Switch to English

బెంజి కారు.. మంత్రిగారి కంగారు.. ఏందీ తకరారు.!

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,421FansLike
57,764FollowersFollow

ఓ బెంజి కారు ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆ కారు మంత్రిగారబ్బాయ్‌కి బహుమతిగా వచ్చిదంటూ ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీ విమర్శిస్తుండడమే అందుక్కారణం. అయితే, ఆ కారు.. సదరు మంత్రిగారబ్బాయ్‌ పేరు మీద రిజిస్టర్‌ అవ్వలేదు. కానీ, ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంలో ఏ14 నిందితుడిగా వున్న కార్తీక్‌ అనే వ్యక్తి పేరు మీద రిజిస్టర్‌ అయి వుంది.

ఆ కారుకి ఆనుకుని నిలబడి ఫొటోలకు పోజులిస్తూ, ‘క్యాప్షన్‌ అవసరం లేదు’ అంటూ సోషల్‌ మీడియాలో పెట్టుకున్నారు మంత్రిగారబ్బాయ్‌. ఇంకో ఫొటోలో నిందితుడు కార్తీక్‌తోపాటు, మంత్రిగారబ్బాయ్‌ ‘కారు కీస్‌ ఎక్స్‌ఛేంజ్‌’ చేసుకుంటూ కనిపిస్తున్నారు. మంత్రిగారేమో, ‘మా అబ్బాయికి బోల్డంతమంది ఫ్యాన్స్‌ వున్నారు. అందులో ఓ వ్యక్తి.. తాను కొత్త కారు కొంటున్నానని కోరితే, తన కుమారుడేమో ఆ కారు తాళాల్ని సదరు కార్తీక్‌కి అందిస్తూ ఫొటోలకు పోజులిచ్చాడు’ అని సెలవిచ్చారు.

‘ఆ కారు మా అబ్బాయి పేరు మీద వుందని నిరూపిస్తే, నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తా..’ అంటూ సవాల్‌ విసిరేశారు మంత్రి గుమ్మనూరు జయరాం. వావ్‌.. సవాల్‌ అదిరింది కదూ.! అయినా, ఎక్కడన్నా కీలక పదవుల్లో వున్నవారు తమ పేర ఖరీదైన కార్లు వుంచుకుంటారా.? రాజకీయాల్లో చాలా అరుదుగా మాత్రమే చూస్తుంటాం సొంత లగ్జరీ కార్లలో తిరగడం.

అంతెందుకు, ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డిగారికి లగ్జరీ కార్లు వున్నాయా.? మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుగారికి వున్నాయా.? కానీ, వారి ఖరీదైన జీవితాలేంటో ప్రపంచానికి తెలుసు. అక్షరాలా కోటి రూపాయల కారు మంత్రిగారబ్బాయికి బహుమతిగా వచ్చిందా.? లేదంటే, ఆ కారు ముందు జస్ట్‌ ఓ అభిమాని కోసం ఫొటోలకు పోజులిచ్చారా.? అన్నది తేలాల్సి వుందిప్పుడు.

ఈఎస్‌ఐ మెడికల్‌ స్కాంలో అచ్చెన్నాయుడిని అరెస్ట్‌ చేసి, లోపలేశారు. బెయిల్‌ రావడానికి నానా తంటాలూ పడాల్సి వచ్చింది అచ్చెన్న. చివరికి అచ్చెన్న ఆ స్కాం ద్వారా లబ్ది పొందినట్లు ఏసీబీ నిరూపించలేకపోయింది. మరిప్పుడు, మంత్రిగారబ్బాయ్‌ విషయంలో ‘కారు’ కనిపిస్తోంది.. ‘కారుతో దిగిన ఫొటోలూ’ కనిపిస్తున్నాయి. ఏసీబీనే విచారణ చేపడుతుందో.. సీబీఐనే రంగంలోకి దిగుతుందో.. కాస్త స్పీడుగా అవేవో జరిగిపోయి మంత్రిగారబ్బాయ్‌ని ‘కడిగిన ముత్యం’ అని ప్రకటించేసి, మంత్రిగారి నిజాయితీని నిరూపించేస్తే బావుణ్ణనే చర్చ సర్వత్రా జరుగుతోంది.

4 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Jr.Ntr Birthday special: టెక్నీషియన్స్ ఫేవరెట్.. జూ.ఎన్టీఆర్..! ఉదాహరణలివే..

Jr.Ntr Birthday special: తెలుగు సినీ పరిశ్రమలో ఘనమైన కుటుంబ నేపథ్యం ఉన్న కుటుంబాల్లో ఒకటి నందమూరి. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ మనవడిగా.. హరికృష్ణ...

చిరంజీవి, కమల్ హాసన్.! ఎవరు గొప్ప నటుడు.?

సోషల్ మీడియా వేదికగా ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్.. ఇవేవీ లేకపోతే, చాలామంది అనాధలైపోతారు.! అనాధలైపోవడమంటే, ఎవరూ పట్టించుకోకుండా పోతారని అర్థం. ఈ లిస్టులో కొందరు సెలబ్రిటీలనబడేవారు...

Prabhas: ప్రభాస్ చెప్పిన బుజ్జి ఇదే.. ఉత్కంఠ రేకెత్తిస్తున్న వీడియో

Prabhas: స్టార్ హీరో ప్రభాస్ (Prabhas) ఇటివల ‘హాయ్.. డార్లింగ్స్. నా లైఫ్ లోకి కొత్తగా ఒకరు వస్తున్నారు. వెయిట్ చేయండి’ అనే పోస్ట్ బాగా...

SSMB 29: మహేశ్-రాజమౌళి సినిమాలో మరో స్టార్ హీరో..! నిజమెంత..!?

SSMB 29: సూపర్ స్టార్ మహేశ్ (Mahesh) – రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో ఓ భారీ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రకటించినప్పటి నుంచీ...

Silk Saree: మే24న వస్తున్న రొమాంటిక్ లవ్ స్టోరీ.. ‘సిల్క్ శారీ’

Silk Saree: వాసుదేవ్ రావు, రీవా చౌదరి, ప్రీతి గోస్వామి హీరో హీరోయిన్లుగా టి. నాగేందర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా "సిల్క్ శారీ" (Silk Saree)....

రాజకీయం

కాంగ్రెస్ గెలవాలని వైసీపీ కోరుకుంటోందా.?

రాజకీయాల్లో శాశ్వత శతృవులు శాశ్వత మిత్రులు ఎవరూ వుండరన్నది అందరికీ తెలిసిన విషయమే.! ఆ సూత్రాన్ని వైసీపీ కూడా పాటించక తప్పేలా లేదా.? అంటే, ఔననే వాదన వినిపిస్తోందిప్పుడు.! అసలు విషయమేంటంటే, ఆంధ్ర ప్రదేశ్...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

నాగబాబు ఈజ్ బ్యాక్.! ట్వీటుని తొలగించిన వైనం.!

సినీ నటుడు, జనసేన నేత కొణిదెల నాగబాబు ట్విట్టర్ అకౌంట్ నుంచి ఓ ట్వీటు పడింది. ‘మాతో వుంటూ ప్రత్యర్థులకి పని చేసేవాడు మా వాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే..’...

ఐదేళ్ళుగా సినీ పరిశ్రమను దోచేశాం: వైసీపీ అను‘కుల’ మీడియా.!

ఐదేళ్ళపాటు అధికారంలో వున్నాం.. అందినకాడికి సినీ పరిశ్రమని అడ్డగోలుగా దోచేసుకున్నాం.! ఇదీ వైసీపీ అను‘కుల’ మీడియా చెబుతున్నమాట.! ఆంధ్ర ప్రదేశ్‌లో ఐదేళ్ళపాటు అధికారం వెలగబెట్టిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తన చెప్పు చేతల్లో...

గ్రౌండ్ రిపోర్ట్: సంక్షేమ పథకాలు ఓట్లను రాల్చుతాయా.?

ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌కి ముందూ, పోలింగ్ తర్వాతా.. అధికార వైసీపీ, ‘సంక్షేమ పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయ్..’ అని చెబుతుండడం చూస్తున్నాం. సంక్షేమం పేరుతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేయడం అనేది...

ఎక్కువ చదివినవి

జగన్ ప్రజల్ని బిచ్చగాళ్ళలా చూశారా.? ప్రశాంత్ కిషోర్ ఉవాచ ఇదేనా.?

ప్రజాధనాన్ని అభివృద్ధి కోసం వినియోగించకుండా, సంక్షేమ పథకాల పేరుతో సొంత పబ్లిసిటీ చేసుకోవడానికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వినియోగించారంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం కోసం పని...

జనసేన మీద వైసీపీ నేతలు బెట్టింగ్ కాస్తున్నారా.?

ఇదో ఇంట్రెస్టింగ్ పరిణామం.! అదీ, ఉభయ గోదావరి జిల్లాల్లో చోటు చేసుకుంటున్న వైపరీత్యం.! జనసేన పార్టీ గెలుస్తుందని వైసీపీ నేత ఒకరు భారీ స్థాయిలో డబ్బులు పందెం కాశారట. వేలల్లో అయితే వింతేమీ...

Elephant: గున్న ఏనుగుకు జెడ్ కేటగిరీ భద్రత.. వీడియో వైరల్

Elephant: కుటుంబం తమ పిల్లల సంరక్షణను ఎలా చూసుకుంటుందో మానవ సంబంధాలలో చూస్తూంటాం. తమకూ తెలుసనిపించేలా ఉన్న అడవిలోని ఏనుగులకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఐఏఎస్ అధికారిణి సుప్రియా సాహు ‘ఎక్స్’లో...

ఎర్ర టవల్ చూస్తే వంగా గీతకు అంత భయమెందుకు.?

పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీతకి ఓ పోలింగ్ కేంద్రంలో చిత్రమైన అనుభవం ఎదురయ్యింది. ‘నమస్కారం పెడుతూ, నాకు ఓటెయ్యడం మర్చిపోవద్దు..’ అంటూ క్యూలైన్లలో వున్న ఓటర్లను అభ్యర్థిస్తూ వెళ్ళడంపై కొందరు ఓటర్లు...

కింగ్ మేకర్ జనసేనాని పవన్ కళ్యాణ్.!

పోలింగ్ ముగిసింది.. కౌంటింగ్ కోసం రాష్ట్రం ఎదురుచూస్తోంది.! ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలకు సంబంధించి ప్రజా తీర్పు, ఈవీఎంలలో నిక్షిప్తమైంది. జూన్ 4న లెక్కలు తేలతాయ్.! ఈలోగా రకరకాల అంచనాలు.. ఫలానా...