Switch to English

ఔనా, జనసేనకు ఆ స్థాయిలో ఓటు బ్యాంకు పెరిగిందా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తరచూ జనంలోకి రాలేకపోతున్నారు. కరోనా పాండమిక్ అలాగే తాను కమిట్ అయిన సినిమాల నిర్మాణం పూర్తి చేయడం కోసం ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి రావడం.. ఇలా పలు కారణాలతో జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఎక్కువగా కనిపించడంలేదు.

అయితే, జనసేన శ్రేణులు ఎప్పుడు ఏం చేయాలన్నదానిపై అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూనే వున్నారు. గతానికి భిన్నంగా జనసేన నాయకులు జనంలో వుంటున్నారు. సరే, వారికి తెలుగు మీడియాలో తగిన ప్రాధాన్యత కనిపించదనుకోండి.. అది వేరే సంగతి.

సోషల్ మీడియా వేదికగా మాత్రం, జనసేన పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు.. తాము నిత్యం జనంతో ఇంటరాక్ట్ అవుతున్న వైనం గురించి తమకు తాముగా ప్రచారం చేసుకుంటూనే వున్నారు. అలా జనానికి అందుబాటులోనే వుంటున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు.

కాగా, ఇటీవల ఆయా నియోజకవర్గాల్లో జరుగుతున్న స్థానికంగా జరుగుతున్న కొన్ని సర్వేల్లో జనసేన పార్టీకి అనూహ్యమైన రీతిలో బలం పెరిగినట్లుగా తేలుతోంది. పశ్చిమగోదావరి జిల్లాలో 35 నుంచి 37 శాతం మేర జనసేన పార్టీకి ప్రజల నుంచి మద్దతు లభించనుందట.
టీడీపీ, వైసీపీ, జనసేన అలాగే కాంగ్రెస్, బీజేపీల విషయమై ఈ సర్వేలు జరుగుతున్నాయి. అయితే, ఎక్కడా బీజేపీ ప్లస్ జనసేన అన్న చర్చ జరగడంలేదట సర్వేల పరంగా.

ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేను 35 శాతానికి పైగా మద్దతు కనిపిస్తోంటే, ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా దాదాపు ఇదే పరిస్థితి వుందంటున్నారు. రాయలసీమలో మాత్రం 25 నుంచి 30 శాతం మద్దతు మాత్రమే జనసేనకు కనిపిస్తోంది. కాగా, తిరుపతిలో మాత్రం జనసేనకు 35 శాతానికంటే ఎక్కువ మద్దతు వుండబోతోందట.

అసలు ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారు.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. సోషల్ మీడియా వేదికగా ఈ సర్వేల ఫలితాలు కనిపిస్తున్నాయి. వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ టీమ్ చేస్తున్న సర్వేల్లో కూడా జనసేనకు ఆసక్తికర ఫలితాలు వస్తున్నాయనే చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని...

#NTR31: పవర్ఫుల్ ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల

యంగ్ టైగర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మరొక అనౌన్స్మెంట్ వచ్చింది. నిన్ననే ఎన్టీఆర్ 30వ చిత్ర అనౌన్స్మెంట్ వచ్చిన విషయం తెల్సిందే. ఈ సినిమాను...

విక్రమ్ తెలుగు డిస్ట్రిబ్యూషన్ హక్కులను సొంతం చేసుకున్న నితిన్ ప్రొడక్షన్ హౌస్

కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ సినిమా విక్రమ్ విడుదలకు ముందు బాగానే సందడి చేస్తోంది. దాదాపు నాలుగేళ్ల తర్వాత కమల్ హాసన్ సినిమా థియేటర్లలో విడుదలవుతోంది....

ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా రామ్ చరణ్ ఎమోషనల్ ట్వీట్

రామ్ చరణ్, ఎన్టీఆర్ ఎంత మంచి ఫ్రెండ్స్ అనేది ప్రేక్షకులు ఆర్ ఆర్ ఆర్ రిలీజ్ ముందు, తర్వాత చూసారు. వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ కు...

ఈ వారాంతం ఓటిటి ప్రియులకు పండగే!

మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్...

రాజకీయం

ఢిల్లీలో విద్యావిధానం భేష్.. దేశమంతటికీ ఎంతో అవసరం: సీఎం కేసీఆర్

ఢిల్లీ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. అనంతరం మోతీబాగ్ లోని సర్వోదయ ప్రభుత్వ పాఠశాలను కేజ్రీవాల్ స్వయంగా కేసీఆర్ కు చూపించారు. పాఠశాలలోని ప్రత్యేకలు,...

కాకినాడ జీజీహెచ్ వద్ద ఉద్రిక్తత.. వైసీపీ ఎమ్మెల్సీని అరెస్టు చేయాలని టీడీపీ పట్టు

వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు కారులో ఆయన మాజీ డ్రైవర్ మృతదేహం లభ్యమైన ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈనేపధ్యంలో వాస్తవాలు తెలుసుకునేందుకు టీడీపీ నిజనిర్ధారణ కమిటీ ఈరోజు కాకినాడలోని జీజీహెచ్...

వైసీపీ వింత.! ఎమ్మెల్సీ కారులో డ్రైవర్ మృతదేహం.!

అదేంటో, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి చాలా చిత్ర విచిత్రమైన వ్యవహారాలు తెరపైకొస్తుంటాయ్.! కామెడీ కాదు, సీరియస్.! అన్నట్టుగానే వుంటాయ్ ఆయా వ్యవహారాలు. వైసీపీ నేత, మాజీ మంత్రి వివేకానందరెడ్డి ‘గుండె పోటు -...

ఏపీలో ‘పవర్’ కట్.! ఇన్వర్టర్ లేదా పవన్ కళ్యాణ్.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆంధ్రప్రదేశ్‌లోని తమ పార్టీ కార్యాలయంలో మీడియా ప్రతినిథులతో సమావేశమయ్యారు.. మీడియా ప్రతినిథులు అడుగుతున్న ప్రశ్నలకు సమాధానాలిస్తున్నారు. సరిగ్గా, అదే సమయంలో ‘పవర్’ పోయింది. చిత్రమేంటంటే, రాష్ట్రంలో పరిశ్రమలకు...

’ముఖ్యమంత్రి‘ దావోస్ పర్యటనపై అంబటి రాంబాబు విసుర్లు.!

ముఖ్యమంత్రి వైఎస్ గజన్ మోహన్ రెడ్డి ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్ళిన సంగతి తెలిసిందే. ఈ సమయంలో మంత్రి అంబటి రాంబాబు, ముఖ్యమంత్రి మీద విసుర్లు వేయడమేంటి.? ఒక్క క్షణం...

ఎక్కువ చదివినవి

తెలంగాణ సహా.. 5 రాష్ట్రాల హైకోర్టులకు కొత్త ప్రధాన న్యాయమూర్తులు

తెలంగాణతోపాటు దేశంలోని అయిదు రాష్ఠ్రాలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. ఈ నేపథ్యంలో తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్, గువాహటి, రాజస్థాన్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల...

అంబేద్కర్ జిల్లా వెనుక అంత పెద్ద కథ వుందట.!

కోనసీమ జిల్లా కాస్తా అంబేద్కర్ జిల్లాగా మారబోతోంది. 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని 26 జిల్లాలుగా ఇటీవల వైఎస్ జగన్ సర్కారు మార్చిన విషయం విదితమే. కోనసీమ ప్రజల చిరకాల కోరిక ప్రత్యేక...

బాలయ్య సినిమాలో మాస్ ఖిలాడీ ఐటెం సాంగ్‌

అఖండ సినిమాతో సక్సెస్‌ జోష్ లో ఉన్న నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఇప్పటికే సినిమా నుండి ఫస్ట్‌ లుక్‌ ను రివీల్...

శేఖర్ మూవీ రివ్యూ

సీనియర్ హీరో రాజశేఖర్ నుండి వచ్చిన లేటెస్ట్ చిత్రం శేఖర్. మలయాళంలో సూపర్ హిట్ అయిన జోసెఫ్ కు రీమేక్ గా వచ్చిన ఈ చిత్రాన్ని రాజశేఖర్ భార్య జీవిత డైరెక్ట్ చేసారు....

బర్త్ డే స్పెషల్: తెలుగు సినిమా అణుబాంబు.. జూ..ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్.. అనే పేరు ఆయన అభిమానులకు పూనకాలు తెప్పిస్తే.. తెలుగు సినీ పరిశ్రమకు కూడా జోష్ వస్తుంది. సినిమాల్లో రెండు దశాబ్దాలకు పైగా పూర్తి చేసుకున్న ఆయన ప్రయాణంలో హిట్లు,...