Switch to English

డిసెంబర్ లో ‘ఘంటసాల ది గ్రేట్’ బయోపిక్ విడుదల

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,710FansLike
57,764FollowersFollow

అమర గాయకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు జీవిత కథ ఆధారంగా రూపొందిన చిత్రం ‘ఘంటసాల ది గ్రేట్’. టైటిల్‌ పాత్రలో యువ గాయకుడు కృష్ణ చైతన్య, ఆయన భార్య సావిత్రి పాత్రలో మృదుల నటించారు. అన్యుక్తరామ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌‌ పతాకంపై శ్రీమతి ఫణి నిర్మాతగా, గాయకుడు జి.వి భాస్కర్‌ నిర్మాణ సారధ్యంలో ఈ చిత్రం తెరకెక్కింది. ‘ఘంటసాల పాటశాల’ సంకలన కర్త సి.హెచ్‌. రామారావు దర్శకత్వం వహించారు. షూటింగ్‌ తదితర కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్‌లో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రం పోస్టర్‌ను ఫిల్మ్‌ చాంబర్‌లో ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ ఆవిష్కరించారు.

ప్రముఖ నిర్మాత సి. కల్యాణ్‌ మాట్లాడుతూ ‘‘ఘంటసాల అనగానే మనందరి ఒళ్లు పులకరిస్తుంది. మన నరనరాన ఆయన పేరు ఉండిపోయింది. అలాంటి గొప్ప వ్యక్తి కథతో, ఘంటసాలగారి మీద ఉన్న అభిమానంతో దర్శకుడు రామారావు ఈ ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నానికి నిర్మాతలు చక్కని సహకారం అందించారు. ఘంటసాల గారి మీద మనకున్న అభిమానాన్ని చూపించాలంటే ఈ సినిమాను సూపర్‌హిట్‌ చేయాలని ఫిల్మ్‌ ఇండస్ట్రీ తరఫున ప్రేక్షకులు అందరినీ కోరుతున్నా. టైటిల్‌ పాత్ర పోషించిన గాయకుడు కృష్ణ చైతన్యకు మంచి భవిష్యత్తు ఉండాలని ఆశిస్తున్నా’’ అని అన్నారు.

తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి అధ్యక్షుడు కె.ఎల్‌. దామోదర్ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ మధ్యకాలంలో చాలా బయోపిక్‌లు వస్తున్నాయి. అసలు తీయాల్సింది ఘంటసాల గారిది. లేట్‌ అయినా గానీ మంచి ప్రయత్నం చేశారు. చరిత్రను ఈ జనరేషన్‌ తెలియజేయడం చాలా అవసరం’’ అని అన్నారు.

నిర్మాతల మండలి కోశాధికారి తుమ్మలపల్లి రామసత్యనారాయణ మాట్లాడుతూ ‘‘సినిమా తీయడం ఎంతో కష్టం. బయోపిక్‌ అంటే మరీ కష్టం. అప్పటి స్మృతులను ఎంతో జాగ్రత్తగా తెరకెక్కించాలి. రామారావుగారు ఆ విషయంలో వంద శాతం న్యాయం చేశారు. నేనూ ఈ చిత్రంలో ఓ మంచి పాత్ర పోషించా. ఇది మనందరి సినిమా. ఫిల్మ్‌ ఇండస్ట్రీ సినిమా ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు మంచి అత్యధిక సంఖ్యలో థియేటర్లు ఇచ్చి సహకరించాలి. మేం కూడా ఆ దిఽశగా సాయం అందిస్తాం’’ అని చెప్పారు.

నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్న కుమార్‌ మాట్లాడుతూ ‘‘ఘంటసాలగారి పాట భూమి, ఆకాశాలు ఉన్నంతకాలం చిరస్థాయిగా గుర్తుండిపోతుంది. ఆయన భౌతికంగా లేకపోయిన ఆయన పాటలు ప్రపంచం మొత్తం మార్మోగుతూనే ఉంటాయి. భావితరాలకు ఆయన చరిత్ర తెలియ చెప్పాల్సిన బాధ్యత మనపై ఉంది. ఆయన చరిత్రను పుస్తకాల్లో సిలబస్‌గా ఉంచడం ప్రభుత్వాల బాధ్యత. ఘంటసాల గారికి రావల్సిన గుర్తింపు చాలా ఉంది’’ అని అన్నారు.

ఘంటసాల పాత్రధారి కృష్ణచైతన్య మాట్లాడుతూ ‘‘ఘంటసాల పాత్ర పోషించడం ఓ గాయకుడిగా నాకు దక్కిన అదృష్టంగా భావిస్తున్నా. ప్రపంచానికి ఆయన గాయకుడిగానే తెలుసు. ఆయన ఎదుగుదలలో ఎదురైన ఆటుపోట్లు, ఆయన గురించి తెలియని ఎన్నో విషయాలు ఎన్నో ఈ చిత్రంలో ఉన్నాయి’’ అని తెలిపారు.

చిత్ర నిర్మాణ సారథి జి.వి. భాస్కర్‌ మాట్లాడుతూ ‘‘2018లో ఈ సినిమా టీజర్‌ను ఎస్‌.పి.బాలుగారి చేత విడుదల చేయించి ఎంతో పేరు సంపాదించాం. తదుపరి పలు కారణాల వల్ల ఘంటసాల కుటుంబంతో లీగల్‌గా చిన్నచిన్న సమస్యలొచ్చాయి. అవన్నీ ఇప్పుడు తొలగిపోయి ఆయన కుటుంబం నుంచి మంచి సపోర్ట్‌ లభిస్తోంది. ఈ సినిమా విషయంలో లక్ష్మీ ప్రసాద్‌, మాధవపెద్ది సురేష్‌గారు అందించిన సహకారం మరువలేనిది. త్వరలో ప్రమోషన్‌ స్టార్ట్‌ చేసి సినిమాను విడుదల చేస్తాం’’ అని అన్నారు.

చిత్ర సమర్పకులు లక్ష్మీ ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ప్రపంచవ్యాప్తంగా ఘంటసాలగారికి అభిమానులున్నారు. ఈ సినిమా పెద్ద స్థాయిలో జనాలకు చేరువవుతుంది. ఈ సినిమా సక్సెస్‌ విషయంలో ఎలాంటి అనుమానం లేదు. లీగల్‌ సమస్యల వల్ల సినిమా డిలే అయింది. ఇప్పుడు అలాంటి సమస్యలేమీ లేవు’’ అని అన్నారు.

చిత్ర దర్శకుడు సిహెచ్ రామారావు మాట్లాడుతూ ”దర్శకుడిగా నా మొదటి చిత్రమిది. నేను అభిమానించే ఘంటసాల గారి జీవిత కథతో సినిమా తీసే అవకాశం రావడం నా అదృష్టం. ఆయన పేరు చెబితే గుర్తొచ్చేది పాట. మహాగాయకులు అంటే అన్నమయ్య, రామదాసు, ఒక ఘంటసాల అని భావిస్తుంటారు. అన్నమయ్య, రామదాసులపై రాఘవేంద్రరావుగారు సినిమాలు తీశారు. మూడో వ్యకి ఘంటసాలగారిపై సినిమా తీసే అవకాశం నాకు దక్కింది. ఘంటసాల పాట అంటే అందరికీ ఇష్టమే కానీ ఆ పాట కోసం ఆయన ఎంత కష్టపడ్డారో చాలామందికి తెలీదు. అలాంటి ఎన్నో విషయాలను ఈ చిత్రంలో చూపించనున్నాం. గాయకుడి కన్నా ఆయన వ్యక్తిగతంగా ఎంతో మంచి మనిషి. ఆయన జీవితంతో ఎంత పోరాటం చేశారో.. ఈ సినిమా ప్రయాణంలో నేనూ అంతే కష్టపడ్డా. మా టీమ్‌ అందరి కృషితో సినిమా విడుదల వరకూ వచ్చాం. డిసెంబర్‌లో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం. ఘంటసాలగా కృష్ణ చైతన్య కరెక్ట్‌గా సరిపోయాడని ఎస్‌పి బాలుగారు చెప్పారు. అదే మా తొలి సక్సెస్‌గా భావిస్తున్నాం’’ అని అన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Ram Charan: చిరంజీవి-రామ్ చరణ్ తో నెట్ ఫ్లిక్స్ కో-సీఈవో భేటీ.....

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) ఇంటికి నెట్ ఫ్లిక్స్ (Netflix) కో-సీఈఓ టెడ్ సరాండొస్ (Ted Sarandos) విచ్చేశారు. ఇందుకు...

Animal: పేరులోనే ‘వంగా’ ఉంది.. విమర్శలకు వంగుతాడా?: హరీశ్ శంకర్

Animal: రణబీర్ కపూర్ (Ranabir Kapoor) – రష్మిక (Rashmika) జంటగా సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో తెరకెక్కిన ‘యానిమల్’ (Animal)...

హాయ్ నాన్న మూవీ రివ్యూ – పర్వాలేదనిపించే ఎమోషనల్ డ్రామా

న్యాచురల్ స్టార్ నాని, సీతారామం ఫేమ్ మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన హాయ్ నాన్న మూవీ ఈరోజే విడుదలైంది. తండ్రి, కూతురు మధ్య వచ్చే...

బిగ్ బాస్ అంటేనే డ్రామా.! ఎవరూ సీరియస్‌గా తీసుకోవద్దు.!

పేరుకే అది రియాల్టీ షో.! ఫైనల్‌గా అదో ఆట. రింగు మాస్టారి పేరు బిగ్ బాస్.! హౌస్‌లో ఆడే ఆటగాళ్ళని జంతువులని అనలేంగానీ, అంతేనేమో.. అలాగే...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో...

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్...

రాజకీయం

TS Ministers: సీఎం రేవంత్ రెడ్డి క్యాబినెట్ లో మంత్రులు.. శాఖలు

TS Ministers: తెలంగాణ (Telangana) రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎ.రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నేడు బాధ్యతలు చేపట్టారు. రాష్ట్ర గవర్నర్ హోదాలో తమిళిసై కొత్త ప్రభుత్వం...

రేవంత్ రెడ్డి వైసీపీ మనిషా.? టీడీపీ మనిషా.?

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి మనిషి.? ఈ విషయమై తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. రేవంత్ ‘రెడ్డి’ గనుక, వైసీపీ మనిషేనట.! ‘మా రెడ్డి..’ అంటూ వైసీపీ శ్రేణులు, రేవంత్...

తెలంగాణ కొత్త ముఖ్యమంత్రి: ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.!

ఎనుముల రేవంత్ రెడ్డి అనే నేను.. అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేసేశారు కాంగ్రెస్ నేత, తెలంగాణ పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి.! గతంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతగా...

BRS: బీఆర్ఎస్ మాస్టర్ ప్లాన్.! రేవంత్ రెడ్డికి ఝలక్ తప్పదా.?

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 64 సీట్లని గెలిచి, అధికార...

వైసీపీ స్థాయి వందకి పడిపోయిందేంటి చెప్మా.!

‘మేమే మళ్ళీ అధికారంలోకి వస్తాం.. ఈసారి, 151 కాదు.. ఏకంగా 175 కొట్టబోతున్నాం..’ అంటూ వైసీపీ అధినాయకత్వం పదే ప్రకటనలు చేసేస్తోన్న సంగతి తెలిసిందే. ‘వై నాట్ 175’ అనే నినాదంతో, రకరకాల...

ఎక్కువ చదివినవి

Daily Horoscope: రాశి ఫలాలు: బుధవారం 06 డిసెంబర్ 2023

పంచాంగం శ్రీ శోభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరత్ఋతువు కార్తీకమాసం సూర్యోదయం: ఉ.6:21 సూర్యాస్తమయం: సా.5:21 ని.లకు తిథి: కార్తీక బహుళ నవమి రా.12:48 ని.వరకు తదుపరి కార్తీక బహుళ దశమి సంస్కృతవారం: సౌమ్య వాసరః (బుధవారం) నక్షత్రము: ఉత్తర తె.5:11...

Pushpa Actor Arrest: మహిళ ఆత్మహత్య.. ‘పుష్ప’ నటుడు అరెస్టు

Pushpa Actor Arrest: పుష్ప (Pushpa) లో అల్లు అర్జున్ (Allu Arjun) కి స్నేహితుడిగా నటించి మంచి పేరు తెచ్చుకున్న నటుడు జగదీశ్ (కేశవ). ప్రస్తుతం ఆయనపై పంజాగుట్ట పోలిస్ స్టేషన్లో...

Prashanth Neel: ‘Ntr’తో మూవీపై ప్రశాంత్ నీల్ కామెంట్స్.. జోష్ లో ఫ్యాన్స్

Prashanth Neel: ఎన్టీఆర్ (Jr Ntr) తో తీయబోయే సినిమా, కేజీఎఫ్-3 (KGF 3) గురించి ఆసక్తికరమైన అప్డేట్స్ ఇచ్చారు ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ (Prashanth Neel) . ప్రస్తుతం ఆయన...

Hi Nanna : నాని VS నితిన్‌.. ప్రీ రిలీజ్ లో పై చేయి ఎవరిది?

Hi Nanna : క్రిస్మస్‌ కి రావాలి అనుకున్న నాని హాయ్‌ నాన్న మరియు నితిన్‌ ఎక్స్‌ట్రా ఆర్డినరీ సినిమాలు సలార్‌ కారణంగా రెండు వారాలు ముందుగానే అంటే ఈ వారంలో ప్రేక్షకుల...

నేరము.! వ్యక్తిగతము.! ఇది వైసీపీ రాజ్యాంగము.!

అమెరికాలో ఓ ఎన్నారై, తన బంధువు అయిన ఓ వ్యక్తి మీద వేధింపులకు పాల్పడ్డాడు.! ఇండియాలోలా కుదరదు కదా.! అక్కడ, ‘వేధింపులకు పాల్పడిన’ వ్యక్తిని అరెస్టు చేసి, లోపలేశారు.! వాడి నుంచి, బాధితుడికి...