Switch to English

ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ: ఏజెంట్ డైరెక్టర్ స్వరూప్ – టాలీవుడ్ లో తారక్ – బన్నీ, పాన్ ఇండియాలో ప్రభాస్ – ఆమిర్ ఖాన్.!

2019లో ట్రైలర్ రిలీజైన దగ్గరి నుంచి సినిమా విడుదలయ్యి సూపర్ హిట్ అయ్యే వరకూ అటు ప్రేక్షకులు, ఇటు సెలబ్రిటీస్ బాగా మెచ్చుకున్న సినిమా ‘ఏజంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’. ఈ సినిమా ద్వారా తెలుగు తెరకు చాలా రోజులుగా చూడని ఓ జానర్ ని మళ్ళీ పరిచయం చేసి శభాష్ అనిపించుకున్న డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె.. తన జాబ్ ని వదిలేసి సినిమా మీద పాషన్ తో ఇండస్ట్రీకి వచ్చి మొదటి సినిమాతో ఇండస్ట్రీ అంటా తనవైపు తిప్పుకునేలా చేసిన డైరెక్టర్ స్వరూప్ తో మేము ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసాం.. ఆ విశేషాలు..

ఇంట్లో 3 ఇయర్స్ పర్మిషన్ తీసుకొని వచ్చారు. అనుకున్న టైం కి టార్గెట్ రీచ్ అయ్యారా? ఇంతకీ సినిమా సక్సెస్ అయ్యాక ఫ్యామిలీ రెస్పాన్స్ ఏంటి?

2016లో సెకండాఫ్ లో వచ్చాను, 2018 మొదట్లో ప్రొడ్యూసర్ ఓకే అయ్యాడు, ఫైనల్ గా 2019 మూవీ రిలీజ్ అయ్యింది. లక్కీగా 3ఏళ్లలో అన్నీ జరిగిపోయాయి. రిజల్ట్ తర్వాత ఫ్యామిలీ చాలా హ్యాపీ.. ఇండస్ట్రీలో సెట్ అయిపోతాడని వాళ్ళకి నమ్మకం వచ్చింది. మా నాన్న సినిమాలు తక్కువ చూస్తారు, చూసాక బాగా నచ్చింది. దాంతో మా నాన్న తనతోటి స్టాఫ్ ని, స్నేహితుల్ని.. ఇలా రోజూ ఏదో ఒక బ్యాచ్ ని సినిమాకి పంపేవారు. తిరుపతిలో వచ్చిన కలెక్షన్స్ లో 20% మా నాన్నగారి స్పాన్సర్ చేసిందే..

‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ టైంలో మీరు పేస్ చేసిన బిగ్ ఛాలెంజ్?

షూటింగ్ లో మాత్రం మాన్ మేనేజ్మెంట్ చాలా కష్టమైంది. ఎందుకంటే నిర్మాత, మ్యూజిక్ డైరెక్టర్ తప్ప నాతో సహా అందరం కొత్తవాళ్ళమే కావడం వల్ల సెట్లో అందరినీ మేనేజ్ చేయడం కష్టమయ్యింది. అలాగే అప్పట్లో నాకు ఓ భ్రమ ఉండేది.. మనం మంచి సినిమా తీసేస్తే డిస్ట్రిబ్యూటర్స్ వచ్చి సినిమా కొనేసుకుంటారు, రిలీజ్ చేసేస్తారు అనుకునేవాడిని. కానీ రియాలిటీలో అలా జరగదు.. రిలీజ్ కోసం చాలా స్ట్రగుల్ ఉంటుంది.

‘స్క్రిప్ట్ టు ఫిల్మ్ సక్సెస్’ జర్నీలో మీరు నేర్చుకున్న విలువైన పాయింట్.?

మనం కథ అంతా రాసుకొని ఫైనల్ చదువుకున్నాక ఒక సూపర్ ఫీల్ ఉంటుంది. కానీ మేకింగ్ అనే ప్రాసెస్ లో సరిగా వస్తుందా లేదా అని పలువురు డౌట్స్ పెడుతుంటారు, ఫైనల్ వాళ్ళకి వీళ్ళకి చూపించాక ఒక్కొక్కరు ఒక్కో ఒపీనియన్ చెప్తారు. ఆ టైంలో మీరు తీసిన దానిమీద మీకే జడ్జ్ మెంట్ పోతుంది. కథ రాసినప్పుడు మనకి ఏ ఫీలింగ్ ఉంటుందో, అంతే పర్ఫెక్ట్ గా తీస్తే మీ ఫీల్ ని ఫస్ట్ డే సినిమా చూసినప్పుడు ఆడియన్స్ కూడా ఫీలవుతారు. ఎందుకంటే ఏజెంట్ విషయంలో నేను రాసుకునేప్పుడు ఏదైతే ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారనుకున్నానో అదే జరిగింది. అందుకే ఇకపై ఫీడ్ బ్యాక్ తీసుకోవాలి కానీ దానివల్ల డిప్రెస్ అయిపోకూడదనే పాఠం నేర్చుకున్నాను.

ఏజంట్ రిలీజయ్యాక మీకొచ్చిన ది బెస్ట్ కాంప్లిమెంట్??

నిజంగా చెప్పాలంటే నాకు సెలబ్రిటీస్ ఇచ్చిన కాంప్లిమెంట్స్ కంటే.. ఫస్ట్ డే ప్రసాద్స్ మార్నింగ్ 8:45 షో చూసి నేను, నవీన్ అండ్ టీం కిందకి వస్తుంటే.. అందరూ ఆత్రేయ ఆత్రేయ అని అరుస్తున్నారు. ఆ ఛీరింగ్ కి మించిన కాంప్లిమెంట్ ఇంకొకటి లేదు. ఆ మూమెంట్ లో నేను, నవీన్ ఏడ్చేశాం. ఆ తర్వాత చాలా మంది హీరోస్, డైరెక్టర్స్ కాంప్లిమెంట్స్ ఇచ్చారు. 3 వారల పాటు అది నిజమా కాదా అనే హ్యాంగోవర్లో ఉన్నాం.

ఈ క్వారంటైన్ టైంలో జరిగిన బెస్ట్ అండ్ వరస్ట్ మోమెంట్ ఏంటి?

వరస్ట్ మోమెంట్ అంటే వరల్డ్ మొత్తం అలా ఫ్రీజ్ అయిపోవడం అనేది న్యూస్ లో చూడడం చాలా బాడ్ ఫీలింగ్.. ఇక బెస్ట్ అంటే ఫ్యామిలీతో టైం స్పెండింగ్, కుకింగ్ అండ్ మా పాపతో ఎంజాయ్ చేస్తున్నా.. మళ్ళీ సినిమా స్టార్ట్ అయితే ఇవి మిస్ అయిపోతాం..

రైటర్ అండ్ డైరెక్టర్ గా ఎవరి ప్రభావం మీ పై ఎక్కువ ఉంటుంది?

2001లోనే ఐతే సినిమాతో చంద్రశేఖర్ యేలేటి గారు రెగ్యులర్ ఫార్మాట్ ని బ్రేక్ చేశారు. అందుకే చంద్రశేఖర్ యేలేటి గారంటే ఇష్టం. అలాగే సుకుమార్, కార్తీక్ సుబ్బరాజ్, రాజ్ కుమార్ హిరాణి అండ్ హాలీవుడ్ లో అయితే మార్టిన్ స్కోర్సేసే ల ప్రభావం రైటర్ గా, డైరెక్టర్ గా నాపై ఉంటుంది. డైలాగ్స్ తో కూడా ఓ సినిమాని ఇంతలా నడిపించచ్చా అని షాక్ చేసింది మాత్రం త్రివిక్రమ్ గారే..

ఓ కథ రాయడం ఎక్కడ నుంచీ మొదలు పెడతారు. మీరు రైటర్ అండ్ డైరెక్టర్.. సో ఎవరెవర్ని ఎక్కువ డామినేట్ చేస్తారు.

ఏజెంట్ సినిమా క్యారెక్టర్ డ్రివెన్ సినిమా కావడం వలన.. ముందు ఆత్రేయ పాత్ర రాసుకొని తర్వాత మిగతా అన్నీ యాడ్ చేసాను. కానీ మిగతా కథల విషయంలో సెటప్ అండ్ 20 నిమిషాల క్లైమాక్స్ సెట్ చేసుకున్నాకే మిగతా కథ రాయడం మొదలు పెడతాను. నా నెక్స్ట్ రెండు సినిమా కథలు అలానే రాసుకున్నాను. నాలో రైటరే ఎక్కువ డామినేట్ చేస్తాడు. అండ్ నేను అక్కడికక్కడ నిర్ణయాలు తీసుకోలేను కావున ఒకసారి సెట్ కి వెళ్ళాక రైటర్ అనేవాడు రాడు, ఓన్లీ డైరెక్టర్. ఉన్నది తీసుకుంటూ వెళ్తాను.

మీ తదుపరి సినిమా ఏ జానర్ లో, ఏ హీరోతో ఎప్పుడు మొదలు కానుంది?

నెక్స్ట్ సినిమా కూడా ఈ మధ్య కాలంలో తెలుగులో రాని జానర్లో చేస్తున్నాను. ప్రజెంట్ టైంలో జరిగే ఓ డిజాస్టర్ బేస్డ్ డ్రామా(ఉదాహరణ – 2012 ) అని చెప్పచ్చు. విజువల్ ఎఫెక్ట్స్ కి కూడా కొంత స్కోప్ ఉంటుంది. కథే హీరోని సెలెక్ట్ చేసుకోవాలనేది నేను బలంగా నమ్ముతాను. అందుకే ఫస్ట్ స్క్రిప్ట్ మీద పడ్డాను.. ఫిబ్రవరికి స్క్రిప్ట్ ఫినిష్ చేసాను, ఒక బిగ్ ప్రొడక్షన్ రెడీగా ఉంది, మేము వెళ్లి నేరేషన్ ఇద్దామనుకునే టైంలో లాక్ డౌన్ అయిపోయాం. ఇదయ్యాక నేరేషన్ ఇచ్చి హీరోని ఫిక్స్ చేసుకోవాలి. నా ఫస్ట్ మూవీ టైంలో హీరోతో ఎక్కువ ట్రావెల్ అయ్యాను. సెకండ్ ఫిలింకి కూడా అలానే హీరోతో ట్రావెల్ అవ్వాలనుకుంటున్నా, అలాగే ఒక 6 నుంచి 8 నెలలు ప్రీ ప్రొడక్షన్ కి పడుతుంది. సో లాక్ డౌన్ అయ్యి అన్నీ సెట్ అయితే నెక్స్ట్ ఇయర్ సినిమా సెట్స్ పైకి వెళ్తుంది.

ఏజెంట్ డైరెక్టర్ స్వరూప్ – లోకల్ అయితే తారక్ – బన్నీ, పాన్ ఇండియా ఐతే ప్రభాస్ – ఆమిర్ ఖాన్.!మీ ఆల్ టైం ఫెవరైట్ హీరో ఎవరు? ఒకవేళ సినిమా చేస్తే ఆయనతో ఎలాంటి సినిమాలు చేస్తారు?

నా ఆల్ టైం పేవరైట్ హీరో అంటే మెగాస్టార్ చిరంజీవి గారు.. అయన వల్లే ఇలా సినిమాల్లోకి వచ్చాను. ఇండస్ట్రీలో కలవాలి అనుకున హీరో చిరంజీవి గారే. లక్కీగా జీ వర్డ్స్ లో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డు అందుకునే టైంలో చిరంజీవి గారు వచ్చారు. అవార్డు తీసుకొని ఆయన దగ్గరికి వెళ్లి బ్లెస్సింగ్స్ తీసుకున్నా.. అది నా లైఫ్ టైం మోమెంట్ అని చెప్పచ్చు. ఇప్పుడైతే నాని గారంటే చాలా ఇష్టం. చిరు గారితో సినిమా చేయాలంటే నా స్టైల్ లో ఓ పవర్ ప్యాక్ యాక్షన్ ఎంటర్టైనర్ చేయాలని ఉంది. అలాగే నాని గారితో అయితే రాజ్ కుమార్ హిరాణి గారి స్టైల్లో ఓ సోషల్ మెసేజ్ చెబుతూ ఫుల్ ఎంటర్టైన్మెంట్ చేయాలని ఉంది.

ఒకవేళ మీకు మల్టీస్టారర్ సినిమా చేసే అవకాశం వస్తే.. టాలీవుడ్ లో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు?

తెలుగులో అయితే ఎన్.టి.ఆర్ అండ్ అల్లు అర్జున్ ని కలిపి ఒక సినిమా చేయాలి. వారిద్దరిలో స్వాగ్ అండ్ ఎనర్జీ లెవల్స్ పీక్స్ లో ఉంటాయి, అది నాకు బాగా ఇష్టం. అందుకే వాళ్లిద్దరూ హీరోలుగా జాన్ విక్ స్టైల్ లో మైండ్ బ్లోయింగ్ యాక్షన్ ఫిల్మ్ చెయ్యాలి.

ఒక పదేళ్ళ తర్వాత టాలీవుడ్ లో మిమ్మల్ని మీరెలా చూస్కోవాలనుకుంటున్నారు?

హానెస్ట్ గా చెప్పాలంటే ఎంత పెద్ద కమర్షియల్ హిట్, ఏ స్టార్ తో చేసాం అనేదానికంటే మంచి సినిమాలు తీశాను అనే ఫీలింగ్ ఉండిపోవాలి. సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలు చేసేయాలని లేదు. రెండేళ్లు టైం తీసుకున్నా మన తెలుగు సినిమా గురించి మిగిలిన అన్ని భాషల వారు మాట్లాడుకునేలా ఉండాలి అనుకుంటాను.

మీరు ఇన్స్పిరేషన్ కోసం మీ లాప్ టాప్ లో ఎప్పుడు ఉంచుకునే టాప్ 5 ఫిలిమ్స్?

అనుకోకుండా ఒక రోజు, షట్టర్ ఐలాండ్, జిగర్తాండ, రాజ్ కుమార్ హిరాణి ఫిలిమ్స్ అండ్ రీసెంట్ గా c/o కంచరపాలెం చాలా ఇష్టం.

ఏజెంట్ సీక్వెల్ ఎప్పుడు?

ఆ ప్రాసెస్ కూడా నడుస్తోంది. ఇటీవలే ఏజెంట్ సెకండ్ పార్ట్ కి ఓ మంచి పాయింట్ సెట్ అయ్యింది. సీక్వెల్ అంటే మళ్ళీ హీరో డిటెక్టివ్, అతను మరో కేసు సాల్వ్ చేయడంలా కాకుండా కంప్లీట్ డిఫరెంట్ ఫార్మాట్ లో ఉంటుంది. లాక్ డౌన్ లో ఈ కథ రాసే పనిలోనే ఉన్నాను.

మీ బిగ్గెస్ట్ డ్రీం ప్రాజెక్ట్ అండ్ అందులో హీరోలుగా ఎవరిని సెలక్ట్ చేసుకుంటారు?

అందరికీ రీచ్ అయ్యేలా ఒక పాన్ ఇండియా మల్టీ స్టారర్ సినిమా చెయ్యాలి. ఇప్పుడైతే ఆ పాన్ ఇండియా సినిమాలో మన బాహుబలి ప్రభాస్ అండ్ పెర్ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ లని హీరోలుగా సెలెక్ట్ చేసుకుంటాను.

అంతటితో స్వరూప్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ కి ఆల్ ది బెస్ట్ చెప్పి ఇంటర్వ్యూ ఫినిష్ చేసాం..

Interviewed By

RAGHAVA

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

పోతిరెడ్డిపాడుపై స్పందించిన చంద్రబాబు.. ఏమన్నారంటే..

కొన్ని రోజులుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారిన అంశం పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు. రాయలసీమ కరువు పోగొట్టడానికి పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు సామర్ధ్యం పెంచుతామని సీఎం జగన్ చెప్పడంతో రెండు రాష్ట్రాల్లో...

14 వేల సినీకార్మికుల‌కు నిత్యావ‌స‌రాలు పంపిణీ చేసిన తారలు

సినీ-టీవీ కార్మికులకు సాయం అందించేందుకు వచ్చిన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్ర‌ఫీ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస యాద‌వ్, తలసాని సాయికిరణ్ యాదవ్ ముందుకు వచ్చారు. 14 వేల మంది సినీకార్మికుల‌ కుటుంబాలకు త‌ల‌సాని ట్రస్ట్...

గ్రాము తేలు విషం రూ. 7.3 లక్షలు, అది ఎందుకు ఉపయోగిస్తారో తెలుసా?

పాము కుట్టినా, తేలు కుట్టినా కూడా ప్రాణం పోయినంత మంటగా నొప్పిగా ఉంటుంది. కొన్ని పాములు మరియు తేలు కుడితే వెంటనే మృతి చెందుతారు. కాని కొన్ని రకాల పాములు తేల్లు కుడితే...

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్ లో మాట్లాడారు. టీడీపీలోకి ఎన్టీఆర్ రావాలంటున్నారని...

దేవభూమిలో అగ్ని ప్రమాదంపై సినీ ప్రముఖుల స్పందన

ప్రపంచ వ్యాప్తంగా కరోనా కారణంగా లక్షల మంది భయాందోళనతో వణికి పోతున్న ఈ సమయంలో మరో వైపు తుఫాన్‌, భూకంపాలు, అగి ప్రమాదాలు జరుగుతున్నాయి. పకృతి విపత్తులు జరుగుతున్న ఈ సమయంలో అత్యంత...