జ్యుడీషియల్ క్యాపిటల్ అవుతుందో లేదోగానీ, కర్నూలు మాత్రం ఆంధ్రప్రదేశ్‌కి ‘కరోనా వైరస్’ క్యాపిటల్‌గా ఎప్పుడో మారిపోయింది. ఒకటి కాదు రెండు కాదు.. మొత్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య కర్నూలులో తాజాగా 386కి చేరుకుంది. ఈ రోజు మొత్తం 40 కొత్త కేసులు కర్నూలులో నమోదు కావడంతో కర్నూలు ప్రజానీకం తీవ్ర అలజడికి గురవుతున్నారు.
చూస్తోంటే, కర్నూలులో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 500 దాటేయడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చు. ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు వెలుగు చూశాక, అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కరోనా వైరస్‌పై చాలా వెటకారాలు చేసింది. ఇప్పటికీ అధికార పార్టీది కరోనా వైరస్ విషయంలో ఒకటే మాట. ‘ఇట్ కవ్స్ు.. ఇట్ గోస్.. వస్తుంది.. పోతుంది..’ అని. పైగా, ‘కరోనాతో కలిసి జీవించాల్సిందే..’ అంటూ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి చులకనగా మాట్లాడుతున్న వేళ, ప్రజలకు కరోనా వైరస్ మాత్రం అగ్ని పరీక్ష పెడుతోంది.
కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నాం.. కంటెయిన్మెంట్ జోన్లో జనాన్ని ఇళ్ళకే పరిమితం చేస్తున్నాం.. అంటూ ప్రభుత్వం పైకి చెబుతున్నా, గ్రౌండ్ లెవల్లో పరిస్థితులు అందుకు భిన్నంగా వున్నాయా.? అన్న అనుమానాలు కలగకమానదు కొత్త కేసులు వెలుగు చూస్తుండడంతో. గ్రేటర్ హైద్రాబాద్‌లోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. కానీ, కర్నూలులో మాత్రం కరోనా పాజిటివ్ కేసుల తీవ్రత రోజురోజుకీ పెరిగిపోతోంది.
కర్నూలు తర్వాత గుంటూరులో అధికంగా కరోనా కేసులున్నాయి. కృష్ణా జిల్లా కూడా గుంటూరుతో పోటీ పడే స్థాయికి కేసుల్ని పెంచుకుంటోంది. పెద్దయెత్తున పరీక్షలు చేస్తుండడంతోనే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోందని ప్రభుత్వం చెబుతున్నా.. కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమాత్రం ఫలితాలనివ్వడంలేదని పెరుగుతున్న కేసుల సంఖ్యతో సుస్పష్టమవుతోంది. మొత్తంగా ఆంధ్రపదేశ్ లో కొత్త కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఈ రోజు 71గా నమోదయ్యింది. దాంతో మొత్తం కేసుల సంఖ్య 1403కి చేరుకుంది.
469086 5372appreciate the effort you put into obtaining us this data. Was searching on google and discovered your post randomly. 994231
117463 153712There is noticeably lots of funds to realize about this. I assume youve produced certain good points in attributes also. 48804
840480 848461I appreciate you taking the time to speak about them with people. 608622