Switch to English

ప్చ్.. బాబు వ్యూహం బెడసికొట్టిందా?

విశాఖలో విషవాయువు లీక్ బాధితుల్ని పరామర్శించేందుకు వైజాగ్ వెళ్లాలనుకున్న టీడీపీ అధినేత చంద్రబాబు ప్రయత్నాలు ఫలించలేదు. తాను విశాఖ వెళ్లేందుకు అనుమతించాలంటూ ప్రధాని కార్యాలయ ముఖ్య కార్యదర్శికి గురువారం ఉదయం బాబు లేఖ రాసినా అక్కడ నుంచి ఎలాంటి స్పందనా రాలేదు. దీంతో ఆయన విశాఖ వెళ్లలేకపోయారు. లాక్ డౌన్ ప్రకటనకు ముందు హైదరాబాద్ వచ్చి అక్కడే ఉండిపోయిన చంద్రబాబు.. కరోనా నేపథ్యంలో సమీక్షలు, సమావేశాలు, ఎంపిక చేసిన మీడియా సంస్థల జర్నలిస్టులతో ఆన్ లైన్ ప్రెస్ మీట్లు పెడుతూ బిజీగా గడుపుతున్నారు.

అయితే, విశాఖలో గ్యాస్ లీక్ ప్రమాదం జరిగిందని తెలియగానే అక్కడకు వెళ్లి బాధితులను పరామర్శించాలని, ప్రభుత్వ చర్యలను సమీక్షించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే ఓ విమానం సమకూర్చుకున్నారు. అది ముంబైలో ఉంది. ఆ విమానం ముంబై నుంచి హైదరాబాద్ కు, అక్కడ నుంచి వైజాగ్ వెళ్లేందుకు, తిరిగి అదే విధంగా వెనక్కి వెళ్లేందుకు కేంద్రాన్ని అనుమతి కోరారు. కానీ సాయంత్రమైనా అక్కడ నుంచి ఎలాంటి జవాబూ రాలేదు. ఈలోగా స్థానిక పోలీసులు, నేవీ, ఎన్డీఆర్ఎఫ్ సకాలంలో స్పందించి వందలాది మందిని రక్షించాయి. మరోవైపు సీఎం జగన్ అక్కడకు వెళ్లి వారిని పరామర్శించి, నష్టపరిహారం ప్రకటించడంతో విషయం కొంత చల్లారింది.

గతంలో రాజధానిగా విశాఖ వద్దు, అమరావతి మాత్రమే ఉండాలని బాబు గట్టిగా పట్టుబట్టి ఉండటంతో టీడీపీకి చెందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా పార్టీతో విభేధించారు. అప్పటి నుంచీ వైజాగ్ వాసులు చంద్రబాబుపై ఆగ్రహంగా ఉన్నారనేది అందరికీ విదితమే. కానీ ఈ నేపథ్యంలో గ్యాస్ లీక్ బాధితులను పరామర్శించేందుకు వెళ్లడం ద్వారా విశాఖ ప్రజల ఆదరాభిమానాలను తిరిగా పొందాలని బాబు భావించినట్టు తెలుస్తోంది. కానీ కేంద్రం నుంచి అందుకు అనుమతి రాకపోవడంతో బాబు వ్యూహం బెడిసికొట్టింది. కరోనా కారణంగా ఒకసారి మోదీ నుంచి కాల్ రాగానే అంతా సెట్ అయిపోయిందని భావించాడు కానీ బాబుకి కేంద్రం నుంచి నిరాశే మిగిలింది.

సినిమా

దేవరకొండ తర్వాత దగ్గుబాటితో ఖరారు?

ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రంతో మళ్లీ ఫామ్‌లోకి వచ్చిన దర్శకుడు పూరి జగన్నాద్‌ ప్రస్తుతం విజయ్‌ దేవరకొండతో భారీ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ను తెరకెక్కిస్తున్నాడు. పాన్‌ ఇండియా మూవీగా...

పుకార్లన్నింటికి చెక్‌ పెట్టేందుకు పెళ్లి

బాలీవుడ్‌ హీరోయిన్స్‌ ఇద్దరు ముగ్గురిని ప్రేమించడం ఆ తర్వాత బ్రేకప్‌ అవ్వడం చాలా కామన్‌ విషయాలు. అయితే సౌత్‌ లో మాత్రం హీరోయిన్స్‌ ఎక్కువ లవ్‌...

ఎట్టకేలకు తిరుమలేషుడి దర్శన భాగ్యం

కరోనా వైరస్‌ వ్యాప్తి నిరోధంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం విధించిన లాక్‌ డౌన్‌ కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లోకి భక్తులను అనుమతించని విషయం తెల్సిందే....

ప్రభాస్‌20 ఫస్ట్‌లుక్‌కు అంతా రెడీ

యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ సాహో చిత్రం విడుదలకు ముందు ప్రారంభం అయిన రాధాకృష్ణ మూవీ ఇంకా విడుదల కాలేదు. విడుదల సంగతి అలా ఉంచి...

కోటీశ్వరులు అయిన ఈ స్టార్స్‌ ఫస్ట్‌ రెమ్యూనరేషన్‌ ఎంతో తెలుసా?

ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ కోట్లు సంపాదిస్తున్న స్టార్స్‌ ఒకప్పుడు కనీసం తిండికి కూడా ఇబ్బందులు పడ్డ సందర్బాలు చాలానే ఉన్నాయి. వాటిని ఆయా స్టార్స్‌ చెబుతున్న...

రాజకీయం

ఫ్లాష్ న్యూస్: శ్రీశైలం మల్లన్న అక్రమార్కులను పట్టేసిన పోలీసులు

ఏపీలోని ప్రముఖ శైవ క్షేత్రం అయిన శ్రీశైలం మల్లన్న ఆలయంలో అధికారులు మరియు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు కుమ్మక్కు అయ్యి స్వామి వారి ఆదాయంను భారీగా దోచుకున్నారు అంటూ కొన్ని రోజుల క్రితం...

మద్యం అక్రమ రవాణాతో వారికి సైడ్ బిజినెస్

ఏపీలో దొరికే మద్యం బ్రాండ్లలో ఎక్కువగా పేరున్నవి లేకపోవడంతో తెలంగాణలో దొరికే మద్యానికి ఫుల్ డిమాండ్ ఏర్పడింది. దీంతో అక్రమ మద్యం తరలింపు ఎక్కువవుతోంది. తెలంగాణ నుంచి తెచ్చే ఒక్కో ఫుల్‌ బాటిల్‌ను...

రామాయణాన్ని వక్రీకరించారంటూ టీటీడీపై విమర్శలు

హిందువుల మనోభావాలకు టీటీడీ లాంటి ధార్మిక సంస్థ చాలా జాగ్రత్రగా ఉండాలి. టీటీడీ నుంచి వచ్చే సప్తగిరి మాసపత్రికలో జరిగిన పొరపాటు ఇప్పుడు టీటీడీని వివాదాల్లోకి నెడుతోంది. టీటీడీ నుంచి ప్రతి నెలా...

మీడియాకి అలర్ట్: మీడియాపై కేసులు పెట్టే టీంని రంగంలోకి దింపిన వైసీపీ వైసీపీ

ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరాధారమైన, వాస్తవ విరుద్ధమైన, తప్పుడు కథనాలు ప్రచురించినా.. ప్రసారం చేసినా సదరు మీడియా సంస్థలపై కేసులు పెట్టే అధికారాన్ని ఆయా శాఖల అధిపతులకు కట్టబెడుతూ జగన్ సర్కారు జీవో నెం.2430...

ఏపీలో తెరపైకి కొత్త ఎస్ఈసీ?

ఏపీలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నియామక వ్యవహారం కొత్త మలుపులు తిరుగుతోంది. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ఎస్ఈసీగా నియమించకూడదనే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం సాగుతోంది. హైకోర్టు తీర్పును సవాల్...

ఎక్కువ చదివినవి

కరోనాకి అన్ లాక్.. కేసులు పైపైకి..!

కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి దేశవ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కాలంలో కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గలేదు. జాన్ బీ.. జహాన్ బీ అనే నినాదంతో ఆర్థిక వ్యవస్థను కాపాడుకునేందుకు లాక్ డౌన్...

తాప్సీ ఇంట్లో విషాదం.. ఓదారుస్తున్న అభిమానులు.!

తెలుగు సినిమాల్లో తన గ్లామర్ తో నటనతో ఆకట్టుకున్న నటి తాప్పీ. పంజాబ్ కు చెందిన ఈ ముద్దుగుమ్మ ఝుమ్మంది నాదం సనిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఇటీవల తెలుగులో తన హవా...

మిడతల దండుతో విమానాలకూ ప్రమాదమే.. ఎలాగంటే

కరోనాతో దేశం ఎదుర్కొంటున్న సమస్యలు సరిపోలేదన్నట్టు ఇప్పుడు మరో కొత్త సమస్య భయపెడుతోంది. దేశం యావత్తూ చర్చనీయాంశమైన ఆ అంశమే ‘మిడతల దండు’. ఇప్పటికే మహారాష్ట్ర, హర్యానా.. వంటి రాష్ట్రాల్లో వీటితో పంట...

హైకోర్టులో షాకుల మీద షాకులు.. ఎందుకిలా?

ఏపీ సర్కారుకు హైకోర్టులో షాకుల మీదు షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటివరకు ఏ ప్రభుత్వానికీ ఇన్ని ఎదురుదెబ్బలు తగల్లేదనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు. జగన్ అధికారం చేపట్టి సరిగ్గా ఏడాది పూర్తయింది. ఈ...

తమిళ, మలయాళ స్టార్స్‌తో తెలుగు మల్టీస్టారర్‌

ఈమద్య కాలంలో మల్టీస్టారర్‌ చిత్రాలు వరుసగా వస్తున్నాయి. మల్టీస్టారర్‌ చిత్రాలకు ఉన్న క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు మేకర్స్‌ ఎక్కువగా మల్టీస్టారర్‌ చిత్రాలను చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుతం జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ అంటూ భారీ...