అగ్ర నిర్మాత దిల్ రాజు గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తక్కువ కాలంలోనే టాప్ నిర్మాతగా ఎదిగి అక్కడి నుండి దాన్ని కాపాడుకుంటూ వస్తున్నాడు. నిర్మాత అవ్వకముందు డిస్ట్రిబ్యూటర్ అయిన దిల్ రాజు
ఇప్పటికీ టాప్ చిత్రాల డిస్ట్రిబ్యూషన్ ను నైజాం, వైజాగ్ ప్రాంతాల్లో హ్యాండిల్ చేస్తుంటాడు. రీసెంట్ గా ఆర్ ఆర్ ఆర్, కేజిఎఫ్ చాప్టర్ 2 ల హక్కులతో నైజాంలో చక్రం తిప్పిన దిల్ రాజుపై ఈ ప్రాంతాన్ని శాసిస్తుంటాడని, వేరే వాళ్ళను ఎదగనివ్వడని రూమర్స్ ఉన్నాయి.
దీనిపై దిల్ రాజు స్పందించాడు. “నైజాంలో దాదాపుగా 450 థియేటర్లు ఉన్నాయి. అందులో కేవలం 60 థియేటర్లు మా కంట్రోల్ లో ఉంటాయి. 60 థియేటర్లతో ఒక ఏరియాను శాసించడం ఎలా జరుగుతుంది? టాప్ నిర్మాతలు మా మీద భరోసా ఉంచుతారు ఎందుకంటే మేమంత ప్రొఫెషనల్ గా ఉంటాం కాబట్టి. వాళ్లకు మాపైన నమ్మకం ఉంది” అని చెప్పుకొచ్చాడు.