Switch to English

మనసున మనసై.. చిరంజీవి – సురేఖ దంపతుల పెళ్లిరోజు నేడు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,460FansLike
57,764FollowersFollow

పెళ్లి.. ఇద్దరు మనుషులను కాదు.. రెండు మనసులను ఒక్కటి చేసేది. వేర్వేరు కుటుంబాల నుంచి వచ్చి ఒక్కటిగా జీవితమంతా ఆనందమయం చేసుకోవాలంటే భార్యభర్తలు ఒకరికొకరు అర్థ చేసుకుని ముందుకెళ్లాలి. అప్పుడే ఆదర్శంగా నిలుస్తారు. మెగాస్టార్ చిరంజీవి – సురేఖ దంపతులు 42 ఏళ్లుగా చేస్తుంది ఇదే. అందుకే చిరంజీవి మాటల్లో ఎప్పుడైనా భార్య ప్రస్తావన వస్తే అగ్రతాంబూలం ఆమెకే ఇస్తారు. చలోక్తులు విసిరినా.. ఆమె ఔన్నత్యం గురించి చెప్పినా చిరంజీవి మోములో ఓ వెలుగు చూడొచ్చు. ఇక భర్త గొప్పదనం గురించి సురేఖ గారి మాటలను కూడా చిరంజీవి మాటల్లోని అంతరార్థం ద్వారా గ్రహించవచ్చు. అన్యోన్య దాంపత్యానికి నిలువెత్తు నిదర్శనంగా ఇంతకంటే ఏం చెప్పగలం. అందుకే మెగాభిమానులకు ఆగస్టు 22 ఎంత పండగో ఫిబ్రవరి 20 కూడా ఒక పండుగ. కారణం.. 42 ఏళ్ల క్రితం అన్నయ్య – వదినమ్మ వివాహ బంధంతో ఒక్కటయింది ఈరోజే కాబట్టి. నేడు చిరంజీవి – సురేఖ దంపతుల పెళ్లిరోజు.

ఒకరికొకరు అర్థం చేసుకుంటూ..

చిరంజీవిది బిజీ షెడ్యుల్. తండ్రి అల్లు రామలింగయ్య నుంచి సినిమా వ్యక్తుల జీవితం ఎంత బిజీగా ఉంటుందో సురేఖ గారికి తెలియంది కాదు. తాను రోజంతా షూటింగ్స్ తో బిజీ అయినా అయిదుగురు తోబుట్టువులు, అత్యంత క్రమశిక్షణ ఉన్న వాతావరణంలో పెరిగిన వ్యక్తిగా కుటుంబాన్ని ఎంత ప్రేమగా చూసుకోవాలో చిరంజీవికీ తెలుసు. అందుకే వీరి దాంపత్యం చిరంజీవి హాస్య చతురతలానే సరదాగా సాగుతోంది. నా కోడలు బంగారం.. అని అంజనాదేవి గారు అన్నా.. మా వదిన మాకు తల్లి అని చిరంజీవి తోబుట్టువులు అన్నా సురేఖగారి ప్రేమ, ఆప్యాయతలు వల్లే. అల్లు వారింటి అల్లుడుగా వెళ్ళడానికి ముందే చిరంజీవి తన స్వభావంతో ఆకట్టుకున్నారు. ఇవే వీరిద్దరి దాంపత్యం ఆదర్శంగా నిలవడానికి కారణమైంది. కుటుంబంపట్ల చిరంజీవి – సురేఖ గారు చూపే ఆప్యాయత ఈరోజుల్లో స్పష్టంగా గమనించవచ్చు. సెలవలు, పండుగలు, పుట్టినరోజులుకి కుటుంబమంతా ఒక్కచోట చేరి అనుబంధాల్ని మరింత బలోపేతం చేసుకోవటం వీరి దాంపత్యంలో కలిసి వేసిన ఒక మంచి అడుగు.

మనసున మనసై.. చిరంజీవి – సురేఖ దంపతుల పెళ్లిరోజు నేడు

అభిమానులకూ పండుగే..

అందుకే కొణిదెల – అల్లు కుటుంబాలకు చిరంజీవి – సురేఖ దంపతుల పెళ్లిరోజు ఎంత పండగో మెగాభిమానులకు కూడా అంతే. చిరంజీవిని అన్నయ్యా.. అని పిలవడంలో ఎంత ఆర్థ్రత ఉంటుందో.. సురేఖ గారిని వదినమ్మా.. అని పిలవడంలోనూ అంతే ఆర్థ్రత ఉంటుంది. అందుకే అన్నా – వదినకు పెళ్లిరోజు శుభాకాంక్షలు చెప్పడంలో ఫిబ్రవరి 19 అర్థరాత్రి నుంచే ఎదురుచూస్తారు. ఆరోజు రానే వచ్చింది. చిరంజీవి – సురేఖ దంపతుల అన్యోన్య దాంపత్యం మరింత ఆనందమయం కావాలని కోరుకుంటూ వారికి పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలియచేస్తోంది ‘ తెలుగు బులెటిన్ ‘.

2 COMMENTS

  1. 575143 663037Delighted for you to discovered this internet site write-up, My group is shopping far more often than not regarding this. This can be at this moment surely what I are already seeking and I own book-marked this specific website online far too, Ill often be keep returning soon enough to look at on your unique weblog post. 455573

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Movie: శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ ప్రొడక్షన్ నెం.1 మూవీ ప్రారంభం

Movie: ప్రస్తుతం ట్రెండ్ కంటెంట్, కాన్సెప్ట్ ఉన్న సినిమాలదే. అలా వచ్చిన సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శ్రీ కమలహాసిని మూవీ...

Samantha: ఈసారి సరికొత్త లుక్.. పుట్టినరోజున ‘సమంత’ కొత్త సినిమా అప్డేట్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) కొన్నాళ్లుగా సినిమాలు చేయడం లేదు. సమంత నుంచి కొత్త సినిమా కబురు కోసం ఆమె అభిమానులు ఎప్పటినుంచో...

Chiranjeevi: లేటెస్ట్ అప్డేట్..! చిరంజీవి ‘విశ్వంభర’ కోసం భారీ సెట్స్..

Chiranjeevi: మెగాస్టార్ (Mega Star) చిరంజీవి (Chiranjeevi) నటిస్తున్న సినిమా ‘విశ్వంభర’. (Vishwambhara) వశిష్ఠ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా యూవీ క్రియేషన్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. చిరంజీవి...

Varun Tej: ‘ప్రజలే పవన్ కల్యాణ్ కుటుంబం..’ జనసేన ప్రచారంలో వరుణ్...

Varun Tej: ఏపీలో ఎన్నికల హీట్ రోజురోజుకీ పెరుగుతోంది. నేతలంతా ప్రచారాలతో హోరెత్తిస్తున్నారు. ఈక్రమంలో బాబాయి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కు మద్దతుగా.. జనసేన...

Faria Abdullah: ఈరోజుల్లో ‘ఆ ఒక్కటీ అడక్కు’ కంటెంట్ అవసరం: ఫరియా...

Faria Abdullah: అల్లరి నరేశ్ (Allari Naresh)-ఫరియా అబ్దుల్లా (Faria Abdullah) హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా ‘ఆ ఒక్కటీ అడక్కు' (Aa Okkati Adakku). త్వరలో...

రాజకీయం

Janasena: ‘జనసేన’కు ఈసీ గుడ్ న్యూస్.. కామన్ సింబల్ గా ‘గ్లాసు’ గుర్తు..

Janasena: జనసేన (Janasena) పార్టీకి కేంద్ర ఎన్నికల కమిషన్ శుభవార్త చెప్పింది. పార్టీకి కామన్ సింబల్ గా ‘గాజు గ్లాస్’ గుర్తు కేటాయించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈమేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్...

వైఎస్ షర్మిల ఎఫెక్ట్: క్రిస్టియన్ ఓట్లు వైసీపీకి దూరమయినట్టేనా.?

వైఎస్ షర్మిల, పదే పదే ‘క్రిస్టియన్’ ప్రస్తావన తీసుకొస్తున్నారు ఎన్నికల ప్రచారంలో. ‘మన మతం..’ అంటూ అన్న వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ‘క్రిస్టియానిటీ’ని గుర్తు చేస్తున్నారామె.! ఇంకోపక్క, వైఎస్ జగన్ మేనత్త...

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

పిఠాపురంలో వరుణ్ తేజ్ ప్రచారంపై వైసీపీ ఏడుపు.!

వైసీపీ కంటే, వైసీపీ పెంచి పోషిస్తోన్న నీలి కూలి మీడియా ఎక్కువ బాధపడిపోతోంది కొన్ని విషయాల్లో. సినీ నటుడు వరుణ్ తేజ్, పిఠాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహిస్తే,...

నవరత్నాలు ప్లస్సు కాదు.. ఇప్పుడు మైనస్.!

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించింది. దీనికి ‘నవరత్నాలు ప్లస్’ అని పేరు పెట్టుకుంది ఆ పార్టీ. రైతులకు రుణ మాఫీ సహా, పలు కీలక అంశాలు కొత్త మేనిఫెస్టోలో వైసీపీ...

ఎక్కువ చదివినవి

ఇన్‌సైడ్ స్టోరీ: తునిలో కూటమికి అలా సెట్టయ్యింది.!

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని తుని నియోజకవర్గం విషయమై నిన్న మొన్నటిదాకా కూటమిలో కొంత గందరగోళం వుండేది. సీట్ల పంపకాల్లో తుని నియోజకవర్గం టీడీపీకి దక్కింది. మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల...

చెల్లెలి చీర రంగు మీద పడి ఏడ్చేవాళ్ళని ఏమనగలం.?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి ఆయన ప్రస్తుతానికి.! ఎన్నికల తర్వాత ఆ పదవి వుంటుందా.? ఊడుతుందా.? అన్నది వేరే చర్చ. ఓ రాజకీయ పార్టీకి అధినేత కూడా.! ఎంత బాధ్యతగా మాట్లాడాలి.? అదీ కుటుంబ...

గ్రౌండ్ రిపోర్ట్: మంగళగిరిలో నారా లోకేష్‌కి సానుకూలమేనా.?

‘ఓడిపోయాడు, నియోజకవర్గం మార్చేస్తాడు..’ అంటూ నారా లోకేష్ గురించి నానా రకాల ప్రచారమూ జరిగింది. 2019 ఎన్నికల్లో నారా లోకేష్ రిస్క్ తీసుకుని మరీ, మంగళగిరి నియోజకవర్గాన్ని ఎంచుకున్నారని టీడీపీ చెబుతుంటుంది. అందులో...

జగన్ విషయంలో కేసీయార్ సెల్ఫ్ గోల్.! కానీ, ఎందుకిలా.?

కేసీయార్ మహా మాటకారి.! వ్యూహాలు రచించడంలో దిట్ట.! తెలంగాణ తొలి ముఖ్యమంత్రి ఆయనే.! వరుసగా రెండు సార్లు ముఖ్యమంత్రి అయిన కేసీయార్, హ్యాట్రిక్ కొట్టలేకపోయారు.. ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బొక్కబోర్లా...

Trivikram: త్రివిక్రమ్ @25..! మనల్ని మనకే పరిచయం చేసే మాటల మాంత్రికుడు..

Trivikram: అక్షరాలు పదాలు.. పదాలు వాక్యాలు.. వాక్యాలు భావులుగా రాయడం రచయితలకు మాత్రమే సాధ్యం. అయితే.. వాటిని ఎంత భావయుక్తంగా రాస్తారనేదే ప్రశ్న. ఎందరో రచయితలు తమ మేధస్సుని రాత రూపంలోకి మలచి...