Switch to English

బన్నీ పుట్టిన రోజున మరో గుడ్‌న్యూస్‌

అల్లు అర్జున్‌ 20వ చిత్రం పుష్ప ఫస్ట్‌లుక్‌ నేడు ఆయన బర్త్‌డే సందర్బంగా వచ్చింది. దర్శకుడు సుకుమార్‌ పుష్పలో బన్నీని గతంలో ఎప్పుడు చూడని విధంగా చూపించబోతున్నాడు. లారీ డ్రైవర్‌గా గందపు చెక్కల స్మగ్లర్‌గా అల్లు అర్జున్‌ కనిపించబోతున్నట్లుగా నేడు విడుదలైన రెండు పోస్టర్‌లతో క్లారిటీ ఇచ్చేశారు. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ చిత్రం షూటింగ్‌ ఈ ఏడాది చివరి వరకు పూర్తి చేసి వచ్చే ఏడాది సమ్మర్‌కు సినిమాను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తుంది. ఇక నేడు బన్నీ పుట్టిన రోజు సందర్బంగా మరో గుడ్‌న్యూస్‌ కూడా దిల్‌రాజు చెప్పాడు.

నా పేరు సూర్య తర్వాత అల్లు అర్జున్‌ హీరోగా దిల్‌రాజు బ్యానర్‌లో ‘ఐకాన్‌’ అనే చిత్రం రాబోతుంది అంటూ అధికారిక ప్రకటన వచ్చింది. టైటిల్‌ లోగోను కూడా విడుదల చేశారు. శ్రీరామ్‌ వేణు దర్శకత్వంలో బన్నీ ‘ఐకాన్‌’ ఉంటుందని ప్రకటన వచ్చింది. కాని అల వైకుంఠపురంలో సమయంలో ఐకాన్‌ ను బన్నీ వదిలేశాడు. దిల్‌రాజుతో పారితోషికం విషయంలో రాజీ కుదరక పోవడం వల్ల ప్రాజెక్ట్‌ క్యాన్సిల్‌ అయ్యిందని, అందుకే శ్రీరామ్‌ వేణు ప్రస్తుతం పవన్‌ కళ్యాణ్‌ తో ‘వకీల్‌ సాబ్‌’ తీస్తున్నాడు అంటూ వార్తలు వచ్చాయి.

కాని నేడు బన్నీ బర్త్‌డే సందర్బంగా ఐకాన్‌ పోస్టర్‌ విడుదల చేసి అల్లు అర్జున్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు తెలియజేశారు. గతంలో వచ్చినట్లుగానే ఉన్న ఈ పోస్టర్‌లో చిన్న చిన్న మార్పులు కనిపిస్తున్నాయి. పోస్టర్‌ ఎలా ఉన్నా కూడా ఈ పోస్టర్‌ రాకతో సినిమా ఇంకా లైన్‌లోనే ఉంది, క్యాన్సిల్‌ కాలేదు అనే వార్త మాత్రం వచ్చింది. ఈ ఏడాది చివరి వరకు సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని, వచ్చే దసరాకు సినిమాను ప్రేక్షకుల ముందుకు దిల్‌రాజు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల నుండి టాక్‌ వినిపిస్తుంది.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

టీడీపీకి ఎన్టీఆరే దిక్కు.. కండిషన్స్‌ అప్లయ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ తన తాత స్వర్గీయ నందమూరి తారకరామారావు తరహాలోనే ఖాకీ రంగు దుస్తులు ధరించి, రాజకీయ తెరపై కన్పించాల్సిందేనా.? ఆ సమయం ఆసన్నమయ్యిందా.? అంటే, అవుననే అంటున్నారు టీడీపీలో చాలామంది...

రీమేక్‌ అప్‌డేట్‌ మెగాస్టార్‌ మూవీలో విజయశాంతి

మలయాళ సూపర్‌ హిట్‌ మూవీ లూసీఫర్‌ను తెలుగులో మెగాస్టార్‌ చిరంజీవి రీమేక్‌ చేయబోతున్నట్లుగా చాలా బలంగా వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ విషయాన్ని కొట్టి వేయక పోవడంతో నిజమే అయ్యి ఉంటుందని...

బిగ్‌ బ్రేకింగ్‌: ఏబీ వెంకటేశ్వరరావు సస్పెన్షన్‌ ఎత్తివేత

టీడీపీ హయాంలో ఇంటెలిజెన్స్‌ హెడ్‌గా బాధ్యతలు నిర్వహించిన సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావుకి హైకోర్టు ఊరటనిచ్చింది. వైసీపీ రాజకీయ ఆరోపణల నేపథ్యంలో ఎన్నికల సమయంలోనే ఏబీ వెంకటేశ్వరరావుని కేంద్ర ఎన్నికల సంఘం...

టీటీడీ భూముల అమ్మకంపై వైసీపీ ‘రివర్స్‌ గేర్‌’ వెనుక.!

‘అవి నిరర్ధక ఆస్తులు.. చిన్న చిన్న భూములు కావడంతో అన్యాక్రాంతమవుతున్నాయి.. కబ్జాలనుంచి వాటిని రక్షించడం వీలు కావడంలేదు. ఈ క్రమంలో వాటిని అమ్మి సొమ్ము చేసుకుంటే తప్పేంటి.?’ ఓ మంత్రిగారు చెప్పిన మాట...

మరో విషాదం: ది గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్ హరి కిషన్ ఇకలేరు.!

అలనాటి తెలుగు హీరోలు ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబుల నుంచి చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లతో పాటు నేటి తరం హీరోలైన ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, ప్రభాస్...