Switch to English

గోపీచంద్ కాదన్నది కార్తికేయ ఓకే చెప్పాడట

కొన్ని రోజుల క్రితం రజినీకాంత్‌ హీరోగా తెరకెక్కుతున్న ఒక సినిమాలో విలన్‌కు గాను తెలుగు హీరో గోపీచంద్‌ను సంప్రదించారట. దర్శకుడు శివ పదే పదే గోపీచంద్‌తో ఆ విలన్‌ పాత్రను చేయించేందుకు ప్రయత్నించాడట. కాని గోపీచంద్‌ మాత్రం ఆ పాత్రపై ఆసక్తి చూపించలేదు. విలన్‌గా చేస్తే మళ్లీ హీరోగా ఆఫర్లు రావనే ఉద్దేశ్యంతో సూపర్‌ స్టార్‌ మూవీ అయినా నో చెప్పాడని వార్తలు వచ్చాయి. అయితే గోపీచంద్‌ నిర్ణయాన్ని కొందరు తప్పుబట్టారు.

రజినీకాంత్‌ మూవీలో ఛాన్స్‌ అంటే చేయాల్సింది. ఆ సినిమాలో చేస్తే మంచి గుర్తింపు దక్కేది. ఆ తర్వాత మళ్లీ హీరోగా చేసుకునే అవకాశం ఉండేదని అంటున్నారు. ఇప్పుడు అలాంటి ఛాన్స్‌ యంగ్‌ హీరో కార్తికేయకు వచ్చిందట. సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం కార్తికేయను ప్రముఖ కోలీవుడ్‌ స్టార్‌ హీరో అజిత్‌ సినిమాలో విలన్‌గా నటింపజేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, అందుకు కార్తికేయ కూడా దాదాపుగా ఓకే చెప్పాడని అంటున్నారు.

ఆర్‌ఎక్స్‌100 చిత్రంతో హీరోగా నటించి మెప్పించిన కార్తికేయ ఆమద్య నాని గ్యాంగ్‌ లీడర్‌ చిత్రంలో విలన్‌గా నటించిన విషయం తెల్సిందే. ఆ సినిమాలో తన పాత్రకు పూర్తి న్యాయం చేసిన కాక్తికేయ ప్రస్తుతం రెండు సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. అయినా కూడా ఏమాత్రం బేషజాలకు వెళ్లకుండా విలన్‌ పాత్రలో అజిత్‌ సినిమాలో చేసేందుకు ఒప్పుకున్నాడు. తెలివైన నటుడు అంటూ ఈయన్ను ప్రస్తుతం సినీ వర్గాల్లో అభివర్ణిస్తున్నారు.

సినిమా

టీటీడీని ప్రశ్నించిన ఏకైక హీరో

టీటీడీకి చెందిన ఆస్తులను వేలం వేసేందుకు అధికారులు సిద్దం అయిన విషయం తెల్సిందే. ఇందుకోసం ఇప్పటికే ఉతర్వులు కూడా సిద్దం అయ్యాయి. దేశ వ్యాప్తంగా ఉన్న...

కమల్‌తో వ్యవహారంపై క్లారిటీ ఇచ్చింది

యూనివర్శిల్‌ స్టార్‌ కమల్‌ హాసన్‌ సుదీర్ఘ కాలం పాటు నటి గౌతమితో సహజీవనం సాగించిన విషయం తెల్సిందే. ఆమెతో కొన్ని కారణాల వల్ల విడిపోయిన కమల్‌...

ముందు ఎఫ్ 3.. ఆ తర్వాతే ఏదైనా

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు టాప్ లీగ్ లోకి చేరిపోయాడు. చేసినవి 5 సినిమాలు అయితే ఐదు కూడా సూపర్ డూపర్ హిట్లు అయ్యాయి. ఒకదాన్ని...

ఈ హీరోయిన్ కు కూడా లైంగిక వేధింపులు తప్పలేదట

లైంగిక వేధింపులు అనేది అన్ని చోట్లా ఉంది. కాకపోతే సినిమా ఇండస్ట్రీలో ఈ మధ్య ఈ విషయం ఎక్కువగా చర్చకు వస్తోంది. ఇదివరకు ఈ విషయంపై...

సాయి తేజ్ ‘నో పెళ్లి’ కాన్సెప్ట్ కి రానా, వరుణ్ తేజ్...

దాదాపు రెండున్నర నెల తర్వాత టాలీవుడ్ లో మళ్ళీ ప్రమోషన్స్ హడావిడి స్లోగా మొదలవుతోంది. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటిస్తున్న 'సోలో...

రాజకీయం

సగటు భక్తుడి ఆవేదన: వెంకన్న జోలికి వెళ్ళొద్దు ప్లీజ్‌.!

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా టీటీడీ పాలక మండలి అనగానే రాజకీయ నిరుద్యోగులకు పునరావాస కేంద్రంగా మారిపోయిందన్నది ఓపెన్‌ సీక్రెట్‌. ఇదే విమర్శ గతంలో వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో విన్నాం.. ఆ తర్వాత...

టీటీడీ వివాదంపై జగన్ కి విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానంద సూచనలు.!

టీటీడీ భక్తులు ఇచ్చిన భూములు విక్రయించాలి అని నోటీసులు జారీ చేసినప్పటి నుంచీ ఆ విషయంపై నానా రచ్చ నడుస్తోంది. టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని ప్రతి ఒక్కరూ వ్యతిరేకిస్తున్నారు. కానీ టీటీడీ...

జనసేనానీ.. ఈ డోస్‌ సరిపోదు సుమీ.!

జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ ఈ మధ్య సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా వుంటున్నారు. అయితే, ఎక్కువగా రీ-ట్వీట్లు చేస్తున్నారనే విమర్శలూ పవన్‌ కళ్యాణ్‌ మీద లేకపోలేదనుకోండి.. అది వేరే విషయం. బీజేపీ...

శ్రీశైలంలో కోట్లు స్వాహా చేసిన అక్రమార్కులు

అవినీతి అనేది అక్కడ ఇక్కడ అని లేకుండా ఎక్కడ పడితే అక్కడే జరుగుతుంది అనేందుకు మరో ప్రత్యేక్ష ఉదాహరణగా శ్రీశైలం నిలిచింది. ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన అక్కడ కోట్లాది రూపాయల...

జగన్ కీలక నిర్ణయం.. సజ్జలకు పార్టీ బాధ్యతలు?

పార్టీ బాధ్యతల విషయంలో వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారా? అటు సీఎంగా పాలనా వ్యవహారాలు, ఇటు అధినేతగా పార్టీ కార్యకలాపాలు ఒకేసారి చూడటం కాస్త...

ఎక్కువ చదివినవి

పిక్ ఆఫ్ ది డే: కొమరం భీమ్ కి రామరాజు బర్త్ డే విషెస్.!

మన నవతరం అల్లూరి సీతారామరాజు అలియాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ బర్త్ డే కానుకగా కొమరం భీమ్ అలియాస్ యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ స్పెషల్ బర్త్ డే టీజర్ ని...

ఇన్‌సైడ్‌ స్టోరీ: తెలంగాణలో కరోనా టెస్టులు పెరగాల్సిందే.!

దేశంలోని ప్రముఖ నగరాల్లో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. వాటన్నిటితో పోల్చి చూస్తే, హైద్రాబాద్‌ పరిస్థితి కాస్త బెటర్‌. తెలంగాణలో గ్రేటర్‌ హైద్రాబాద్‌ పరిధిలోనే ఎక్కువగా కరోనా పాజిటివ్‌ కేసులు వెలుగు చూస్తున్నాయి. మిగతా...

పిక్ ఆఫ్ ది డే: స్విమ్మింగ్ పూల్ లో సరదాగా.. మహేష్ బాబు.!

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ లాక్ డౌన్ టైంలో తన పిల్లలైన గౌతమ్ అండ్ సితారలతో క్వాలిటీ టైంని స్పెండ్ చేస్తున్నారు. వారితో కలిసి గేమ్స్ ఆడటం, వారితో కలిసి సినిమాలు...

బికినీతో కరోనా పేషంట్‌కు చికిత్స

ఈ కరోనా కారణంగా ఎన్నో కొత్త కొత్త విషయాలు, వింతలు చూడాల్సి వస్తుంది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా డాక్లర్లు మరియు నర్సులపై ఆదారపడి ఉంటున్నారు. వారు లేకుంటే ఈ...

రంజాన్‌ స్పెషల్‌: ఇండియాలో ఈద్‌ అల్‌ ఫితర్‌ ఎప్పుడంటే..

పవిత్ర రమదాన్‌ మాసం కొనసాగుతోంది. గతంలో కన్పించిన సందడి ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడా రమదాన్‌ సందర్భంగా కన్పించడంలేదంటే దానికి కారణం కరోనా వైరస్‌. ప్రపంచంలో చాలా దేశాలు లాక్‌ డౌన్‌ని పాటిస్తున్న...