Switch to English

దేశంలో బీజేపీయేతర డబుల్ ఇంజిన్ ప్రభుత్వం రావాలి.. మేమే తెస్తాం: కేసీఆర్

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

‘కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం పోవాలి.. తప్పకుండా భాజపాయేతర డబుల్‌ ఇంజిన్‌ ప్రభుత్వం రావాల్సి ఉంది. చేతగాని కేంద్ర ప్రభుత్వాన్ని ఖచ్చితంగా మారుస్తాం. దేశాన్ని బీజేపీ జలగలాగా పట్టి పీడిస్తోంది. మోదీ అవివేక, అసమర్థ పాలన కొనసాగిస్తున్నారు. దేశంలో కొత్త పార్టీ రావద్దా? అవసరమైతే తెరాస జాతీయ పార్టీగా మారుతుంది. దేశంలో అద్భుత ప్రగతికి శ్రీకారం చుట్టాల. మీ తప్పులను పార్లమెంట్‌లో ప్రస్తావించి ప్రజలకు వివరిస్తాం. తప్పకుండా మిమ్మల్ని దోషులగా నిలబెడతాం’ అని ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ విరుచుకుపడ్డారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేంద్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.

పిచ్చోళ్లా పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం..

భారతదేశంలో కురిసే వర్ష పాతం లక్షా 40వేల టీఎంసీలు. నదుల నుంచి మనం తీసుకునే అవకాశమున్న నీరు 70వేల టీఎంసీలు.. ఇందులో మనం తీసుకుంటున్నది కేవలం 22వేల టీఎంసీలు మాత్రమే. 6వేల టీఎంసీల సామర్థ్యమున్న రిజర్వాయర్‌ జింబాబ్వేలో ఉంది. తెలంగాణలో మాదిరిగా గొప్ప ప్రాజెక్టు కట్టుకోలేమా? భారతదేశ భూమి విస్తీర్ణం 83 కోట్ల ఎకరాలు. ప్రపంచంలో ఏ దేశానికీ లేని అడ్వాంటేజ్‌ భారత్‌కు ఉంది. 40 కోట్ల ఎకరాల భూమి వ్యవసాయానికి అనుకూలంగా ఉంది. కేంద్రం అసమర్థ విధానాల కారణంగా పిచ్చి ముఖాలు వేసుకుని మెక్‌ డొనాల్డ్‌ పిజ్జాలు, బర్గర్లు తింటున్నాం. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా మోదీ హయాంలో రూపాయి విలువ పతనమైంది. తెలంగాణలో జరిగే అభివృద్ధిలో 10శాతమైనా భాజపా పాలిత రాష్ట్రాల్లో జరుగుతుందా?

మీకు తెలీకుండా జరుగుతోందా..

‘గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.400 నుంచి రూ.1200లకు పెంచారు. మేకిన్‌ ఇండియా.. అనేది అట్టర్‌ ఫ్లాప్‌ పథకం. దీపావళి టపాసులు, పతంగులు, జాతీయ  పతాకాలు, గణపతి విగ్రహాలు చైనా నుంచి వస్తున్నాయి. దేశంలో 38శాతం పరిశ్రమలు మూతపడిన విషయం వాస్తవం కాదా? ఇదేనా మేకిన్‌ ఇండియ అంటే? ఎల్ఐసీని అమ్మనీయం. దేశ ఆర్థిక భవిష్యత్తును మోదీ సర్వనాశనం చేస్తున్నారు. మోదీకి తెలియకుండా బ్యాంకు లూటీలు జరగట్లేదు. బ్యాంకులను దోపిడీ చేసిన వారిని వెనక్కి రప్పించలేకపోతున్నారు. మోదీ గారూ.. బ్యాంకు దొంగల్ని మీ ఈడీలు, సీబీఐలు పట్టుకోవా? వాళ్లను పట్టుకోవట్లేంటే మీరు కూడా భాగస్వామ్యమే.

మీరు ముందస్తుకు వెళ్తే అసెంబ్లీని రద్దు చేస్తా

‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టే ఉద్దేశం లేదు. బీజేపీ ముందస్తు ఎన్నికలకు వస్తే.. నేను కూడా అసెంబ్లీని రద్దు చేస్తా. తేదీ ఖరారు చేస్తే అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకెళ్తా. రాష్ట్రంలో బీజేపీ, కాంగ్రెస్‌కు ముందస్తుకు వెళ్లే ధైర్యం ఉందా? మున్ముందు ఏక్‌నాథ్‌ శిందేలే ఏకుమేకవుతారు. మాతో పెట్టుకుంటే అగ్గితో గోక్కున్నట్టే. నువ్వు గోక్కున్నా గోక్కోక పోయినా.. నేను మాత్రం గోకుతూనే ఉంటా? తన ఒత్తిడితో శ్రీలంకలో ప్రాజెక్టు ఒకటి ఆయన స్నేహితుడికే ఇప్పించారు. చరిత్రలో ఏ ప్రధాని ఇలా చేయలేదు. భారత ప్రధాని పట్ల శ్రీలంకలో నిరసనలు తెలుపుతున్నారు. నా మాదిరిగానే గుజరాత్‌లో మోదీ సీఎంగా పని చేశారు. గోల్‌మాల్‌ చేసి ప్రధాని అయ్యారు. తెలంగాణకు మోదీ చేసిందేమీ లేకోపోయినా దేశానికి తెలంగాణ ఆదర్శంగా నిలుస్తోంది.

కట్టప్పలా.. కాకరకాయా..?

బీజేపీ నేతలకు అహంకారం పెరిగింది. మొత్తం 119 స్థానాల్లో 110 సీట్లున్న చోట ఏక్‌నాథ్‌ శిందే వస్తారా? నుపుర్‌ శర్మ వ్యాఖ్యలతో విదేశాల్లో భారత రాయబారిని నిలదీస్తే క్షమాపణ చెప్పారు. బీజేపీ అసమర్థ విధానాలతో భారత్‌ పరువుపోతోంది. సుప్రీంకోర్టు లక్ష్మణరేఖ దాటిందని రిటైర్డ్ జడ్జిలతో లేఖ రాయిస్తారా? సీఎంలు న్యాయమూర్తులను బెదిరిస్తున్నారు. కట్టప్పలా.. కాకరకాయా..? కట్టప్పలు, ఏక్‌నాథ్‌ శిందే.. ఇలాంటి కుక్కమూతి పిందెలా రాష్ట్రానికి కావాల్సింది..? ఏక్‌నాథ్‌ శిందే వచ్చి మహారాష్ట్రలో 20శాతం విద్యుత్‌ ఛార్జీలు పెంచారు. మీ వల్ల ఏమవుతుంది.. మన్నూ మశానం తప్ప. ఏక్‌నాథ్‌ శిందేలను సృష్టిస్తామని చెబుతున్నారు. దమ్ముంటే తెలంగాణ, తమిళనాడులో ఏక్‌నాథ్‌ శిందేలను తీసుకురండి.

డబుల్ ఇంజిన్ మేమే తెస్తాం

‘భారత్‌కు చైనా అత్యంత ప్రమాదకారి. భారత్‌ – చైనా సరిహద్దు ప్రయోగశాల కాదని ప్రయోగాలతో దేశానికి ముప్పని మాజీ లెఫ్ట్‌నెంట్‌ జనరల్స్‌ చెప్పారు. పూర్తిస్థాయి సైనికుడిగా మారాలంటే ఏడేళ్లు పడుతుంది. మీరేమో 4ఏళ్లకే పంపించేస్తామంటున్నారు. ఇదేనా మీ దేశభక్తి. వర్షాలకు కాశీ ఘాట్‌లో ప్రధాన గోపురం కూలిపోయి దేశానికి అరిష్టమని ప్రజలు బాధపడుతుంటే మీరు మత విద్వేషాలు రెచ్చగొట్టి ఓట్లు దండుకుంటున్నారు. దేశంలో ఉన్న 52 శాతం యువత ఏటా కోటి 30లక్షల ఉద్యోగాలు కోల్పోతున్నారు. అందుకే కేంద్రంలోని ప్రభుత్వం మారాలంటున్నాం. తప్పకుండా మారుస్తాం. డబుల్‌ ఇంజిన్‌ సర్కారు అంటున్న మోదీని అభినందిస్తున్నా. తెలంగాణ సర్కారు ఇంజిన్‌ స్పీడ్‌గా ఉన్నట్టే కేంద్రంలో కూడా స్పీడ్‌గా ఉన్న ప్రభుత్వం రావాలి’ అని అన్నారు.

3 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా అబ్దుల్లా

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో విడుదలవుతున్న సినమాపై ఫరియా తన అనుభవాలు...

‘సాక్షి’ పత్రికని బలవంతంగా అంటగడుతున్నారెందుకు.?

సాక్షి పత్రికని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఉచితంగా పంచి పెడుతున్నారట.! ఈనాడు, ఆంధ్ర జ్యోతి పత్రికలదీ అదే పరిస్థితి అట.! అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో, ఆంధ్ర ప్రదేశ్‌లో ఈ ‘ఉచిత...

Allari Naresh: అల్లరి నరేశ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’.. ఫన్ గ్యారంటీ: నిర్మాత రాజీవ్

Allari Naresh: చాన్నాళ్ల తర్వాత తన మార్కు కామెడీతో అల్లరి నరేష్ (Allari Naresh) నటించిన లేటెస్ట్ మూవీ 'ఆ ఒక్కటీ అడక్కు' (A. మల్లి అంకం దర్శకుడిగా పరిచయమవుతున్న సినిమాను రాజీవ్...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...