ఈమద్య కాలంలో తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంటున్న విషయం తెల్సిందే. పలు సినిమాలు ఇప్పటికే వందల మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్నాయి. అల్లు అర్జున్ సినిమాలు అక్కడ అత్యధికంగా వ్యూస్‌ను దక్కించుకున్న విషయం తెల్సిందే. అయితే ఎనర్జిటిక్ స్టార్ రామ్ అక్కడ ఒక అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. ఏకంగా నాలుగు సినిమాలతో వంద మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్నాడు.
ఇటీవల రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంను హిందీలో డబ్ చేశారు. ఆ సినిమా యూట్యూబ్‌లో రికార్డు స్థాయి వ్యూస్‌తో దూసుకు పోతుంది. ప్రస్తుతం వంద మిలియన్లు క్రాస్ చేసిన ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ ఈ రికార్డును సొంతం చేసుకున్నాడు. ఇప్పటి వరకు తెలుగు సినిమాలు చాలనే వంద మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్నాయి. కాని రామ్ మాత్రమే ఏకంగా నాలుగు వంద మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకున్నాడు.
తెలుగులోనే కాకుండా సౌత్‌లో ఏ హీరో కూడా ఇప్పటి వరకు ఇలా నాలుగు సినిమాలతో వంద మిలియన్ల వ్యూస్‌ను ఉత్తరాధిన దక్కించుకోలేదు. రామ్ సినిమాలకు అక్కడ ప్రేక్షకులు తెగ ఫిదా అవుతున్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో పాటు అంతకు ముందు ఉన్నది ఒక్కటే జిందగీ, హలో గురు ప్రేమకోసమే, నేను శైలజ చిత్రాలు కూడా హిందీలో డబ్ అయ్యి వంద మిలియన్ల వ్యూస్‌ను రాబట్టాయి. రామ్ నటించిన మరికొన్ని సినిమాలు కూడా వంద మిలియన్ల వ్యూస్ దిశగా దూసుకు పోతున్నాయి.
170936 454982Thanks so significantly for another post. I be able to get that kind of information info. friend, and exactly. 743856