మే 20 వీకండ్ అయినా కానీ థియేటర్లలో పెద్దగా సినిమాలు విడుదలవ్వలేదు. కానీ మరోవైపు ఓటిటిలో కంటెంట్ మాత్రం భారీగానే వచ్చి పడింది. ముందుగా బ్లాక్ బస్టర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ జీ5 లో అందుబాటులోకి వచ్చింది. ముందుగా పే పర్ వ్యూ అన్నారు కానీ జీ5 సంస్థ తర్వాత మనసు మార్చుకుని సబ్స్క్రైబర్స్ కు ఫ్రీగానే అందిస్తోంది.
ఇక అమెజాన్ ప్రైమ్ లో మెగాస్టార్ చిరంజీవి నటించిన ఆచార్య విడుదలైంది. ఈ సినిమా థియేటర్ లో ప్లాప్ అవ్వడంతో అక్కడ చూడని వారికి ఓటిటిలో చూసే అవకాశం దొరికింది. అలాగే శ్రీ విష్ణు నటించిన లేటెస్ట్ మూవీ భళా తందనాన డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ అవుతోంది. షాహిద్ కపూర్ నటించిన జెర్సీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కు సిద్ధమైంది.
మోహన్ లాల్, జీతూ జోసెఫ్ కాంబినేషన్ లో వచ్చిన 12th మ్యాన్ కూడా డిస్నీ + హాట్ స్టార్ లో విడుదలైంది. వీటితో పాటు మరిన్ని సిరీస్ లు కూడా స్ట్రీమ్ అవుతున్నాయి.
247740 239426How can I attract much more hits to my composing weblog? 724503