60లలో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు చంద్రమోహన్. రంగుల రాట్నం చిత్రంతో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు చంద్రమోహన్. ఇక ఆ తర్వాత నుండి వెనుతిరిగి చూడాల్సిన అవసరం లేకుండా పోయింది. అటు హీరోగా, కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అవకాశాలు అందుకుంటూ దూసుకుపోయాడు. హీరోగా 175, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా 900కు పైగా సినిమాలు చేసాడు చంద్రమోహన్.
గత కొంత కాలంగా చంద్రమోహన్ సినిమాలకు దూరంగా ఉంటూ ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతోన్న విషయం తెల్సిందే. ఇటీవలే మళ్ళీ మీడియా ముందుకు వస్తున్నాడు చంద్రమోహన్. అయితే ఒక ఇంటర్వ్యూలో తాను 100 కోట్లు పోగొట్టుకున్నట్లు తెలిపాడు.
“నేను శోభన్ బాబు గారి మాట వినలేదు. అందువల్ల 100 కోట్లకు పైగా పోగొట్టుకున్నాను. కొంపల్లి వద్ద గొల్లపూడి మారుతీరావు గారి మాటలు విని ద్రాక్ష తోట కొన్నాను. కానీ దాన్ని మ్యానేజ్ చేయలేకపోయాను. కొంతమంది కబ్జా చేసారు. కొన్ని గొడవల తర్వాత అమ్మేయాల్సి వచ్చింది,” అని చెప్పుకొచ్చాడు.
602860 370626I was searching for this. Actually refreshing take on the data. Thanks a whole lot. 1496
807928 156077Really instructive and superb structure of articles, now thats user friendly (:. 403125