పంచాంగం
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం
సూర్యోదయం: ఉ.5:53
సూర్యాస్తమయం: సా.5:53 ని.లకు
తిథి: భాద్రపద శుద్ధ ద్వాదశి ఉ.11:16 ని. వరకు తదుపరి భాద్రపద శుద్ధ త్రయోదశి
సంస్కృతవారం: భౌమ వాసరః (మంగళవారం)
నక్షత్రము: శ్రవణం ఉ.7:54 ని. వరకు తదుపరి ధనిష్ఠ
యోగం: సుకర్మ ఉ.10:58 ని. వరకు తదుపరి ధృతి
కరణం: బవ మ.12:29 ని. వరకు తదుపరి భాలవ
దుర్ముహూర్తం: ఉ.8:17 ని. నుండి 9:05 ని.వరకు తదుపరి రా.10:41 నుండి 11:29 వరకు
వర్జ్యం : ఉ.11:28 ని నుండి మ.12:57 ని. వరకు
రాహుకాలం: మ.3:00 ని నుండి సా.4:30 గం.వరకు
యమగండం: ఉ.9:00 ని. నుండి 10:30 గం. వరకు
గుళికా కాలం: మ.12:07 ని.నుండి మ.1:37 ని. వరకు
బ్రాహ్మీ ముహూర్తం: తె.4:33 ని.నుండి 5:21 ని.వరకు
అమృతఘడియలు: రా.8:25 ని నుండి 9:43 ని. వరకు
అభిజిత్ ముహూర్తం : ఉ.11:43 నుండి మ.12:31 వరకు
ఈరోజు (26-09-2023) రాశి ఫలితాల
మేషం: అవసరానికి సన్నిహితుల సహాయ సహకారాలు అందుతాయి. వ్యాపారములు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగిన నిదానంగా పూర్తిచేస్తారు. కుటుంబ వ్యవహారాలలో కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యలను తెలివిగా పరిష్కరించుకుంటారు.
వృషభం: ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలున్నవి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో సన్నిహితులతో వివాదాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కలసిరావు.
మిథునం: చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. నూతన ఋణ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. నూతన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో ప్రముఖుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రయత్నాలలో అవరోధాలు తొలగుతాయి.
కర్కాటకం: సంఘంలో పెద్దలతో పరిచయాలు విస్తృతమౌతాయి. ఉద్యోగస్తుల జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు లభిస్తాయి. స్థిరాస్తి వ్యవహారాలలో సమస్యలు అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి.
సింహం: వ్యాపారాలలో స్వంత ఆలోచనలు అంతగా కలసిరావు. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. మిత్రులతో దైవ దర్శనాలు చేసుకుంటారు. కుటుంబ పెద్దల ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. చేపట్టిన వ్యవహారాలు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి.
కన్య: చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. నూతన ఋణ యత్నాలు కొంత కష్టంతో పూర్తి అవుతాయి. బందు మిత్రులతో మాటపట్టింపులుంటాయి. దూరపు బంధువుల నుండి కీలక విషయాలు తెలుస్తాయి. వ్యాపార వ్యవహారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వృత్తి ఉద్యోగాలు కొంత నిదానంగా సాగుతాయి.
తుల: భూ క్రయవిక్రయాలలో విశేషమైన లాభాలు అందుతాయి. చేపట్టిన పనులలో అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది. కుటుంబ పెద్దలతో గృహమున సందడిగా గడుపుతారు. బంధు మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగాలలో హోదాలు పెరుగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.
వృశ్చికం: ఆప్తులతో దీర్ఘకాలిక వివాదాలు తీరి ఊరట చెందుతారు. అనుకున్న సమయానికి పనులు పూర్తిచేస్తారు. వృత్తి వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు విస్తృతమౌతాయి. వృత్తి ఉద్యోగ విషయంలో ఉన్న సమస్యలు అధిగమిస్తారు. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.
ధనస్సు: ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. దైవ సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలు ఊహించని సమస్యలు కలుగుతాయి. సంతాన విద్యా విషయాలు నిరుత్సాహపరుస్తాయి. ఆర్థిక వ్యవహారాలు కొంత చికాకు పరుస్తాయి. వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.
మకరం: ముఖ్యమైన వ్యవహారాలలో కొంత జాప్యం కలుగుతుంది. ఋణ దాతల నుండి ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు అదనపు బాధ్యతల వలన తగిన విశ్రాంతి ఉండదు. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. బంధువుల నుండి అందిన ఒక వార్త నిరుత్సాహం కలిగిస్తుంది.
కుంభం: బంధు మిత్రుల సహాయం సహకారాలు అందుతాయి. సోదరులతో స్ధిరాస్తి ఒప్పందాలు కుదురుతాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆత్మీయులతో కీలక విషయాల గురించి చర్చిస్తారు. వృత్తి ఉద్యోగాలలో సమస్యల నుంచి అధికారుల సహాయంతో బయటపడతారు.
మీనం: సంతాన ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త అవసరం. చేపట్టిన పనులలో అవరోధాలు కలుగుతాయి. వృత్తి వ్యాపారాలలో అంచనాలు అందుకోవడంలో సమస్యలు తప్పవు. ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి. ఋణ సంభంధిత సమస్యలు వలన ఒత్తిడి తప్పదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి.