మహానటి చిత్రం తర్వాత ఎక్కువగా కీర్తి సురేష్ ఫీమేల్ సెంట్రిక్ చిత్రాలు, ఆఫ్ బీట్ సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అందులో ఎక్కువ శాతం ప్లాపులుగా మారాయి. దీంతో కీర్తి రూట్ మార్చాలనుకుంది. కమర్షియల్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. కీర్తి సురేష్ నటించిన లేటెస్ట్ సినిమా సర్కారు వారి పాట డీసెంట్ సక్సెస్ సాధించింది. కానీ దాని వలన కీర్తి కెరీర్ కు పెద్దగా ఒరిగిందేమి లేదనే చెప్పాలి.
ఎందుకంటే ఇందులో కీర్తి పాత్రపై మిశ్రమ స్పందన వచ్చింది. సూపర్ స్టార్ తో ఆమె కెమిస్ట్రీ బాగానే వర్కౌట్ అయినా దర్శకుడు ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానంపై విమర్శలు వచ్చాయి. మరి ఇలాంటి మిక్స్డ్ రెస్పాన్స్ తో కీర్తి తన కెరీర్ ను ఎలా మలుచుకుంటుందో చూడాలి.
కీర్తి సురేష్ తర్వాతి తెలుగు సినిమా హీరోయిన్ గా కాదు. చిరంజీవి భోళా శంకర్ లో ఆయనకు చెల్లెలి పాత్రలో కనిపించనుంది.