నేడు ఫాదర్స్ డే.. ‘నాన్నకు ప్రేమతో’ అంటూ రకరకాల భాషల్లో ప్రపంచమంతా పండగ చేసేసుకుంటోంది. కరోనా సంగతెలా వున్నా, ‘ఫాదర్స్ డే’ నేపథ్యంలో సెలబ్రిటీలు, సాధారణ ప్రజానీకం.. వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నారు. కానీ, ‘నాన్నకు ప్రేమతో’ అనే మాటని ఒక్క రోజుకే పరిమితం చేసేద్దామా.? అది సాధ్యమయ్యే పనేనా.? మదర్స్ డే.. ఫ్రెండ్షిప్ డే.. ఆ డే, ఈ డే.. చెప్పుకుంటూ పోతే, ‘దినాలు’ చాలానే వున్నాయి. అయినా, ‘తండ్రులకు దినం ఏంట్రా శుంఠల్లారా..’ అంటూ కొందరు సోషల్ మీడియా వేదికగానే, ఈ ‘ఫాదర్స్ డే’ మీద తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు.
పాశ్చాత్య దేశాల్లో పరిస్థితులు వేరు. ఇక్కడి భారతీయ సంస్కృతి వేరు. కానీ, ఇప్పుడు ట్రెండ్ మారింది. వీకెండ్లోనే భార్యా భర్తలు కలుసుకునే రోజులివి. పిల్లల్ని హాస్టల్లో చేర్పించేసి, భార్యాభర్తలిద్దరూ ఉద్యోగాలు చేసేసుకుంటున్నారు. తల్లిదండ్రుల్ని వృద్ధాశ్రమాలకి పంపించేయక తప్పని పరిస్థితి కొందరికి కలుగుతోంది. ఈ నేపథ్యంలో మనకీ ‘మదర్స్ డే’, ‘ఫాదర్స్ డే’ వంటివి అవసరమే.
స్నేహితుల దినోత్సవం.. అంటే, అది ఎప్పుడంటే అప్పుడు వచ్చేస్తుంటుంది.. ఎందుకంటే, ఈ స్నేహాలు వేరు. నిత్యం, పార్టీల్లోనో.. పబ్బుల్లోనో ఎంజాయ్ చేసేవారికి అది డెయిలీ ఫెస్టివల్ కిందనే భావించాలేమో. నాన్నంటే నమ్మకం.. నాన్నంటే నడిపించేవాడు.. ఇలాంటి మంచి మాటలకు కాలం చెల్లిపోయిన రోజులివి. ‘ఈ రోజు ఫాదర్స్ డే జరుపుకుపోవడం తప్పు కాదు.. కానీ, ఒక్క రోజుకే నాన్న మీద ప్రేమను పరిమితం చేయడం దారుణం..’ అంటారు కొందరు.
ఎవరేమనుకున్నాసరే, ట్రెండింగ్‌లో వుండాలంటే కొన్నిటి ఫాలో అవ్వాల్సిందే. పబ్లిసిటీ స్టంట్స్‌లో ఇదీ ఓ భాగం అనుకునేవాళ్ళు కొందరు.. నలుగురు నడిచే దారిలో నడవక తప్పనప్పుడు, ఆ నలుగురూ ఆచరించేవి మనమూ ఆచరించాలన్న వాదననీ కొట్టి పారేయలేం. ఇక, సెలబ్రిటీలు తమ పిల్లల్ని, తమ తండ్రుల్ని ఈ రోజు ప్రత్యేకంగా గుర్తు చేసుకుంటున్నారు.. వారి అభిమానులూ ఈ తరహా సంబరాల్లో మునిగి తేలుతున్నారు.
73429 755291Some truly nice stuff on this internet internet site , I like it. 664367
549641 781841It is a shame you dont have a donate button! Id without a doubt donate to this brilliant weblog! I suppose for now ill settle for book-marking and adding your RSS feed to my Google account. I appear forward to fresh updates and will share this blog with my Facebook group. Chat soon! 678841
816104 245175Cheers for this exceptional. I was wondering should you were thining of writing comparable posts to this 1. .Keep up the wonderful articles! 116435