Switch to English

భారత్‌లో లక్షకు చేరవులో కరోనా.. తర్వాత ఏంటి.?

నిన్న భారతదేశంలో 4987 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మొత్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 90 వేలు దాటేసింది. మరోపక్క, వలస కూలీలు తమ సొంత రాష్ట్రాలకు వెళుతున్న దరిమిలా, కేసుల సంఖ్య ముందు ముందు మరింత ఎక్కువగా వుండొచ్చన్న వాదనలు బలంగా విన్పిస్తున్నాయి. అంటే, ఒక్క రోజులో నమోదయ్యే కేసులు ముందు ముందు చాలా ఎక్కువ కాబోతున్నాయన్నమాట.

నిన్నటి జోరు కొనసాగితే, రేపే లక్ష మార్క్‌ని దాటేయొచ్చు దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య. జూన్‌, జులై నెలల్లో ఈ వేవ్‌ మరింత ఎక్కువగా వుంటుందంటూ పలు నివేదికలు చెబుతున్నాయి. నిజానికి, దేశంలో ఒకే రోజు దాదాపు 5 వేల కేసులు నమోదవడమంటేనే అతి పెద్ద వేవ్‌గా చెప్పుకోవాలి. అలాంటది, జూన్‌ – జులైలలో మరింత పెద్ద వేవ్‌ వుండొచ్చంటే.. అది ఆషామాషీ వ్యవహారం కాదు.

తొలి 10 వేల కేసులు నమోదవడానికి ఎక్కువ సమయం పట్టింది. ఆ తర్వాత వేగం పెరిగింది. 50 వేల మార్క్‌ చేరాక.. శరవేగంగా దేశంలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరగడం చూశాం. మరి, లక్ష దాటాక ఏమవుతుంది.? ఇదే ఇప్పుడు సగటు భారతీయుడ్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది.

క్రమంగా కేంద్రం, కరోనా వైరస్‌ కేసులకు సంబంధించి మార్గదర్శకాల్ని మారుస్తోంది. ఆసుపత్రిలో వైద్య చికిత్స అందించడం, హోవ్‌ు ఐసోలేషన్‌ విధానాల్లో మార్పులు చేస్తుండడంతో.. ఈ మార్పులు ముందు ముందు జనానికి మరింత వెతలు పెంచుతాయేమోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.

అయితే, ఇప్పుడు పెరిగిన వేవ్‌ ఎక్కువ రోజులు వుండకపోవచ్చని కేంద్రం అంచనా వేస్తుండడం కాస్త ఊరటనిచ్చే విషయమే. అయినాగానీ, కేంద్రం ఇచ్చే భరోసాని నమ్మలేని పరిస్థితి. లాక్‌డౌన్‌ సడలింపులతోపాటే, దేశంలో కరోనా పాజిటివ్‌ కేసులు, మరణాలూ పెరుగుతున్నాయ్‌ మరి. భవిష్యత్‌ ఇప్పటికైతే భయానకంగానే కన్పిస్తోంది. ముందు ముందు అది మరింత భయానకంగా మారకుండా వుండాలనే ఆశిద్దాం.. అంతకన్నా ఏం చేయగలం.?

సినిమా

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

ఫ్లాష్ న్యూస్: మానవత్వానికే మచ్చ.. కరోనా భయంతో నర్సును అలా వదిలేశారు

కరోనా బారిన పడిన వారిని కంటికి రెప్పలా కాపాడుతున్నారు వైద్యులు. వారితోపాటు నర్సులు, పారా మెడికల్ సిబ్బంది కూడా తమ విధులను సక్రమంగా నిర్వర్తిస్తున్నారు. ప్రజల మన్ననలు పొందుతున్నారు. కానీ.. అదే పారా...

‘కరోనా’ అయితే ఏంటి .? దుబాయిలో దోచేస్తున్నాడు.!

మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ నటించిన ‘కనులు కనులను దోచాయంటే’ సినిమా మరోసారి థియేటర్లలో సందడి చేస్తోంది. దేసింగ్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ రొమాంటిక్ థ్రిల్లర్ ఫిబ్రవరిలో విడుదలై ప్రేక్షకుల నుంచి...

గోపీచంద్, అనుష్క ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ!

తెలుగు సినిమాల్లో కొన్ని జంటలను చూడగానే చూడముచ్చటగా భలే ఉన్నారే అనిపిస్తుంది. అలాంటి జంటల్లో ఒకటి గోపీచంద్, అనుష్కలది. ఇద్దరూ హైట్ విషయంలో కానీ వెయిట్ విషయంలో కానీ పెర్ఫెక్ట్ మ్యాచ్ అన్నట్లుగా...

కరోనా వారియర్లే రక్షకులు.. వారిపై దాడులు సహించం: ప్రధాని మోదీ

దేశంలో కరోనా విపత్కర పరిస్థితుల్లో అత్యుత్తమ సేవలు అందిస్తున్న వైద్యులు, హెల్త్ వర్కర్లపై దాడులు చేస్తే సహించేది లేదని ప్రధాని మోదీ తెలిపారు. కర్ణాటకలోని రాజీవ్ గాంధీ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్.....

ప్రభాస్ మూవీతో తెలుగులో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ.!

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాతో ఏఆర్ రెహమాన్ రీ ఎంట్రీ ఏంటి, ఎప్పటికప్పుడు ఆయన పాటలు తెలుగులో వింటూనే ఉన్నాం కదా అని ఆలోచిస్తున్నారా.? మీరు అనుకున్నది కరెక్టే కానీ తెలుగు...