Sreeleela : పెళ్లి సందడి సినిమా తో టాలీవుడ్ లో అడుగు పెట్టిన శ్రీలీల తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ రేంజ్ స్టార్ డమ్ ను దక్కించుకున్న విషయం తెల్సిందే. మొదటి సినిమా ఫ్లాప్ అయినా కూడా ధమాకా సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుని వరుసగా ఆఫర్లు దక్కించుకుంటూ ఉంది. ప్రస్తుతం ఆమె చేతిలో దాదాపు పది సినిమాలు ఉన్నాయట.
ఇటీవలే భగవంత్ కేసరి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ అమ్మడు రేపు వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన ఆదికేశవ సినిమా తో రాబోతున్న విషయం తెల్సిందే. స్కంద సినిమా నిరాశ పరిచినా కూడా భగవంత్ కేసరి సినిమా తో నటిగా నిరూపించుకుంది. శ్రీలీల లక్ కంటిన్యూ అయ్యి ఆదికేశవ సినిమా కూడా హిట్ అవ్వబోతుంది అంటూ చాలా మంది నమ్మకంగా ఉన్నారు.
ఈ సినిమా ను శ్రీకాంత్ ఎన్ రెడ్డి దర్శకత్వం లో సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్ లో నాగ వంశీ నిర్మించాడు. ఈ సినిమా లో వైష్ణవ్ మరియు శ్రీలీల మధ్య రొమాన్స్ కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందని అంటున్నారు. ఈ సినిమా హిట్ అయితే శ్రీలీల క్రేజ్ మరింతగా పెరగడం ఖాయం అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.