Switch to English

ఎక్సక్లూసివ్ ఇంటర్వ్యూ: మహేష్, ఎన్టీఆర్ లతో మల్టీస్టారర్ చేయాలనుంది – రాజ్ తరుణ్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,449FansLike
57,764FollowersFollow

యంగ్ హీరో రాజ్ తరుణ్ ప్రస్తుతం వరస ప్లాపులతో సతమతమవుతున్నాడు. రాజ్ తరుణ్ నటించిన రీసెంట్ సినిమాలు పరాజయం పాలయ్యాయి. సో ఎలాగైనా ఒక సాలిడ్ హిట్ సాధించి తిరిగి హిట్ ట్రాక్ ఎక్కాలనుకుంటున్నాడు రాజ్ తరుణ్. ఈ యువ హీరో నటించిన లేటెస్ట్ మూవీ ఒరేయ్ బుజ్జిగా. ఈ చిత్రం అక్టోబర్ 2న ఆహాలో విడుదలవుతోంది. మరి ఈ నేపథ్యంలో రాజ్ తరుణ్ సినిమా గురించి, ఇంకా తన పెర్సనల్ లైఫ్ లో ఆసక్తికర అంశాల గురించి ఏం చెబుతాడో చూద్దామా…

ఈ లాక్ డౌన్ పీరియడ్ ను ఎంజాయ్ చేశారా?

ఎంజాయ్ అని చెప్పలేను కానీ నాకు ఏకాంతంగా గడపడం అంటే ఇష్టం. వీలున్నప్పుడల్లా ఏకాంతంగా గడుపుతుంటాను. ఈ లాక్ డౌన్ వల్ల అది సాధ్యపడింది. అయితే నాకు ఎప్పుడూ పని చేస్తుండటమే ఇష్టం. కానీ ఈ లాక్ డౌన్ వల్ల పని లేకుండా చాలా నెలలు గడపాల్సి వచ్చింది. అది కొంచెం ఇబ్బంది పెట్టింది.

ఒరేయ్ బుజ్జిగా మీ మొదటి ఓటిటి రిలీజ్. ఎలా అనిపిస్తోంది?

మా ఒరేయ్ బుజ్జిగా మార్చ్ 25న విడుదల కావాల్సి ఉంది. దానికి తగ్గట్లుగానే ప్రిపేర్ అయ్యాం. అయితే అనుకోకుండా ఈ కరోనా మహమ్మారి వలన రిలీజ్ ను వాయిదా వేయక తప్పలేదు. అయితే ఓటిటి అనేది థియేటర్స్ కు మంచి ప్రత్యామ్నాయంగా భావిస్తాను. ఆహాలో మా సినిమా విడుదల కాబోతుండడం నిజంగా సంతోషంగా ఉంది.

మీ దర్శకుడు విజయ్ కుమార్ కొండా, నిర్మాత రాధా మోహన్ లతో పనిచేయడం ఎలా అనిపిస్తోంది?

విజయ్ కుమార్ నాకు మంచి స్నేహితుడు అయిపోయాడు. మేము మళ్ళీ త్వరలో కలిసి పనిచేయాలని అనుకుంటున్నాం. నిజంగా చాలా అద్భుతంగా ఉంది తనతో పనిచేయడం. ఇక నా నిర్మాత రాధా మోహన్ చాలా స్వీట్ పర్సన్.

మీ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చేయాలన్న ఆలోచన ఎవరిది?

హానెస్ట్ గా చెప్పాలంటే అది నా ఆలోచనే. ఇప్పుడున్న పరిస్థితుల్లో థియేటర్స్ లో విడుదల చేయడమనేది దాదాపు అసాధ్యం. అందుకే రాధా మోహన్ గారితో మాట్లాడాను. ఆయన కూడా పరిస్థితిని అర్ధం చేసుకుని నిర్ణయం తీసుకున్నారు.

మాళవిక నాయర్ గురించి ఏం చెబుతారు?

మేము సెట్స్ లో రెండో రోజు నుండే బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. చాలా టాలెంటెడ్ హీరోయిన్. మంచి కోస్టార్/

కొన్ని నెలల క్రితం ఒక యాక్సిడెంట్ కేసులో మీపై చాలా రూమర్లు వచ్చాయి. దానిపై ఇప్పుడు మీరేమంటారు?

ఇప్పుడు దాని గురించి మాట్లాడడానికి ఏం లేదు. నాకు ఇష్టం లేదు కూడా. నేను చెప్పాలనుకున్న విషయం ఒకటే. ఆ యాక్సిడెంట్ లో ఉన్నది నేనే కానీ నేను ఏదో తాగి ఉన్నాను, మత్తులో యాక్సిడెంట్ చేశాను అన్న దాంట్లో ఎటువంటి నిజం లేదు. అందులో నా తప్పు ఏం లేదు.

మీరు ఫ్యూచర్ లో సిక్స్ ప్యాక్ లో కనిపించే అవకాశాలు ఉన్నాయా?

నాకు ఎప్పుడూ బాయ్ నెక్స్ట్ డోర్ తరహా కుర్రాడిలా కనిపించడమే ఇష్టం. అయితే పాత్ర డిమాండ్ చేస్తే కచ్చితంగా ఆలోచిస్తా.

హెబ్బా పటేల్ తో మీ రిలేషన్ గురించి రూమర్స్ పై స్పందన?

ఇప్పటికే చాలా సార్లు క్లారిటీ ఇచ్చా. తను నాకు మంచి స్నేహితురాలు మాత్రమే.

మీరు ఇప్పుడు రిలేషన్ లో ఉన్నారా?

లేదు. గతంలో ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తితో రిలేషన్ లో ఉన్నా. కానీ ఇప్పుడు నేను సింగిల్.

మరి పెళ్లి ఎప్పుడు?

కచ్చితంగా మరో 3,4 ఏళ్ళు పడుతుంది.

ఇండస్ట్రీలో మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరు?

నిఖిల్, హెబ్బా పటేల్ నాకు చాలా క్లోజ్. అలాగే నా దర్శకులు అందరితో నాకు మంచి రిలేషన్ ఉంది.

మీ సినిమా రివ్యూలను ఫాలో అవుతారా?

చదువుతాను. అయితే వాటిని అంత సీరియస్ గా తీసుకోను.

టాలీవుడ్ లో నేపోటిజం ఉందా?

లేదు.

మీరు నటులు కాకపోయే ఉంటే ఏమై ఉండేవారు?

దర్శకుడ్ని అయ్యేవాణ్ణేమో.

మీకు మల్టీస్టారర్ చేయాల్సి వస్తే, ఎవరితో చేయాలనుంది?

నాకు మహేష్ బాబు, ఎన్టీఆర్ అంటే చాలా ఇష్టం. వాళ్ళు నా ఫేవరెట్ హీరోలు. స్క్రిప్ట్ కుదిరితే వాళ్లతో మల్టీస్టారర్ చేయాలనుంది.

సొంత నిర్మాణ సంస్థ మొదలుపెట్టే ఆలోచన ఏదైనా?

నాకు సినిమాతో ఏదో విధంగా అసోసియేట్ అవ్వడం ఇష్టం. అన్నీ అనుకున్నట్లు జరిగితే నిర్మాత కూడా అవుతానేమో.

ఆహా గురించి మీరేం చెబుతారు?

మా చిత్రాన్ని వాళ్ళు చాలా బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఆహా వంటి ఓటిటి సంస్థ ద్వారా మా చిత్రం విడుదల కానుండడం నిజంగా చాలా ఆనందంగా ఉంది.

ఒరేయ్ బుజ్జిగా గురించి చెప్పమంటే ఏం చెబుతారు?

2 గంటల పాటు ఏ టెన్షన్ లేకుండా హాయిగా ఎంటర్టైన్ చేసే చిత్రం మా ఒరేయ్ బుజ్జిగా. ప్రస్తుత పరిస్థితుల వల్ల అందరూ వివిధ రకాల టెన్షన్స్ తో సతమతమవుతున్నారు. వాళ్లందరికీ ఒరేయ్ బుజ్జిగా మంచి రిలీఫ్.

ఏవైనా కొత్త ప్రాజెక్ట్స్ సైన్ చేసారా?

మొత్తం 7 ప్రాజెక్టులు ఈ మధ్య కాలంలో సైన్ చేశాను. నా తర్వాత చిత్రం కూడా విజయ్ కుమార్ కొండా దర్శకత్వంలోనే ఉంటుంది. మిగతా ప్రాజెక్టుల విషయాలు త్వరలో తెలియజేస్తా.

వెబ్ సిరీస్ లలో నటించే ఉద్దేశం ఏమైనా ఉందా?

వెబ్ సిరీస్ లలో నటించాలని నాకు కూడా ఉంది. నిజానికి ఒక వెబ్ సిరీస్ కు సైన్ చేశా. అయితే డేట్స్ క్లాష్ వల్ల తప్పుకోవాల్సి వచ్చింది. ఫ్యూచర్ లో కచ్చితంగా వెబ్ సిరీస్ లో నటిస్తా.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

Satya: తల్లిదండ్రులు-కొడుకు, ఫ్యామిలీ ఎమోషన్ తో ‘సత్య’..

Satya: ‘తల్లిదండ్రులు-కొడుకు సెంటిమెంట్ తో ఎన్నో సినిమాలు వచ్చాయి. కానీ.. తన వల్ల అమ్మానాన్నలు ఇబ్బంది పడకూడదనే  ఓ కొడుకుపడే తపనతో తెరకెక్కిన ఎమోషనల్‌ డ్రామా...

సినిమా రివ్యూ: బాక్ మూవీ

హర్రర్ కామెడీ అనే జోనర్‌లో ఇప్పటికే చాలా సినిమాలొచ్చాయ్. ఎన్ని సినిమాలొచ్చినా, ఓ మోస్తరు కంటెంట్ వుంటే తేలిగ్గానే పాస్ అయిపోతాయ్.! అలాంటి జోనర్‌కే చెందిన...

రాజకీయం

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

బొత్సకి డబుల్ షాక్ తప్పేలా లేదే.!

వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, నిజానికి ఈ ఎన్నికల్లో పోటీ చేయాలనుకోలేదు. రాజ్యసభ సీటు అడిగారట గతంలోనే బొత్స. కానీ, ఈసారికి పోటీ చేయాలనీ, ఆ తర్వాత చూద్దామనీ.....

ఎక్కువ చదివినవి

Nagarjuna: నాగార్జునతో బాలీవుడ్ హీరో ఢీ..! ఆసక్తి రేకెత్తిస్తున్న న్యూస్

Nagarjuna: సినిమాల్లో కాంబినేషన్స్ ఎప్పుడూ ఆసక్తి రేకెత్తిస్తూంటాయి. ప్రస్తుత రోజుల్లో సినిమాకు బిజినెస్ జరగాలన్నా.. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ కలగాలన్నా కాంబినేషన్స్ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు మేకర్స్. ఈక్రమంలోనే టాలీవుడ్, బాలీవుడ్ కి...

ఎన్నికల వేళ గిట్టబాటవుతున్న ‘కూలీ’.!

ఎన్నికల ప్రచారం ఓ ప్రసహనం ఈ రోజుల్లో.! మండుటెండల్లో అభ్యర్థులకు చుక్కలు కనిపిస్తున్నాయి. పార్టీల క్యాడర్ పడే పాట్లు వేరే లెవల్.! కింది స్థాయి నేతల కష్టాలూ అన్నీ ఇన్నీ కావు.! ఇంతకీ, ఎన్నికల...

Bahubali Animated Series: మరో సంచలనం..! ‘బాహుబలి’పై రాజమౌళి ప్రకటన

Bahubali Animated Series: భారతీయ సినీ పరిశ్రమ మొత్తం తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన సినిమాలు బాహుబలి (Bahubali) సిరీస్. రాజమౌళి (Rajamouli) దర్శకత్వంలో వచ్చిన రెండు సినిమాలు బాక్సాఫీస్ ను...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...