Switch to English

గుడ్ లక్ సఖి రివ్యూ : రొటీన్ స్పోర్ట్స్ డ్రామా

Critic Rating
( 2.00 )
User Rating
( 2.00 )

No votes so far! Be the first to rate this post.

91,427FansLike
56,277FollowersFollow
Movie గుడ్ లక్ సఖి
Star Cast కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ, రఘుబాబు
Director నగేష్ కుకునూర్
Producer సుధీర్ చంద్ర ప‌దిరి
Music దేవిశ్రీ ప్రసాద్
Run Time 2 hr 10 Mins
Release జనవరి 28, 2022

కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందించిన గుడ్ లక్ సఖి పలు మార్లు వాయిదా పడి ఎట్టకేలకు ఈరోజు విడుదలైంది. నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

కథ:

రిటైర్డ్ కల్నల్ (జగపతి బాబు) అనంతపురం జిల్లాలో దేశం కోసం షార్ప్ షూటర్లను సిద్ధం చేయాలనుకుంటాడు. ఈ ప్రాసెస్ లో భాగంగా సఖి (కీర్తి సురేష్) అనే అమ్మాయిని చూస్తాడు. ఏదైనా వస్తువుపై తన ఫోకస్, టార్గెట్ చూసి ఆశ్చర్యపోతాడు. తనకు ట్రైనింగ్ ఇస్తే కచ్చితంగా దేశానికి గర్వకారణంగా నిలుస్తుందని భావిస్తాడు.

అయితే సఖిని ట్రైన్ చేసే క్రమంలో కల్నల్ ఎదుర్కొన్న కష్టాలు ఎలాంటివి? సఖి చివరికి విజయం సాధించి కల్నల్ కు, తన ఊరికి, దేశానికి గర్వకారణంగా నిలుస్తుందా?

నటీనటులు:

మారుమూల పల్లెటూరి పిల్లగా కీర్తి సురేష్ సరిగ్గా సరిపోయింది. ఆమె రూపం, వస్త్రధారణ, డైలాగ్ డెలివరీ అన్నీ కూడా ఈ రోల్ కు పెర్ఫెక్ట్ గా సూట్ అయ్యాయి. స్వతహాగా మంచి నటి అయిన కీర్తి సురేష్ పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ కావడంతో సినిమా మొత్తాన్ని తన భుజాలపై మోసింది.

కోచ్ గా జగపతి బాబు బాగా చేసాడు. తన మోటివేషనల్ స్పీచ్ లు చిత్రంలో సరిగ్గా కుదిరాయి. ఇక ఆదికి స్క్రీన్ ప్రెజన్స్ పరంగా చిన్న పాత్రే అనిచెప్పుకోవాలి. అయితే కీర్తి సురేష్ తో తన కెమిస్ట్రీ నిజంగా బాగా వర్కౌట్ అయింది. నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో రాహుల్ రామకృష్ణ బాగానే చేసాడు. బిగ్ బాస్ ఫేమ్ శ్వేతా వర్మ క్యామియో పాత్రలో కనిపించింది.

సాంకేతిక వర్గం:

మహిళా సాధికారిత కాన్సెప్ట్ ను తన చిత్రం ద్వారా చూపించి ఇన్స్పైర్ చేయాలన్న దర్శకుడు నగేష్ కుకునూర్ ఆలోచన బాగుంది. అయితే రైటింగ్ వద్దే గుడ్ లక్ సఖి గాడి తప్పింది. పెద్దగా ఎలాంటి మలుపులు లేకుండా ప్లైన్ గా సాగిపోతుంది ఈ చిత్రం. ఇక ఎగ్జిక్యూషన్ పరంగా సరైన హై మూమెంట్స్ అన్నవే లేవు.

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. కొన్ని సిట్యువేషనల్ సాంగ్స్ మెప్పిస్తాయి. అలాగే తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా డీసెంట్ గా సాగింది. చిరంతన్ దాస్ అందించిన సినిమాటోగ్రఫీ ప్రామాణికంగా సాగింది. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ పర్వాలేదు. సౌండ్ మిక్సింగ్ సరిగా లేదు. కొన్ని డైలాగ్స్ క్లారిటీ లేవు. లిమిటెడ్ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ గుడ్ లక్ సఖి నిర్మాణ విలువలు బాగానే ఉన్నాయ్.

పాజిటివ్ పాయింట్స్:

  • కీర్తి సురేష్
  • నిడివి

నెగటివ్ పాయింట్స్:

  • స్క్రీన్ ప్లే
  • గ్రిప్పింగ్ ప్రెజెంటేషన్ లేకపోవడం

చివరిగా:

షార్ప్ షూటింగ్ నేపథ్యంలో సాగే విలేజ్ ఓరియెంటెడ్ రూరల్ డ్రామా గుడ్ లక్ సఖి. కీర్తి సురేష్, జగపతి బాబు, ఆది పినిశెట్టి వంటి వారు మంచి పెర్ఫార్మన్స్ లతో ఆకట్టుకున్నా నరేషన్ లో మలుపులు లేకపోవడం, సరైన కాన్ఫ్లిక్ట్ పాయింట్ లేకపోవడం చిత్ర ఫ్లో ను దెబ్బ తీశాయి. దీంతో గుడ్ లక్ సఖి బిలో యావరేజ్ డ్రామాగా మారింది.

తెలుగు బులెటిన్ రేటింగ్: 2/5

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

బిగ్‌ బాస్ 6 అభినయ శ్రీ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో తొమ్మిదవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన అభినయ శ్రీ కనీసం ఐదారు వారాలు అయినా ఉంటుందని చాలా...

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

రాజకీయం

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

అమరావతి రైతుల పాదయాత్రపై వైసీపీ ఉక్కుపాదం: ఉత్తరాంధ్ర వరకూ వెళ్ళదా.?

అమరావతి రైతుల పాదయాత్రపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఉక్కు పాదం మోపనుందా.? అటు ప్రభుత్వం తరఫున, ఇటు పార్టీ తరఫున ఆటంకాలు సృష్టించేందుకు వ్యూహాలు సిద్ధమవుతున్నాయా.? ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున నానా...

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

ఎక్కువ చదివినవి

బిగ్‌బాస్‌ పై ఏపీ హైకోర్ట్‌ లో పిటీషన్‌.. షాక్ తప్పదా!

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 నాలుగో వారం ముగింపు దశకు చేరుకుంది. ఆట ఆసక్తికరంగా మారుతున్న ఈ సమయంలో బిగ్బాస్ పై ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. శృతిమించిన శృంగార...

మునుగోడు పంచాయితీ.! అన్నీ జాతీయ పార్టీలేనా.?

తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి ఉప ఎన్నిక ఎప్పుడో ఖాయమైపోయింది. ఇప్పుడు ఉప ఎన్నిక నగారా కూడా మోగేసింది. నవంబర్ మొదటి వారంలో ఫలితం కూడా తేలిపోతుంది. కాంగ్రెస్, బీజేపీ తరఫున అభ్యర్థులు ఖరారైపోయారు....

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్ విహారి, రావు రమేష్, సీనియర్ నరేష్,...

వయసు పెరిగే కొద్ది స్కిన్‌ షో పెంచుతున్న మిల్కీ బ్యూటీ

మిల్కీ బ్యూటీ తమన్నా సినీ కెరియర్ ఆరంభం అయ్యి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ మధ్య కాలంలో ముద్దుగుమ్మ ఆఫర్ల విషయంలో కాస్త వెనుకబడిందని చెప్పాలి. చిన్నా చితికా సినిమాల్లో వెబ్ సిరీస్...

జ్యోతిలక్ష్మి, జయమాలిని పాటలకు డాన్సులేసేవాళ్ళు రైతులా.?

ఆయనో వైసీపీ నేత.! అమరావతి రైతుల్ని పెయిడ్ ఆర్టిస్టులనీ, కూకట్‌పల్లి ఆంటీలనీ అభివర్ణించిన పార్టీకి చెందిన నాయకుడు కదా.? జ్యోతిలక్ష్మి, జయమాలిని పాటలకు డాన్సులేసేవాళ్ళు రైతులా.? అని ఆయన ప్రశ్నించడంలో వింతేముంది.? ఓ...