అదేంటో, అధికార వైసీపీ పరిపాలన పరంగా ఏ కొత్త నిర్ణయం తీసుకున్నా, రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేగుతుంటుంది. సరే, విపక్షాలు అన్నీ రాజకీయ కోణంలోనే చూస్తూ, వివాదాలు రాజేస్తున్నాయా.? అన్నది వేరే చర్చ. అధికార వైసీపీ నేతలే రోడ్డెక్కి మరీ ప్రభుత్వ నిర్ణయాల్ని తప్పు పడుతున్నారంటే, కాస్త ఆలోచించాల్సిన విషయమే.
ముందస్తు వ్యూహంతో వైసీపీ శ్రేణుల్ని పక్కాగా మోహరించాకే, ఈ వివాదాలకి అధికార పార్టీ తెరలేపోతుందన్న విమర్శల్ని అంత తేలిగ్గా కొట్టి పారేయలేం. నిజానికి, జిల్లాల విభజన అనేది అత్యంత సున్నితమైన విషయం. ఆయా జిల్లాల్లో జిల్లాల విభజన గురించి చర్చ జరగాలి. ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ జరిగి తీరాలి.
కానీ, ‘మేం 151 సీట్లతో గెలిచాం.. మాకు ప్రజలు బంపర్ మెజార్టీతో అధికారం కట్టబెట్టారు. మాకు నచ్చిన నిర్ణయం మాకు నచ్చినప్పుడు తీసుకుంటాం..’ అనంటే కుదరదు. దురదృష్టమేంటంటే, అధికార పార్టీ తీసుకుంటున్న చాలా నిర్ణయాలు, ప్రజల ఆలోచనలతో సంబంధం లేకుండా వుంటున్నాయి.
జిల్లాల విభజన విషయంలోనూ అదే జరుగుతోంది. సరే, అయ్యిందేదో అయిపోయింది.. వివాదం రాజుకుంది. ప్రభుత్వం ఒక్కో వైఫల్యానికీ ఒక్కో విరుగుడన్నట్టు, సరికొత్త వివాదాల్ని ఇలా తెరపైకి తెస్తోందన్న విమర్శల సంగతి కాస్సేపు పక్కన పెడదాం.
రాష్ట్రానికి ఒకటే రాజధాని ఎందుకు.? మూడు రాజధానులు వుంటే తప్పేంటని అధికార వైసీపీ అంటోంది. మరి, జిల్లా కేంద్రాల విషయంలో కూడా ఒకటి మాత్రమే కాదు, అంతకు మించి.. అని ఎందుకు అనకూడదు.? పైగా, జిల్ల కేంద్రాలన్నీ, జిల్లాకి మధ్యలో వుండాలన్న దిశగా ప్రభుత్వం ఆలోచన చేసిందట. అదే నిజమైతే, రాజధాని ఎందుకు రాష్ట్రానికి మధ్యలో వుండకూడదు.?
చెప్పే మాటలకీ చేసే పనులకీ పొంతన లేకపోవడమంటే ఇదే మరి. జిల్లాల పేరుతో రచ్చకు తెరలేపి, ఆ మంటలకు తమ పార్టీ నేతల ద్వారానే ఆజ్యం పోయిస్తుండడాన్ని ఏ రకమైన రాజకీయం అనుకోవాలి.?
165237 858493When I originally commented I clicked the -Notify me when new surveys are added- checkbox and from now on whenever a comment is added I purchase four emails sticking with exactly the same comment. Maybe there is by any means you might get rid of me from that service? Thanks! 713357
72925 96336I got what you mean , saved to bookmarks , extremely decent internet site. 717877
745677 326309You would endure heaps of different advised organized excursions with various chauffeur driven car experts. Some sort of cope previous attributes and a normally requires a to obtain travel within expense centre, and even checking out the upstate New York. ??????? 177020