Switch to English

సినిమా రివ్యూ : మేరా భారత్ మహాన్

91,429FansLike
56,274FollowersFollow

నటీనటులు : అఖిల్ కార్తీక్, ప్రియాంక శర్మ, శ్రీధర్ రాజు, గిరిబాబు, బాబు మోహన్, తనికెళ్ళ భరణి, ఎల్ బి శ్రీరామ్, ఆమని తదితరులు .
బ్యానర్ : ప్రత ప్రొడక్షన్స్
సంగీతం : లలిత్ సురేష్
డైలాగ్స్ : ఎర్రం శెట్టి సాయి
కెమెరా : ముజిర్ మాలిక్
ఎడిటింగ్ : మేనగ శ్రీను
దర్శకత్వం : భరత్
నిర్మాతలు : డా. శ్రీధర రాజు, డా. తాళ్ల రవి, డా. పల్లవి రెడ్డి

సమాజంలో జరుగుతోన్న అన్యాయాలను, అక్రమాలను ఎత్తిచూపే కథాంశాలతో ప్రేక్షకుల్లో మార్పు తేవాలని కోరుకునే ప్రయత్నంలో చాలా సినిమాలు వచ్చాయి. ఎన్ని సినిమాలు వచ్చినా జరిగే అన్యాయాలు మాత్రం ఆగడం లేదు. అయినా జనాల్లో చైతన్యం తేవడానికి మరోసారి నిర్మాత శ్రీధర్ రాజు తన స్నేహితులతో కలిసి చేసిన ప్రయత్నమే మేరా భారత్ మహాన్. ట్రైలర్ తో ఆకట్టుకున్న ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి ఈ శుక్రవారం ఈ సినిమా విడుదలైంది. మేరా భారత్ మహాన్ అంటూ వీళ్ళు చేసిన ప్రయత్నం ఏమిటో తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే ..

కథ :

మహాన్ ( శ్రీధర్ రాజు ) తన జీవితంలో జరిగిన అన్యాయాలకు తన కుటుంబాన్ని మొత్తం కోల్పోతాడు. దాంతో తనకు జరిగినటువంటి అన్యాయాలు ఇంకెవ్వరికి జరగకూడదనే ఉద్దేశంతో మేరా భారత్ మహాన్ ( ఎం బి ఎం ) అనే సంస్థను స్థాపిస్తాడు. ప్రజల జీవితాలతో చెలగాటం ఆడుతున్న కార్పొరేట్ వ్యవస్థను సమూలంగా నాశనం చేయడమే ద్యేయంగా పెట్టుకుంటాడు. మహాన్ ఆశయాలకు యువత సపోర్ట్ తోడవుతుంది. ఈ సంస్థలో కీలక సభ్యుడిగా ఉన్న తనికెళ్ళ భరణి వీరిని ఎప్పుడూ ముందుకు కదిలేలా మోటివేట్ చేస్తుంటాడు. అదే సంస్థలో వాలైంటర్ గా ఉన్న కార్తీక్( అఖిల్ కార్తీక్ ) సంజిత ( ప్రియాంక శర్మ ) ఒకరికొకరు చిన్నప్పుడే తెలుసు. ఎందుకంటే ఒకేఊరిలో కలిసి చదువుకున్నారు. పైగా ఒకరి పై ఒకరికి ప్రేమ ఉంటుంది. ఓ వైపు ప్రేమాయణం సాగిస్తున్న వీరిద్దరూ మరో వైపు ఎం బి ఎం కార్యకలాపాలను నిర్వహిస్తుంటారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రి మీటింగ్ లో ఓ బాంబు బ్లాస్ట్ ప్లాన్ చేస్తారు. అది అనుకోకుండా టార్గెట్ దగ్గర కాకుండా టీమ్ చేతిలోనే పేలుతుంది. దాంతో చాలా మంది టీమ్ సభ్యులు మరణిస్తారు. అసలు ఈ బాంబు బ్లాస్ట్ చేసి ముఖ్యమంత్రిని ఎందుకు చంపడానికి ప్లాన్ చేస్తారు. అసలు వీళ్ళ ఉద్దేశం ఏమిటి ? కార్పొరేట్స్ పై ఉన్న కోపాన్ని మహాన్ ఇలా ఎందుకు తీర్చుకోవాలనుకున్నాడు ? మరి ఈ పోరాటంలో హీరో, హీరోయిన్లు ఒక్కటయ్యారా? లేదా అన్నది మిగతా కథ.

నటీనటుల ప్రతిభ :

కార్తీక్ ( అఖిల్ కార్తీక్ ) హీరోగా మంచి నటన కనబరిచాడు. తన లైఫ్ లో జరిగే విషయాలపై పోరాటం చేస్తూ హీరోయిజాన్ని చూపించాడు. ఇక హీరోయిన్ సంచిత ( ప్రియాంక శర్మ ) నటన, చలాకీతనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. ముఖ్యంగా గ్లామర్ పాత్రలో సూపర్ అనిపించుకుంది. ఇక మహాన్ గా లీడ్ రోల్ పోషించిన శ్రీధర్ రాజు పాత్ర చాలా బాగుంది. శ్రీ శ్రీ డైలాగ్స్ తో సమాజంలో జరుగుతున్న అన్యాయాలను, జనాలు ఎలా బతుకుతున్నారు అన్న విషయాలను చాలా చక్కగా చూపించి శభాష్ అనిపించాడు. ప్రస్తుతం విద్య, వ్యవసాయం, వైద్యం, ఇలా అన్ని కార్పొరేట్ మాయలో పడి కొట్టుకుపోతూ సామాన్య జనాలను అనాథలుగా మిగులుస్తున్నాయని చూపించే ప్రయత్నం మెచ్చుకోవలసిందే. రైతుల ఆత్మహత్యలకు కారణాలు, విద్యార్థుల సూసైడ్స్ ల గురించి చాలా మంచి మెసేజ్ ఇచ్చారు. ఉద్యోగాల కోసం తిరుగుతున్న అందమైన అమ్మాయిలను కొందరు కేటుగాళ్లు ఎలా మాయలో పడేస్తారు, ఉద్యోగాలు దొరక్క యువత ఎలా చెడు మార్గాల్లో పడుతున్నారన్న విషయాలపై మంచి అవగాహన పెంచారు. గిరిబాబు, బాబు మోహన్ లు కామెడీ పండించే ప్రయత్నం బాగుంది. అమల పాత్ర కొంతసేపే అయినా ఆ పాత్ర ఆకట్టుకుంటుంది. ఇక మిగతా పాత్రల్లో ఎవరికీ వారు బాగానే చేసారు.

టెక్నీకల్ హైలెట్స్ :

ఈ సినిమాకు టెక్నీకల్ విషయంలో ముందుగా చెప్పుకోవలసింది కథ గురించి. కమర్షియల్ సినిమా తీసి నాలుగు డబ్బులు వెనకేసుకుందామన్న ఆలోచన పక్కన పెట్టి సమాజానికి మంచి మెసేజ్ అందించాలన్న ఆలోచన ఉన్న శ్రీధర్ రాజు ప్రయత్నం గొప్పది. ఎర్ర వీరుడి పాత్ర శైలిలో సాగే మహాన్ పాత్రకు కొత్త టచప్ ఇచ్చి ఆకట్టుకునేలా చేసారు. అయితే అతను పలికిన డైలాగ్స్ .. డబ్బింగ్ కు కాస్త లిప్ సింక్ కుదరలేదు. నిర్మాతలు కూడా ఎక్కడ రాజీ పడలేదు. ఇక మ్యూజిక్ డైరెక్టర్ లలిత్ సురేష్ ఇచ్చిన పాటలు కథను నడిపించేలా ఉన్నాయి. అయితే కొన్ని పాటలు ఇంకాస్త ఇంపాక్ట్ ఇచ్చేలా వుంది ఉంటే బాగుండేది. ఎడిటింగ్ విషయంలో చెప్పుకోవలసింది ఏమీలేదు. ఉన్నంతలో చక్కగా ట్రిమ్ చేసాడు. ఇక కెమెరామన్ ముజిర్ మాలిక్ ఫోటోగ్రఫి సూపర్. అతను ఎక్కువగా డ్రోన్ షాట్స్ వాడడం కాస్త కథకు కొత్త లుక్ ని తెచ్చిపెట్టింది. ఇక ఎర్రం శెట్టి సాయి అందించిన మాటలు బాగున్నాయి. నేటి సమాజంలో జరుగుతోన్న సంఘటనలను కళ్ళకు కట్టినట్టు చూపించాడు దర్శకుడు భరత్. కథ విషయంలో ఇంకాస్త వర్క్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే సన్నివేశాల పొంతన అంతగా కుదరలేదు. కాస్త కన్ఫ్యూజన్ గా అనిపిస్తుంది.

విశ్లేషణ :

సమకాలీన సమస్యలను, సమాజంలో సామాన్యుడు ఎదుర్కొంటున్న సవాళ్ళను కథగా మలచి కమర్షియల్ యాంగిల్ లో తెరకెక్కిన ఈ చిత్రం మంచి ప్రయత్నం. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పథకాలు, వాటివల్ల కార్పొరేట్స్ ఎంతటి లాభాలు పొందుతున్నారన్న విషయాలు చక్కగా చూపించే ప్రయత్నం చేసాడు. మాటలు బాగున్నాయి. కథ విషయంలో ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది. నేటి కార్పొరేట్ సంస్థలు ప్రజలను ఎలాంటి ఇబ్బందులకు గురి చేస్తుంది, కార్పొరేట్ కల్చర్ వల్ల రైతులు, విద్యార్థులు, యువత ఎలా సఫర్ అవుతున్నారు అన్న విషయాలు బాగా చూపించారు. సినిమాకు సంగీతం ప్రధాన ఆకర్షణ, ఎడిటింగ్ ఉన్నంతలో బాగుంది. ఇక నిర్మాత శ్రీధర్ రాజు ప్రయత్నాన్ని అభినందించాల్సిందే.

ట్యాగ్ లైన్ : అభినందించాల్సిన ప్రయత్నం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

‘నవాబ్’ మూవీ కోసం 12 ఎకరాల్లో డంప్ యార్డ్ సెట్

ముఖేష్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా నవాబ్. ఈ చిత్రంలో రామ రాజ్, మురళీ శర్మ, రాహుల్ దేవ్, శ్రవణ్ రాఘవేంద్ర,...

‘లెహరాయి’ నుండి “బేబీ ఒసేయ్ బేబీ” పాట విడుదల

బెక్కం వేణుగోపాల్ సమర్పణలో ఎస్ ఎల్ ఎస్ మూవీస్ నిర్మాణ సంస్ణ లో రంజిత్, సౌమ్య మీనన్ హీరో హీరోయిన్స్ గా, ధ‌ర్మ‌పురి ఫేం గగన్...

అందం కోసం బుట్టబొమ్మ సర్జరీపై క్లారిటీ

హీరోయిన్ పూజా హెగ్డే తన అందాన్ని పెంచుకోవడం కోసం ఇటీవల ముక్కు సర్జరీ చేయించుకుంది అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగిన విషయం...

బాబోయ్‌ రష్మిక మరీ అంత పెంచేసిందా?

నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుసగా బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే. సౌత్ లో కొన్ని ఆఫర్స్ ని ఈమె కాదన్నట్లుగా...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి...

రాజకీయం

గులాబీ రాజకీయం.! జాతీయ తెలుగు పార్టీ దిశగా.!

ఇంతలోనే ఎంత మార్పు.? నిజానికి, ఈ మార్పు మంచిదే.! తెలుగు తల్లి ఎవనికి తల్లి.? అని ప్రశ్నించిన తెలంగాణ రాష్ట్ర సమితి, ఇప్పుడు ‘తెలుగు పార్టీ, జాతీయ రాజకీయాల్లో సత్తా చాటబోతోంది..’ అని...

అమరావతి రైతుల పాదయాత్ర: మంత్రుల బెదిరింపులు.! జనం బేఖాతర్.!

రాజధాని అమరావతి విషయంలో మంత్రులు బెదిరింపులకు దిగుతున్నారు. జనాన్ని రెచ్చగొడుతున్నారు. అమరావతి నుంచి అరసవెల్లికి జరుగుతున్న మహా పాదయాత్రను అడ్డుకునేందుకు ప్రభుత్వం స్థాయిలో, పార్టీ స్థాయిలో ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా.. అవి సఫలం...

కేసీయార్ స్కెచ్.! ఆంధ్రప్రదేశ్‌లోనూ టీఆర్ఎస్ పోటీ.?

‘ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలంగాణ రాష్ట్ర సమితి పోటీ చేయాలని అక్కడి ప్రజలు కోరుకుంటున్నారు..’ అని పలు సందర్భాల్లో గులాబీ పార్టీ నేతలు వ్యాఖ్యానించడం చూశాం. ఆ లిస్టులో తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్...

‘జ..గన్’ అంటోన్న రోజా.! ‘గన్..జా’ అంటోన్న టీడీపీ.! అసలేంటి కథ.?

ఆడ పిల్లకి అన్యాయం జరిగితే, గన్ కంటే ముందుగా జగన్ అక్కడ వుంటాడంటూ పదే పదే వైసీపీ నేత రోజా చెప్పడం చూశాం. ఎమ్మెల్యేగా వున్నప్పటినుంచీ ఆమె ఇవే మాటలు చెబుతూ వస్తున్నారు....

మొగల్తూరు రాజకీయం.! ప్రభాస్, చిరంజీవి.. అసహనం వ్యక్తం చేసిన వేళ.!

‘మరీ ఇంత నీఛానికి దిగజారుతారా.?’ అన్న చర్చ సినీ పరిశ్రమలో చాలామంది ప్రముఖుల మధ్య జరుగుతోంది. సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి, దివంగత కృష్ణంరాజు సంస్మరణ కార్యక్రమం ఆయన సొంతూరులో నిర్వహించిన...

ఎక్కువ చదివినవి

తన తల్లి అంటే మహేష్ కు ఎంత ఇష్టమో…

సూపర్ స్టార్ మహేష్ బాబు తన తల్లి ఇందిరా దేవి మృతి పట్ల తీవ్ర ద్రిగ్బంతి చెందుతున్నారు. మహేష్ తన తల్లి ఇందిరమ్మ ఎంత అటాచ్డ్ అన్నది చాలా మందికి తెలుసు. పలు...

మహేష్ బాబు ఇంట్లో దొంగతనంకు ప్రయత్నం.. సీన్‌ రివర్స్‌

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో ఒరిస్సాకు చెందిన వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించిన సంఘటన కాస్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మంగళవారం రాత్రి పొద్దు పోయిన తర్వాత ఒరిస్సా కు చెందిన కృష్ణ...

బిగ్‌బాస్‌ 6 : ఆ సర్వే టాప్‌ 5 లో శ్రీసత్య

ప్రముఖ జాతీయ మీడియా సంస్థ ఓర్మాక్స్ వారు ప్రతివారం సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అయ్యే సెలబ్రెటీల జాబితాను ప్రకటిస్తూ ఉంటారు. సోషల్‌ మీడియాలో ఎక్కువగా ఎవరి గురించి చర్చించుకుంటున్నారు అనే విషయాన్ని వీరు...

ఒకేసారి రెండు సినిమాలతో పిల్లలమర్రి రవితేజ తెరంగేట్రం.

కళామ తల్లిని నమ్ముకున్నావాళ్ళు ఎప్పుడో ఒకసారి సక్సెస్ కొడతారు. ఆర్టిస్ట్ అవుదామని ఎన్నో కలలతో వచ్చి మోడల్ గా మారి, ప్రొడక్షన్ మేనేజర్ గా ఎన్నో సినిమాలు చేసి ఇప్పుడు ఏకంగా హీరోగా...

బిగ్‌ బాస్ 6 శ్రీహాన్‌ గురించి ఆసక్తికర విషయాలు

తెలుగు బిగ్ బాస్ సీజన్ 6 లో మూడవ కంటెస్టెంట్ గా అడుగు పెట్టిన వ్యక్తి శ్రీహాన్. ఇతడు సినిమాల్లో పెద్దగా నటించింది లేదు.. సీరియల్స్ లో ఎక్కువగా కనిపించింది లేదు.. బుల్లి...