Switch to English

చంద్రమోహన్ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,562FansLike
57,764FollowersFollow

దివికెగసిన దిగ్గజ కథానాయకుడు, ప్రేక్షకుల హృదయాల్లో ముద్ర వేసుకున్న నటుడు చంద్రమోహన్ సంస్మరణ సభ ఈ రోజు హైదరాబాద్ ఎఫ్ఎన్‌సిసిలో నిర్వహించారు. ఈ నెల 11వ తేదీన ఆయన తిరిగిరాని లోకాలకు వెళ్లారు. 13వ తేదీన అంతిమ సంస్కారాలు నిర్వహించారు. చంద్రమోహన్ సంస్మరణ సభకు పలువురు సినిమా, మీడియా ప్రముఖులు హాజరై… ఆయనతో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.

నిర్మాత, కృష్ణ సోదరులు ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ ”ప్రజలు అందరికీ చంద్ర మోహన్ ఎంత గొప్ప నటులో తెలుసు. వారి కుటుంబ సభ్యులకు మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా” అని అన్నారు.

చంద్రమోహన్ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు: సంస్మరణ సభలో ప్రముఖులు

దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ ”కృష్ణ గారు, చంద్రమోహన్ గారు, ఎన్టీఆర్ గారు 24 గంటలు పని చేసిన రోజులు ఉన్నాయి. వాళ్ళకు సినిమాయే ఫ్యామిలీ. అందరూ మనవాళ్ళు అని కలిసిపోయే మనిషి చంద్రమోహన్” అని అన్నారు.

చంద్రమోహన్ పెద్ద కుమార్తె మధుర మాట్లాడుతూ ”నాన్నగారు ఎప్పుడూ చెప్పిన విషయం హార్డ్ వర్క్ మన బలం అని! ‘ప్రపంచం ఏమన్నా, ఎవరు ఎన్ని విమర్శలు చేసినా… నీ మీద నీకు ఆత్మవిశ్వాసం ఉంటే ఎవరూ నిన్ను ఆపలేరు’ అని చెప్పేవారు. నా జీవితంలో ఫస్ట్ అండ్ లాస్ట్ హీరో నాన్నగారు. ఎప్పుడూ మాతో ఉంటారు. నాకు స్ఫూర్తిగా ఉంటారు. నా దృష్టిలో ఆయన ఎప్పుడూ లివింగ్ లెజెండ్. అందరి హృదయాల్లో ఆయన ఉంటారు” అని అన్నారు.

చంద్రమోహన్ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు: సంస్మరణ సభలో ప్రముఖులు

చంద్రమోహన్ రెండో కుమార్తె మాధవి మాట్లాడుతూ ”నాన్న కర్మయోగి. ఆయన నిర్మాతల ఆరిస్ట్. ఆయనను మనసులో తలుచుకున్న వ్యక్తులు అందరూ మాతో ఉన్నట్లు మేం భావిస్తాం. మాకు ఎంతో మంది ఫోనులు చేశారు. ఆయన ప్రిన్సిపల్స్ ఫాలో కావడం ముఖ్యం. జీవితంలో ఎలా బతకాలో చాలా నేర్పించారు. ఇక్కడికి వచ్చిన సినిమా కుటుంబ సభ్యులు అందరికీ థాంక్స్” అని అన్నారు.

చంద్రమోహన్ మేనల్లుడు, ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ”ఇక్కడికి వచ్చిన అతిథులు అందరికీ మా మావయ్య చంద్రమోహన్ గారు, మా కుటుంబ సభ్యుల తరఫున థాంక్స్. మా అందరికీ మీ బ్లెస్సింగ్స్ ఉంటాయని ఆశిస్తున్నా” అని అన్నారు.

ఎస్పీ చరణ్ మాట్లాడుతూ ”నాకు ఊహ తెలిసిన తర్వాత తెలిసిన యాక్టర్ అంటే అది చంద్రమోహన్ అంకుల్. ఆయన ఎంత గొప్ప స్టార్ అనేది ఊహ వచ్చే వరకు తెలియలేదు. ఆయన నాకు పెదనాన్న కావడం గర్వకారణం. నాన్నగారు, కె. విశ్వనాథ్ గారు, చంద్రమోహన్ అంకుల్ మన మధ్య లేరనేది బాధాకరం” అని అన్నారు.

చంద్రమోహన్ ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచి ఉంటారు: సంస్మరణ సభలో ప్రముఖులు

ఎంపీ రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ ”నేను, శోభన్ బాబు గారు తరచూ కలుస్తూ ఉండేవాళ్ళం. శోభన్ బాబు గారికి చిత్రసీమలో తక్కువ మంది స్నేహితులు ఉన్నారు. వారిలో చంద్రమోహన్ ఒకరు. ఆయన సినిమా గురించి ఎంత మాట్లాడుకున్నా తక్కువే. ఆయనతో విశ్వనాథ్, బాపు గారు అద్భుతమైన సినిమాలు చేశారు. సూపర్ స్టార్ హీరోలకు ఎన్ని హిట్స్ ఉన్నాయో ఆయనకు కూడా అన్ని హిట్స్ ఉన్నాయి. ప్రేక్షకుల హృదయాల్లో ఆయన స్టార్ డమ్ ఎప్పటికీ ఉంటుంది” అని అన్నారు.

చంద్రమోహన్ మనవరాలు చిన్మయి మాట్లాడుతూ ”మేం మద్రాసులో ఉండేవాళ్ళం. నాకు ఆరేడేళ్ళు వచ్చేవరకు ఆయన అంత పెద్ద యాక్టర్ అని నాకు తెలియదు. స్కూల్ కి వచ్చి నన్ను పికప్ చేసుకునేవారు. సరదాగా ఆటలు ఆడేవారు. ఇండిపెండెంట్ గా ఉండాలని ఎప్పుడూ చెప్పేవారు. తాతయ్య గారు నేర్పించిన విలువలు ఎప్పుడూ మాతో ఉంటాయి. ఆయన మమ్మల్ని వదిలి వెళ్లారని అనుకోవడం లేదు. మాతో ఉంటారు” అని భావోద్వేగానికి లోనయ్యారు.

చంద్రమోహన్ మనవరాలు శ్రీకర మాట్లాడుతూ ”తాతయ్య గారితో నాకు ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి. నన్ను, అక్కను ఒళ్ళో కూర్చోబెట్టుకుని కబుర్లు చెప్పేవారు. మాతో పాటు గేమ్స్ ఆడేవారు” అని అన్నారు.

చంద్రమోహన్ సంస్మరణ సభలో దర్శకులు రేలంగి నరసింహారావు, మాధవపెద్ది సురేష్, నిర్మాత ప్రసన్నకుమార్, నటులు & మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ మాదాల రవి నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, తుమ్మలపల్లి రామ సత్యనారాయణ, కొమ్మినేని వెంకటేశ్వరరావు, ఆచంట గోపీనాథ్, జూబ్లీహిల్స్ కార్పొరేటర్ కాజ సూర్యనారాయణ, నవత అచ్చిబాబు, దర్శకులు ఇంద్రగంటి మోహన కృష్ణ, సతీష్ వేగేశ్న, హరీష్ , పార్లమెంట్ సభ్యుడు రఘురామ కృష్ణంరాజు, గౌతంరాజు, రమ్యశ్రీ, వంశీ రామరాజు, జ్యోతి వలబోజు, ఆకెళ్ళ రాఘవేంద్ర, జర్నలిస్టులు ప్రభు, నాగేంద్రకుమార్, రెంటాల జయదేవ, ఇందిర పరిమి తదితరులతోపాటు పలువురు చంద్రమోహన్ కుటుంబ సభ్యులు, సినిమా పరిశ్రమలో చంద్రమోహన్ ఆప్తులు, పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సంస్మరణ కార్యక్రమంలో పాల్గొన్నారు.

11 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

“రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి” ట్రైలర్ విడుదల

ఈ తరం ప్రేక్షకులకు ఈ సినిమా కొత్త అనుభూతిని కలిగిస్తుందని చిత్ర బృందం ముందునుంచి చెబుతున్నట్టుగానే "రాజుగారి అమ్మాయి నాయుడుగారి అబ్బాయి" ట్రైలర్ ఎంతో వైవిధ్యంగా...

Gautham Menon: ధృవ నక్షత్రం విషయంలో మనశ్శాంతి లేదు: గౌతమ్ మేనన్...

Gautham Menon: విక్రమ్ (Vikram) హీరోగా ప్రముఖ స్టార్ డైరక్టర్ గౌతమ్ మేనన్ (Gautham Menon) దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ధృవ నక్షత్రం’ (Dhruva Nakshatram)....

Gaganyaan: ‘గగన్ యాన్ వ్యోమగామి నా భర్త..’ గర్వంగా ఉందన్న హీరోయిన్

Gaganyaan: భారత్ ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన తొలి మానవసహిత అంతరిక్షయాత్ర 'గగన్ యాన్' (Gaganyaan) కు సర్వం సిద్ధమవుతోంది. యాత్రకు ఎంపికైన నలుగురు వ్యోమగాముల పేర్లను ప్రధాని...

Rana Daggubati: ఆ అవయువాలు దానం చేసి నా గురించి అడగండి:...

Rana Daggubati: ‘నా ఆరోగ్యం గురించి ఎవరికైనా అడగాలనుంటే ముందు మీ కన్ను, కిడ్నీ దానం చేసే ఆలోచన ఉంటేనే అడగండి.. లేదంటే అవసరం లేద’న్నారు...

Radisson: డ్రగ్స్ కేసులో దర్శకుడు క్రిష్ పేరు..! పోలీసులు ఏమన్నారంటే..

Radisson: సంచలనం రేపుతున్న రాడిసన్ (Radisson) హోటల్ డ్రగ్స్ కేసులో సినీ దర్శకుడు క్రిష్ (Krish) పేరు వార్తల్లోకి రావడం తీవ్ర చర్చనీయాంశమైంది. ఇప్పటికే ఈ...

రాజకీయం

జనసేనాని పవన్ కళ్యాణ్ పవర్ పంచ్: నువ్వే నా పెళ్ళాం.! రా జగన్.!

అయిపోయింది.! ఈ మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎప్పుడో అనేయొచ్చు. కానీ, ఆగారు.. ఆలోచించారు.! చివరికి, అనేయక తప్పలేదు.! పవన్ కళ్యాణ్ అన్నారనడం కాదు, ఆ మాట అనిపించుకున్నారు వైఎస్సార్ కాంగ్రెస్...

వాలంటీర్లనే నమ్ముకున్న వైసీపీ.! మునుగుతుందా.? తేలుతుందా.?

వాలంటీర్లతో దున్నేద్దాం.. ఈ మాట దాదాపు అందరు వైసీపీ నేతల నోటి నుంచీ వినిపిస్తోంది. ప్రజలతో వైసీపీకి అనుకూలంగా ఓట్లేయించే బాధ్యత పూర్తిగా వాలంటీర్లదేనని వైసీపీ నేతలు అంటున్నారు. ‘వైసీపీకి ఓటెయ్యించకపోయారో.. మీ...

జనసేనానికి ఉచిత సలహాలు.! ‘స్పేస్’లతో ప్రయోజనమేంటి.?

అప్పటిదాకా జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి వీరాభిమానులు.! కాదు కాదు, ఆ ముసుగులో పార్టీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నట్లు బిల్డప్.! సమయం చూసి, వెన్నుపోటు పొడవడం.! ఒకప్పుడు చిరంజీవికి ఎదురైన పరిస్థితులే ఇప్పుడు...

మహిళా నేతని పరిగెత్తించి కొడతానన్న మంత్రి.! ఏపీ పోలీస్.. మీరెక్కడ.?

రాజకీయం మరీ ఇంతలా దిగజారిపోతుందా.? ఏ కాలంలో వున్నారు మీరంతా.? ఆల్రెడీ దిగజారిపోయింది. ఆడా లేదు, మగా లేదు.. సిగ్గు లేకుండా తిట్టుకుంటున్నారు రాజకీయ నాయకులు. ప్రజలకు సేవ చేస్తామని రాజకీయాల్లోకి వచ్చి,...

అదేంటి బండ్ల గణేషా.. మంత్రి రోజా మీద అంత ‘నింద’ వేసేశావ్.?

డైమండ్ రాణి.. ఈ సెటైర్ తొలిసారిగా వేసింది జనసేన అధినేత పవన్ కళ్యాణ్. వైసీపీ నేత, సినీ నటి, మంత్రి కూడా అయిన నగిరి ఎమ్మెల్యే రోజా మీద రాజకీయ విమర్శలో భాగంగా...

ఎక్కువ చదివినవి

TDP-Janasena: టీడీపీ-జనసేన తొలి ఉమ్మడి జాబితా విడుదల

TDP-Janasena: త్వరలో ఆంధ్రప్రదేశ్ లో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయబోయే టీడీపీ-జనసేన అభ్యర్ధుల తొలి జాబితా విడుదలైంది. ఒక వేదికపై నుంచే టీడీపీ (Tdp) అధినేత చంద్రబాబునాయుడు (Chandrababu Naidu), జనసేన...

Mohan Babu: ‘నా పేరు వాడితే చర్యలు తప్పవు’.. మోహన్ బాబు సీరియస్

Mohan Babu: ‘ఇటివల కొందరు నా పేరు రాజకీయంగా ఉపయోగించుకుంటున్నారు. అటువంటి చర్యలను ఇకపై ఉపేక్షించను. న్యాయపరమైన చర్యలు తీసుకంటా’నని నటుడు, నిర్మాత మంచు మోహన్ బాబు అన్నారు. ఈమేరకు ఎక్స్ వేదికగా...

అవమానాల్ని దాటుకుని.. జనసేన భవిష్యత్ ప్రయాణమెలా.?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి బలం అభిమానులు.. బలహీనత కూడా అభిమానులే.! ఫలానా వ్యక్తిని పార్టీలోకి తీసుకుంటే తప్పు.! ఫలానా వ్యక్తి పార్టీలోంచి వెళ్ళిపోతే తప్పు.! ఫలానా రాజకీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటే...

Sai Dharam Tej: సాయిధరమ్ తేజ్ మంచి మనసు.. ఒక్క మెసేజ్ తో సాయం

Sai Dharam Tej: సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ (Sai Dharam Tej) సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ.. ఏ హీరో సినిమా రిలీజైనా శుభాకాంక్షలు తెలియజేస్తూంటారు. అవసరమైన వారికి...

Suriya: ‘రామ్ చరణ్ తో నటిస్తా..’ తమిళ స్టార్ హీరో సూర్య కామెంట్స్

Suriya: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) కెరీర్ ను ‘రంగస్థలం’కు ముందు ఆ తర్వాతగా చెప్పాల్సిందే. మెగాభిమానులే కాదు.. ప్రేక్షకులతోపాటు ఎంతోమంది సెలబ్రిటీలు రామ్ చరణ్ యాక్టింగ్ కు...