Switch to English

 త్రివిక్రమ్‌ తర్వాత డాలీకే ఆ ఛాన్స్‌

టాలీవుడ్‌లో పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌కు ఉన్నతం క్రేజ్‌ మరో హీరోకు లేదేమో అనిపిస్తుంది. అంతటి ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను కలిగి ఉన్న పవన్‌ కళ్యాణ్‌తో ప్రతి దర్శకుడు కూడా సినిమా చేయాలని పరితపిస్తూ ఉంటాడు. ఒకానొక సమయంలో రాజమౌళి కూడా పవన్‌తో సినిమా చేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేశానంటూ చెప్పుకొచ్చాడు. కాని పవన్‌తో సినిమా చేయడంకు వీలు పడలేదంటూ ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రాజమౌళి చెప్పుకొచ్చాడు.

పవన్‌తో ఒక్కటి రెండు సినిమాలు చేసే అవకాశం రావడం గొప్ప అనుకుంటే మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ ఏకంగా మూడు సినిమాలు చేశాడు. వీరిద్దరి కాంబోలో వచ్చిన జల్సా మరియు అత్తారింటికి దారేది చిత్రాలు ఇండస్ట్రీ హిట్‌గా నిలిచాయి. అజ్ఞాతవాసి మాత్రం ఫ్లాప్‌ అయ్యింది. మళ్లీ వీరి కాంబో మూవీ కోసం ఎదురు చూస్తున్నారు. పవన్‌ మళ్లీ సినిమాలు చేస్తున్న కారణంగా వీరిద్దరి కాంబోలో నాల్గవ సినిమా కూడా వచ్చే అవకాశం ఉంది. త్రివిక్రమ్‌ తర్వాత పవన్‌తో మూడు సినిమాలు తీసిన దర్శకుడి జాబితాలో డాలీ చేరబోతున్నాడు.

ఇప్పటి వరకు డాలీ దర్శకత్వంలో గోపాల గోపాల మరియు కాటమరాయుడు చిత్రాలను పవన్‌ చేశాడు. ఆ రెండు సినిమాలు యావరేజ్‌గా నడిచినా కూడా దర్శకుడు డాలీపై ఉన్న గౌరవం మరియు అభిమానంతో మళ్లీ ఆయన దర్శకత్వంలో సినిమాను చేసేందుకు పవన్‌ ఓకే చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇటీవల పవన్‌ను కలిసిన డాలీ స్టోరీ చెప్పాడని, ఆ స్టోరీ కూడా బాగా నచ్చడంతో నటించేందుకు ఒప్పుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే కమిట్‌ అయిన వకీల్‌ సాబ్‌, క్రిష్‌ మూవీ విరూపాక్షతో పాటు హరీష్‌ శంకర్‌తో సినిమా పూర్తి అయితే అప్పుడు డాలీతో పవన్‌ సినిమా ఉంటుందట. వచ్చే ఏడాదిలో వీరి కాంబో ఉండే అవకాశం ఉంది. మొత్తానికి డాలీ చాలా లక్కీ అంటూ ఇతర దర్శకులు అసూయ పడుతున్నారట.

సినిమా

నా భర్తతో ఉండలేక పోతున్నా అంటూ ట్వీట్‌.. సోనూ సూద్‌ సమాధానం...

గత నెల రోజులుగా సోషల్‌ మీడియాలో సోనూ సూద్‌ పేరు ఒక రేంజ్‌ లో మారు మ్రోగి పోతుంది. వలస కార్మికుల పాలిట దేవుడు అంటూ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు....

ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ.. మల్టీస్టారర్ పై బాలయ్య స్పందన..

నందమూరి నట సింహం బాలకృష్ణ సినిమా గురించి మాట్లాడినా.. రాజకీయం గురించి మాట్లాడినా స్పష్టత ఉంటుంది. నిజాన్ని నిర్భయంగా చెప్పే ఆయన ఓ యూట్యూబ్ చానెల్...

క్షమాపణ చెప్పాలన్న నాగబాబు కామెంట్స్ పై బాలకృష్ణ రియాక్షన్.!

గత కొద్దిరోజులుగా తెలుగు సినీ పరిశ్రమలో కొన్ని వివాదాలు జరుగుతున్నాయి. ఈ వివాదం నందమూరి బాలకృష్ణ 'సినీ వర్గ మీటింగ్స్ కి నన్ను పిలవలేదు' అంటూ...

అనసూయకు పొలిటికల్‌ ఆఫర్స్‌ కూడా వస్తున్నాయా?

జబర్దస్త్‌ హాట్‌ యాంకర్‌ అనసూయ ప్రస్తుతం బుల్లి తెర మరియు వెండి తెరపై చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. సోషల్‌ మీడియాలో కూడా ఈమెకు...

రాజకీయం

అన్నదాతలకు శుభవార్త చెప్పిన కేంద్ర కేబినెట్

అన్నదాతలకు శుభవార్త: వివిధ పంటలకు మద్ధతు ధరలు పెంచిన కేంద్ర కేబినెట్( ఖరీఫ్ సీజన్ కోసం). ప్రతి క్వింటాల్ కు..... 1 . వరి - నూతన ధర రూ. 1,868/-( పెంచిన ధర రూ.53) 2....

నిమ్మగడ్డ ఇష్యూలో సుప్రీంను ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వం

ఏపీ ఎన్నికల కమీషనర్‌గా విధులు నిర్వహిస్తున్న నిమ్మగడ్డ రమేష్‌ను ప్రభుత్వం అర్థాంతరంగా తొలగిస్తూ ఉతర్వులు తీసుకు వచ్చింది. ఆ ఉతర్వులను నిమ్మగడ్డ రమేష్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. ఏపీ హైకోర్టులో నిమ్మగడ్డ రమేష్‌కు...

జన్మంతా జగన్‌తోనేనంటున్న విజయసాయిరెడ్డి.. నమ్మొచ్చంటారా.?

‘వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డితో నాకున్న అనుబంధం చాలా విలువైనది. ఇప్పుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డితోనూ అదే అనుబంధం కొనసాగుతోంది. ఇకపైనా, అదే కొనసాగుతుంది. జన్మంతా జగన్‌ వెంటే నా ప్రయాణం. ఇందులో ఇంకో మాటకు...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

బెజవాడలో గ్యాంగ్‌ వార్‌: హత్యా ‘రాజకీయం’లో కొత్త కోణం.!

రాష్ట్ర రాజధాని అమరావతి పరిధిలోని బెజవాడ ఒక్కసారిగా ‘గ్యాంగ్‌ వార్‌’తో ఉలిక్కిపడింది. రెండు గ్యాంగ్‌ల మధ్య గొడవలో ఓ గ్యాంగ్‌ లీడర్‌ హతమయ్యాడు. ఓ అపార్ట్‌మెంట్‌కి సంబంధించిన గొడవలో ఇద్దరు వ్యక్తులు ‘సెటిల్‌మెంట్‌’కి...

ఎక్కువ చదివినవి

మానవ తప్పిదం, నిర్లక్ష్యం వల్లే ఎల్‌జీ పాలిమర్స్‌ ఘటన

విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ఎల్టీ పాలిమన్స్‌ ప్రమాదం మానవ తప్పిదం మరియు నిర్లక్ష్యం వల్లే జరిగిందంటూ ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీ తేల్చింది. జాతీయ హరిత ట్రైబ్యూనల్‌ ఈ సంఘటనపై సమగ్ర విచారణ...

లాక్ డౌన్ రెండో కోణం: 25 ఏళ్లలో కానిది.. రెండు నెలల్లో అయింది

ప్రపంచాన్ని హడలెత్తిస్తున్న కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు చాలా దేశాలు లాక్ డౌన్ బాట పట్టాయి. మనదేశంలో కూడా లాక్ డౌన్ విధించి రెండు నెలలు దాటింది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాలుగో దశ...

బర్త్ డే స్పెషల్‌: అన్నగారు, మరో నూరేళ్లయినా సరిలేరు మీకెవ్వరు.!

తెలుగు సినిమాకు కమర్షియల్‌ హంగులు అద్దినది.. తెలుగు సినిమాకు కొత్త పంథా నేర్పించింది.. తెలుగు వారి ఆత్మ గౌరవంను కాపాడినది.. తెలుగు వారికి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కించి పెట్టింది.. తెలుగు భాషను...

జగన్‌ సర్కార్‌కి మరో షాక్‌: ఎస్‌ఇసిగా నిమ్మగడ్డకు లైన్‌ క్లియర్‌

వైఎస్‌ జగన్‌ సర్కార్‌కి మరో షాక్‌ తగిలింది. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌గా పనిచేసిన నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌ని తొలగించేందుకోసం రాష్ట్ర ప్రభుత్వం రాత్రికి రాత్రి తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ని హైకోర్టు కొట్టివేసింది. ఆర్టికల్‌ 213 ప్రకారం...

‘సుమోటో’ అంటూ ఈ కెలుకుడేంది ‘రెడ్డి’గారూ.!

సోషల్‌ మీడియాలో వైఎస్సార్సీపీ ముఖ్య నేత, ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి చాలా యాక్టివ్‌గా వుంటారన్నది అందరికీ తెల్సిన విషయమే. కుప్పలు తెప్పలుగా ట్వీట్స్‌ వేస్తుంటారాయన. ప్రత్యర్థులపై ఎడాపెడా సెటైర్లు వేయడంలో...