Switch to English

అమూల్ సంస్థకు ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ గా సీఎం జగన్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,710FansLike
57,764FollowersFollow

గుజరాత్ కు చెందిన పాల ఉత్పత్తుల సంస్థ అయిన అమూల్ కు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఏపీలో బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు. వేల కోట్ల ఆస్తులను స్థానికంగా ఉండే డెయిరీలకు కాదని ఉత్తరాది సంస్థ కు కట్టబెడుతున్నారు. రాష్ట్రంలో ఒకప్పుడు ఓ వెలుగు వెలిగిన విజయ డైరీ పునరుద్ధరణ పేరుతో సుమారు రూ.650 కోట్ల ప్రజాధనాన్ని కారుచౌకగా కేవలం ఏడాదికి రూ. కోటి లీజుకు 99 ఏళ్ల పాటు అమూల్ కు అప్పగించారు. నిన్నమొన్నటి వరకు హెరిటే, సంగం డైరీలపై విషం చల్లిన వైసీసీ నాయకులు అమూల్ విషయంలో మాత్రం ఎక్కడ లేని ప్రేమను చూపిస్తున్నారు. ఇప్పటికే చిత్తూరులో శివశక్తి డైరీ పేరుతో స్థానిక మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాడి రైతులను దోపిడీ చేస్తుంటే… అమూల్ పేరుతో సీఎం జగన్ పెద్ద కుట్రకు తెరతీశారు. పొరుగు రాష్ట్రాలు అయిన తమిళనాడు, కర్ణాటకలు అమూలు మోసాలను గ్రహించి దూరం పెడితే.. కమీషన్ల కోసం, తన మీద ఉన్న కేసుల మాఫీ కోసం ఆంధ్ర పాడిరైతుల భవిష్యత్తును గుజరాత్ కార్పొరేట్ కాళ్ల కింద పెట్టారు.

రాష్ట్రంలోని డైరీలు లాభాల నుంచి బోనస్ తో పాటు పశువులకు వైద్యసేవలు, తక్కువ ధరకు దాణా, మేలు జాతీ పశువుల వీర్యాన్ని పాడిరైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాడి పరిశ్రమకు ఊతాన్ని ఇస్తున్నాయి. అలాంటి కో- ఆపరేటివ్, ప్రైవేటు డైరీలకు జగన్ సర్కార్ ఒక్క రూపాయి కూడా సాయం చేయలేదు. కానీ అమూల్ డైరీకి మాత్రం అప్పనంగా ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ రూ. 6 వేల కోట్లను కట్టబెట్టింది. చిత్తూరు పునరుద్ధరణ ముసుగుతో ప్రజధనాన్ని అమూల్ కు దోచిపెడుతూ.. అందులోని కమీషన్లు సరాసరి తాడేపల్లి ప్యాలెస్ కు చేరేలా పథక రచన చేస్తున్నారు ప్రభుత్వ పెద్దలు. చిత్తూరు కలెక్టరేట్ సమీపంలో ఉన్న సుమారు 33 ఎకరాల విజయ డైరీ భూమిని ఈ ప్రక్రియలో భాగంగా కాజేశారు. జపాన్, జర్మనీల నుంచి సుమారు రూ. 30 కోట్ల విలువైన డైరీ సామాగ్రిని తెప్పించారు. వీటిని కూడా అమూల్ పరం చేసింది జగన్ రెడ్డి ప్రభుత్వం. ఎప్పటి నుంచో పాడి రైతులకు అండగా నిలుస్తున్న ఇతర డైరీలను నిర్వీర్యం చేసే దిశగా జగన్ రెడ్డి ఈ గుజరాత్ కంపెనీకు దోచిపెడుతున్నారు.

అన్నీ తామై అమూల్ కు అండగా…

ఏపీలోని అంగన్వాడీ కేంద్రాలకు కర్ణాటక మిల్క్‌ ఫెడరేషన్ కు సంబంధించిన నందిని అనే పాల ఉత్పత్తి సంస్థ రవాణా ఖర్చులతో కలిపి లీటరు రూ.57.25 చొప్పున పాలను సరఫరా చేస్తుండగా.. అమూల్ కు మాత్రం రవాణా ఖర్చులను తామే చెల్లిస్తామని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొనడం వైసీపీ, అమూల్ సంస్థకు మధ్య ఉన్న లాలూచీ ఒప్పందాలు అర్థం అవుతున్నాయి. ఈ పాల సరఫరా ఒప్పందం ప్రకారం అముూల్ పై పన్ను భారం పడకుండా తామే చెల్లిస్తామంటూ ప్రభుత్వం పేర్కొంది. పాలపై విధించే 5% జీఎస్టీ కూడా ప్రభుత్వమే భరించనుంది. ఇలా రవాణా ఖర్చులు, పన్నుల రూపేణా ప్రభుత్వానికి ఏడాదికి రూ.12 కోట్ల భార పడనుంది. ఇలా అమూల్ కు జగన్ రెడ్డి రూపాయికి రూపాయి దోచి పెడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: చిరంజీవి-రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో భేటీ.....

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంటికి నెట్ ఫ్లిక్స్ (Netflix) కో-సీఈఓ టెడ్ సరాండొస్ (Ted Sarandos) విచ్చేశారు. ఇందుకు...

Animal: పేరులోనే ‘వంగా’ ఉంది.. విమర్శలకు వంగుతాడా?: హరీశ్ శంకర్

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal)...

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

రాజకీయం

TS Ministers: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు.. శాఖలు

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళిసై కొత్త ప్రభుత్వం...

రేవంత్ రెడ్డి వైసీపీ మనిషా.? టీడీపీ మనిషా.?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్...

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.!

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేశారు కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.! గతంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా...

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ఎక్కువ చదివినవి

హై నాన్న… వీళిద్దరి పాత్రలూ కీలకమేనట!

న్యాచురల్ స్టార్ నాని నటించిన హై నాన్న చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను కొత్త దర్శకుడు శౌర్యువ్ డైరెక్ట్ చేయగా మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఇక కీలకమైన కూతురి...

Cyclone Michaung: దూసుకొస్తున్న తుపాను..! భారీ నుంచి అతిభారీ వర్షాలు

Cyclone Michaung: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన మిగ్ జాం (Cyclone Michaung) తుపాను తీవ్రంగా మారుతోంది. మంగళవారం మధ్యాహ్నంలోగా నెల్లూరు-మచిలీపట్నం మధ్య కృష్ణా జిల్లాలోని దివిసీమలో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ...

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి.! వాట్ నెక్స్‌ట్.!

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఇంకేమన్నా వుందా.? వెంటనే, కేసీయార్ జైలుకు పోవాల్సిందే.! తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ముందర జరిగిన ప్రచారం ఇది. అసలు రేవంత్ గెలిస్తే కదా, ముఖ్యమంత్రి అయ్యేది.? కాంగ్రెస్...

Atlee: ‘జవాన్’కు అరుదైన గౌరవం.. సంతోషంగా ఉందంటూ అట్లీ పోస్ట్

Atlee: తమిళ దర్శకుడు అట్లీ (Atlee) దర్శకత్వంలో షారుఖ్ ఖాన్ (Sharukh Khan) నటించిన జవాన్ (Jawan) బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లతో రికార్డు క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడీ సినిమాకు...

అక్క పాత్రలో నయన్… కేవలం భర్త కోసమే!

నయనతార సినిమా ప్రయాణం ఇప్పటికీ సాఫీగా సాగిపోతోంది. రీసెంట్ గానే షారుఖ్ ఖాన్ వంటి బడా బాలీవుడ్ స్టార్ హీరో సరసన నటించి హిట్ అందుకుంది. జవాన్ హిందీలో పలు రికార్డులను తిరగరాసింది...