Switch to English

అటు కరోనా.. ఇటు రాజకీయాలు: ఏపీ ఇంతేనా?

ఆంధ్రప్రదేశ్ ను అటు కరోనా.. ఇటు రాజకీయాలు నిత్యం పట్టి పీటిస్తూనే ఉన్నాయి. రోజురోజుకూ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. నిత్యం ఆరు పదులకు తగ్గకుండా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు అదే స్థాయిలో రాజకీయాలూ హీటెక్కుతున్నాయి. కష్టకాలంలో అధికార, ప్రతిపక్షాలు కలిసి పనిచేయడం మాట అటుంచితే.. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు, విమర్శలతో ప్రజల్లో పలచన అవుతున్నారు. కరోనాను అరికట్టడంలో అధికార పక్షం విఫలమైందని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నిత్యం విమర్శలు చేస్తోంది.

తాజాగా అధికార పక్షం అసమర్థత వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని, పాలన చేతకాకపోతే చంద్రబాబు వద్ద ట్రైనింగ్ తీసుకోవాలని.. లేదంటే నెలరోజులపాటు చంద్రబాబుకు పాలన అప్పగించాలని టీడీపీ నేత బోండా ఉమా వ్యాఖ్యలు చేశారు. లాక్ డౌన్ నిబంధనలను అధికార పార్టీ నేతలే ఎక్కువగా ఉల్లంఘిస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మరోవైపు అధికార పక్షం కూడా టీడీపీపై తీవ్రంగా విమర్శలు చేస్తోంది. దేశంలో ఎక్కువ టెస్టులు చేస్తోంది తామేనని చెబుతున్నారు. ఈ విషయంలో తమది రికార్డు అని పేర్కొంటూ చంద్రబాబు, లోకేశ్ లపై విమర్శలు చేస్తున్నారు.

ఇక వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఈ విషయంలో ముందుంటున్నారు. ట్విట్టర్ వేదికగా వారిద్దరిపై తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పటివరకు విపక్షాల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వైసీపీ.. తాజాగా సొంత పార్టీ నేతల తీరుతోనూ ఇబ్బంది పడుతోంది. వైసీపీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా అధికార యంత్రాంగంపై చేసిన వ్యాఖ్యలు కాక రేపుతున్నాయి. దమ్ముంటే తనను అరెస్టు చేయాలని, అసలు ఎస్పీని తాను లెక్కల్లోకి తీసుకోవడంలేదని వ్యాఖ్యానించారు. ఇటీవల నెల్లూరు జిల్లాలో నల్లపురెడ్డి పేదలకు నిత్యావసరాలు పంపిణీ చేసిన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారంటూ ఆయనపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో తనపై వెంటనే కేసు ఎత్తివేయాలంటూ నల్లపురెడ్డి బుచ్చిరెడ్డిపాళెం పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా చేశారు.

అప్పటికి పోలీసులు ఆయనకు నచ్చజెప్పి పంపించినా.. కేసు మాత్రం అలాగే ఉంది. ఈ నేపథ్యంలో ఎస్సీ, కలెక్టర్ టార్గెట్ గా ఆయన సవాల్ చేశారు. ఇది వైసీపీకి ఇబ్బందిగా మారింది. అధికార పార్టీ నేతలు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారనే ఆరోపణలకు నల్లపురెడ్డి ఎపిసోడ్ ఊతమిచ్చేలా ఉందనే వైసీపీలోనే చర్చ సాగుతోంది. తమ డ్యూటీ చేస్తున్న అధికారులపై ఆయన అలా సవాల్ చేయడం మంచిది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా కేసులు పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో పార్టీలన్నీ రాజకీయాలు మాని, ప్రజల క్షేమం కోసం కృషి చేయాలని సోషల్ మీడియాలో పలువురు సూచనలు చేస్తున్నారు. అధికార, విపక్షాలు ఇకనైనా ఆ దిశగా దృష్టి పెడతాయా లేదా అన్నది చూడాలి.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

దేవుడి భూముల అమ్మకం.. దేవుడే రక్షించుకోవాలేమో..

అసలు హిందూ దేవాలయాలకు పాలక మండళ్ళు ఎందుకు.? దేవాలయాల్ని పరిపాలించడమా.? ఇలాంటి ప్రశ్నలు ఇప్పటివి కాదు. కానీ, ఈ ప్రశ్నలకు ఎప్పటికీ సమాధానం దొరకదు. దేవాలయాల్లోనే ప్రసాదాల అమ్మకాలు.. అదీ అధికారికంగా జరుగుతుంటాయి....

ఫ్లాష్ న్యూస్: వారెవ్వా.. తల్లి కోసం ఐదేళ్ల బాలుడు ఒంటరి ప్రయాణం.!

కరోనా మహమ్మారిని అడ్డుకోవడం కోసం ఇమ్మీడియట్ ఎఫెక్ట్ తో మార్చి లో లాక్ డౌన్ పెట్టడం వలన ఎక్కడి వారు అక్కడే లాక్ అయిపోయారు. చాలా మంది స్వస్థలాలకు వెళ్లాలని ప్రయత్నించి లాభం...

లైవ్ విజువల్స్: బెంగాల్, ఒడిశా, విశాఖలో అల్లకల్లోలం సృష్టిస్తున్న అంపన్ తుఫాన్

పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొదలైన అంపన్ తుఫాన్ పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో అల్లకల్లోలం సృష్టిస్తోంది. ఈ తుఫాన్ భీభత్సం నేడు విశాఖ తీరం మరియు కాకినాడ తీరప్రాంతాల్లోనూ దాడి చేయడం మొదలు...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని మించి మరొకటి విజయం సాధించాయి. తన...

ప్రభాస్ 20 షూట్ ప్లాన్ అండ్ రిలీజ్ అప్డేట్

కరోనా మహమ్మారి ప్రపంచం మీద చేస్తున్న దండయాత్ర అందరినీ భయాందోళనలో పడేయడమే కాకుండా ఎక్కడి పనులు అక్కడే ఆగిపోయేలా చేసింది. అందులో భాగంగా సినిమా షూటింగ్స్, విడుదలలు కూడా ఆగిపోయాయి. మళ్ళీ ఎప్పుడు...