయాపజయాలతో సంబంధం ఉండదు. ఒక్కసారి ఆ డైలాగ్ నచ్చింది అంటే అది ఇక మనతో ట్రావెల్ అవుతూనే ఉంటాయి. హీరోలు చెప్పిన డైలాగ్స్ ని మనం చెప్పడం, అవసరాన్ని బట్టి పంచ్ లుగా వాడడాన్ని కూడా మనం బాగా ఎంజాయ్ చేస్తాం. అలా చిత్రసీమలో ఇప్పటికే ఎందరో రైటర్స్ ఎన్నో అద్భుతమైన డైలాగ్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందించారు. మనందరిలానే డైలాగ్స్ ని విపరీతంగా ప్రేమించే నేటితరం రచయితల్లో డైరెక్టర్ హరీష్ శంకర్ ఒకరు.

ఈయనకి డైలాగ్స్ అంటే ఎంత పిచ్చంటే, నాటి నుంచి నేటి వరకు వచ్చిన అన్ని సినిమాల్లోని కిల్లర్ డైలాగ్స్ ని ఈయన ఆఫీస్ వాల్ మొత్తం రాసుకొని ఉంటారు. డైరెక్టర్ హరీష్ శంకర్ కి తన హీరోకి అన్ని వర్గాల వారు మెచ్చుకునేలా పంచ్+పవర్ ఉన్న డైలాగ్స్ రాయడం అంటే చాలా చాలా ఇష్టం. ప్రతి హీరోకి వాళ్ళ ఇమేజ్ కి తగ్గట్టు అద్భుతమైన డైలాగ్స్ రాయడానికి హరీష్ శంకర్ కి ఆఫీస్ వాల్ మీద ఉండే డైలాగ్సే స్ఫూర్తి అనుకుంటా. ఇప్పటి వరకూ ఆయన చేసిన 6 సినిమాల్లో ఎన్నో డైలాగ్స్ కి థియేటర్స్ లో ఈలలు పడ్డాయి, అలా ఈలలు పడిన డైలాగ్స్ ఇంకా మనతో పాటే చలామణీ అవుతున్నాయి. హరీష్ శంకర్ కెరీర్లో రాసిన హీరోయిజం ఎలివేట్ చేస్తూ రాసిన టాప్ డైలాగ్స్ మీకోసం.

1. మిరపకాయ్

Mirapakay

> ‘పేరు రిషి, కానీ డిపార్ట్మెంట్ పెట్టిన పేరు మిరపకాయ్’

> ‘మీకు నోరొకటే దూలేమో, నాకు నరనరాల్లోనూ ఒళ్ళంతా దూలే’ – రవితేజ కౌంటర్ టు దూల నాగేశ్వరావు

2. గబ్బర్ సింగ్

Gabbar Singh

> “నాక్కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కుంది.. నా తిక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా” – ఇంటర్వల్ లో వచ్చే ఈ డైలాగ్ ఇప్పటికీ ట్రెండ్ అవుతూనే ఉంది.

> “కంటెంట్ ఉన్నోడికి కటౌట్ చాలు” – సీన్ పరంగా ఈ డైలాగ్ కమెడియన్ బ్రహ్మానందం చెప్పినా, సందర్భానుసారంగా హీరోయిజం మాత్రం డబుల్ డోస్ లో హైలైట్ అవుతుంది.

> ‘నాకు నేనే పోటీ, నాతో నాకే పోటీ’

> ‘నేను టైముని నమ్మను, నా టైమింగుని నమ్ముతా’

> ‘నేను ట్రెండ్ ఫాలో అవ్వను, ట్రెండ్ సెట్ చేస్తా’ – వేరు వేరు సందర్భాల్లో వచ్చే ఈ డైలాగ్స్ అల్ టైం ట్రెండ్ అని చెప్పాలి.

3. రామయ్యా వస్తావయ్యా

Ramayya Vasthavayya

> ‘పందాలు గుర్రాల మీద కాయాలిరా, సింహాల మీద కాదు..’ – ఎన్.టి.ఆర్ ఇమేజ్ ని, సీన్ కంటెంట్ హైప్ చేసే ఈ డైలాగ్ ఇప్పటికీ ఫేమస్.

> ‘గదైనా గట్స్ అయినా ఒరిజినల్ వాడటమే నాకలవాటు’

> ‘బుడ్డోడు బుడ్డోడు అంటే గుడ్డలూడదీసి కొడతా, అలా అనాలంటే ఓ అర్హత ఉండాలి లేదా నా అభిమానై ఉండాలి’ – హీరోపై సరదాగా వచ్చే పేర్లతో కూడా ఈ రేంజ్ హీరోయిజం ఎలివేట్ చేయగల డైలాగ్ రాయడం హరీష్ శంకర్ సత్తా తెలుస్తుంది.

> ‘నిక్కర్లేసుకునే వయసులోనే రికార్డులన్నీ మడతేసి జేబులో వేసుకున్నోన్ని, నీకు చంపడంలో స్టేట్ రికార్డ్ ఉంటే, నాకు నరకడంతో వరల్డ్ రికార్డ్ ఉంది’.

4. సుబ్రమణ్యం for సేల్

Subramanyam For Sale

> ‘పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్ ని గబ్బర్ సింగ్ సినిమా చూసావా అని అడక్కూడదురా, ఎన్ని సార్లు చూసావని అడగాలి – అలాగే నాలాంటోన్ని కొడతావా అని అడగొద్దు, ఎంతసేపు కొడతావన్నా అని అడుక్కోవాలి’

> ‘నేను మాటల్తో మాయ చేయగలను, సంచులకొద్దీ పంచులేయగలను, కానీ నా టార్గెట్ పంచేయడం కాదు పనిచేయడం’

> ‘హైవేలో వెళ్ళేవాణ్ణి పక్కకి లాగితే ఇలానే పగిలిపోద్ది’

5. దువ్వాడ జగన్నాథమ్

Dj

> ‘పబ్బుల్లో వాయించే డిజె ని కాదురా, పగిలిపోయేలా వాయించే డీజేని’

> ‘ నా లాంగ్వేజ్ వీడికి అర్థం కావట్లే, కానీ నా బాడీ లాంగ్వేజ్ అర్థమైపోద్ది. ఎందుకంటే నా బాడీ లాంగ్వేజ్ యూనివర్సల్’.

> ‘కేకహా కేకస్య కేకోబ్యః’

> ‘పులిహోరలో ఇంఘువ వేయకుండా సభ్య సమాజానికి మనం ఏం మెసేజ్ ఇస్తున్నట్టు సందర్భాన్ని బట్టి ప్రతి చోటా వాడే ఈ రైమింగ్ కి ఇప్పటికీ ఫాలోయింగ్ ఉంది.

6. వాల్మీకి (ట్రైలర్ డైలాగ్స్)

Valmiki

> నా పైన పందాలేస్తే గెలుస్తరు, నాతోటి పందాలేస్తే సస్తరు.

> గవాస్కర్ సిక్స్ గోట్టుడు, బప్పీలహరి పాటగొట్టుడు, నేను బొక్కలిరగ్గొట్టుడు సేమ్ టు సేమ్ అదే పాషన్..

> గద్దల కొండా గణేష్ అంటే గజగజ వణకాలే..

హరీష్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న 7వ సినిమా ‘వాల్మీకి’. వరుణ్ తేజ్ హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ లో వచ్చిన కొన్ని డైలాగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. మరి సినిమాలో ఇంకెన్ని తూటాల్లాంటి డైలాగ్స్ ఉన్నాయో, అవి ఏ రేంజ్ లో ఈలలేసి గోల చేయిస్తాయో అనేది సెప్టెంబర్ 20న తెలుస్తుంది.

గమనిక: హరీష్ శంకర్ హీరో ఎలివేషన్ డైలాగ్స్ మీకు నచ్చి మేము ఎమన్నా మిస్ అయ్యి ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: ‘రామ్ చరణ్ అంటే ఇష్టం..’ మాజీ మిస్ వరల్డ్...

Ram Charan: 2017లో ప్రపంచ సుందరి కిరీటం దక్కించుకున్న భారతీయరాలు ‘మానుషి చిల్లార్’. (Manushi Chillar) ఇటివల మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun Tej)...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు...

Nani: ‘జెర్సీ’ @5..! ధియేటర్లో సినిమా చూసిన నాని.. ఎమోషనల్ పోస్ట్

Nani: నాని (Nani) హీరోగా గౌతమ్ తిన్ననూరి (Gowtham Thinnanuri) దర్శకత్వంలో వచ్చిన ‘జెర్సీ’ (Jersey) విడుదలై నిన్నటికి 5ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సినిమాను...

Upasana: ఆవకాయ పట్టిన అత్తమ్మ.. ఆటపట్టించిన ఉపాసన.. వీడియో వైరల్  

Upasana: టాలీవుడ్ (Tollywood) లో మెగా ఫ్యామిలీ (Mega Family) అంటే ఒక సందడి. ఒక బ్రాండ్. ముఖ్యంగా చిరంజీవి (Chiranjeevi). ఆయనొక ఇన్ స్పిరేషన్...

Puri Jagannadh: ఎవరు కొడితే బొమ్మ బ్లాక్ బస్టరవుద్దో.. అతనే ‘పూరి...

Puri Jagannadh: సినిమాకి హీరోకి ఉండే క్రేజే వేరు. సరైన సినిమాపడి స్టార్ స్టేటస్ వస్తే ఫ్యాన్స్ పెరుగుతారు.. డెమీ గాడ్ కూడా అయిపోతాడు. హీరో...

రాజకీయం

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

చిరంజీవిపై ‘మూక దాడి’.! వైసీపీకే పెను నష్టం.!

వైఎస్ వివేకానంద రెడ్డికే అక్రమ సంబంధాలు అంటగట్టిన ఘన చరిత్ర వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీది.! వైఎస్ షర్మిలా రెడ్డిని కాస్తా మెరుసుపల్లి షర్మిల శాస్త్రి.. అంటూ ఎగతాళి చేసిన ఘనత వైసీపీకి కాక...

ఏపీలో బీజేపీని ఓడించేయనున్న బీజేపీ మద్దతుదారులు.!

ఇదో చిత్రమైన సందర్భం.! ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి, ఆ పార్టీ మద్దతుదారులే శాపంగా మారుతున్నారు. అందరూ అని కాదుగానీ, కొందరి పైత్యం.. పార్టీ కొంప ముంచేస్తోంది.! టీడీపీ - బీజేపీ...

వ్యూహకర్తల మాటే శాసనం.. వారిదే పెత్తనం

దేశ రాజకీయాల్లో వ్యూహకర్తల పాత్ర రోజురోజుకి పెరిగిపోతోంది. గతంలో మాదిరిగా స్థానిక నాయకత్వంతో వ్యూహాలను రచించి ఎత్తుకు పై ఎత్తులు వేసే రోజులు పోయాయి. మరి ముఖ్యంగా ప్రచార పర్వాన్ని వ్యూహకర్తలే శాసిస్తున్నారు....

ఎక్కువ చదివినవి

అవినాష్ వర్సెస్ సునీత.! కడపలో వైసీపీ ఖేల్ ఖతం.!

సీబీఐ ఛార్జిషీట్‌లో పేర్కొన్న అంశాల్నే ప్రస్తావిస్తున్నారు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె సునీతా రెడ్డి.! 2019 ఎన్నికల సమయంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య జరిగితే, సీబీఐ విచారణ కోసం...

Chiranjeevi: CCTలో 100వసారి రక్తదానం చేసిన మహర్షి రాఘవ.. అభినందించిన చిరంజీవి

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి 26ఏళ్ల క్రితం (1998 అక్టోబర్ 2) ప్రారంభించిన చిరంజీవి చారిటబుల్ ట్రస్టులో నేడు అద్భుతమే జరిగింది. ‘రక్తదానం చేయండి.. ప్రజల ప్రాణాలు నిలపండి..’ అని నాడు చిరంజీవి ఇచ్చిన...

పో..‘సాని’తనం.! ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం.!

‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్లాం’ అంటారు.! ‘ఒళ్ళు కొవ్వెక్కితే పెళ్ళాం అంటారు’.! రెండు మాటలకీ పెద్దగా తేడా ఏం లేదు కదా.? లేకపోవడమేంటి.? చాలా పెద్ద తేడా వుంది.! ఈ పెళ్ళాం గోలేంటి.? మనుషులమే కదా.?...

కూలీలపై హత్యా నేరం మోపుతారా.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మీద విజయవాడ నగరం నడిబొడ్డున హత్యాయత్నం జరిగిందంటూ వైసీపీ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రచారం సందర్భంగా, గుర్తు తెలియని వ్యక్తి విసిరిన...

కులాంతరంలో కూడా రాజకీయ క్రీడ.!

ప్రజల నుంచి ప్రజల చేత ప్రజల కొరకు ఎన్నుకోవాలి అంటే.. ప్రజలందరికి మంచి చెయ్యటం వ్యక్తులకి సాధ్యం కాదు. అందుకని మనుషులని ఎదో ఒకరకంగా కూడగట్టాలి. ఉద్యోగులు, నిరుద్యోగులు, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు,...