Switch to English

మళ్లీ మొత్తం మొదటికి..!

దేశవ్యాప్తంగా కరోనా కేసుల విజృంభణ కొనసాగుతూనే ఉంది. తాజాగా మూడు వేలకు పైగా కేసులు 103 మరణాలు సంభవించాయి. ఫలితంగా దేశంలో కరోనా కేసులు 56 వేలు దాటగా.. మరణాలు 1886కి చేరాయి. పరిస్థితి ఇంత తీవ్రంగా ఉన్నప్పటికీ, కేంద్రం ఇచ్చిన సడలింపులు ముప్పును మరింత పెంచేదిగా ఉన్నాయనే అభిప్రాయలు వినిపిస్తున్నాయి. ఈనెల 4 నుంచి మద్యం విక్రయాలకు కూడా కేంద్రం అనుమతి ఇవ్వడంతో రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాయి. పలు రాష్ట్రాల్లో అదే రోజున మద్యం షాపులు ఓపెన్ అయిపోయాయి.

తాజాగా వివిధ రంగాలకు కూడా సడలింపులు ఇవ్వడంతో లాక్ డౌన్ అనేది ఎక్కడా అమలుకావడంలేదు. మద్యం షాపుల ఓపెనింగుతో మొదలైన ఈ వ్యవహారం అంతకంతకూ ముదురుతోంది. పలు రంగాలకు ఇచ్చిన సడలింపులు కారణంగా శుక్రవారం తెలుగు రాష్ట్రాల్లో జనాలు భారీగా రోడ్డెక్కారు. హైదరాబాద్ లో రెడ్ జోన్ లో ఉన్నప్పటికీ, పలు వాహనాలు రోడ్లపై తిరుగుతున్నాయి. సాధారణ సెలవు రోజుల్లో ట్రాఫిక్ ఎలా ఉంటుందో ఇప్పుడు పరిస్థితి అలాగే ఉంది.

అసలే కరోనా పరీక్షలు తక్కువగా జరుగుతున్న తెలంగాణలో ఈ పరిస్థితి ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి హైదరాబాద్ లో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా అమలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పినా.. ఆ దిశగా ఎలాంటి ప్రయత్నాలూ జరగడంలేదు. ఇన్నాళ్లూ ఇళ్లకే పరిమితమైన ప్రజలు ఏదో ఒక సాకుతో రోడ్డు మీదకు వస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నమోదయ్యే కేసులన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోనివే.

ఈ నేపథ్యంలో ఎంతో జాగ్రత్తతో ఉండాల్సిన తరుణంలో ప్రస్తుత పరిస్థితులు అందుకు విరుద్ధంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వమే పలు సడలింపులు ఇచ్చినందును పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం భారతదేశం చాలా కీలకమైన దశలో ఉందని.. కరోనా నియంత్రణకు అత్యంత జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా.. తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఎవరికి వారు జాగ్రత్తలు పాటించడం తప్ప ప్రస్తుతం మరో మార్గం కనిపించడంలేదు. ఎంతో అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొంటున్నారు. ఒకవేళ వచ్చినా.. అన్ని జాగ్రత్తలూ పాటించాలని సూచిస్తున్నారు.

సినిమా

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా...

కంగనా 50 కోట్ల ఆఫీస్‌ ప్రత్యేకతలు చూద్దాం రండి

సినిమా ఆఫీస్‌ లు ఎంత రాయల్‌ గా ఎంతో అహ్లాదకరంగా ఉంటాయి. ప్రతి చోట కూడా క్రియేటివిటీ కలగలిపి ఉంటాయి. అన్ని విధాలుగా కూడా ప్రశాంతతను...

సోను సూద్ ఆచార్య గురించి ఏమంటున్నాడు?

సోను సూద్ అనే పేరుకు టాలీవుడ్ లో పరిచయం అవసరం లేదు. అరుంధతిలో విలన్ గా చేసిన దగ్గరనుండి సోను సూద్ కు తెలుగులో పాపులారిటీ...

బన్నీకి ఇష్టమైన బాలీవుడ్ సినిమాలివే

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ గత కొన్నేళ్లుగా ప్యాన్ ఇండియా సినిమా చేయాలని అనుకుంటున్నాడు. అయితే అందుకు సరైన సందర్భం రావట్లేదు. ఇక ఇప్పుడు అల...

నాని మూవీకి ఎన్ని ఆఫర్స్ వచ్చినా నో అంటున్న దిల్ రాజు.!

టాలీవుడ్ అగ్రనిర్మాతల్లో ఒకరు దిల్ రాజు.. ప్రతి ఏడాది దిల్ రాజు నిర్మాణ సంస్థ నుంచి ఐదారు సినిమాలు విడుదలవుతుంటాయి, అంతే కాకుండా పలు సినిమాల...

రాజకీయం

హైకోర్టుపై వైసీపీ నేతల వ్యాఖ్యలు.. 49 మందికి నోటీసులు!

డాక్టర్‌ సుధాకర్‌ వ్యవహారం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగుల వ్యవహారం... వంటి విషయాలపై న్యాయస్థానం ఇటీవల ప్రభుత్వానికి మొట్టికాయలు వేసిన దరిమిలా, అధికార పార్టీకి చెందిన నేతలు న్యాయస్థానం తీర్పుపై అసహనం వ్యక్తం...

14 వేల మంది సినీకార్మికులకు తలసాని శ్రీనివాస్ యాదవ్ సాయం

రెండు నెల‌లుగా క‌రోనా లాక్ డౌన్ అన్ని పరిశ్ర‌మ‌ల్ని అత‌లాకుతలం చేసిన సంగ‌తి తెలిసిందే. వినోద రంగంపైనా దీని ప్ర‌భావం అంతా ఇంతా కాదు. దేశ‌వ్యాప్తంగా ల‌క్ష‌లాది మంది సినీ-టీవీ కార్మికులు రోడ్డున...

2021కి పోలవరం.. పోతిరెడ్డిపాడుతో ఎవరికీ నష్టం లేదు.. సీఎం జగన్

అమరావతి: ఎగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు ఎక్కువగా కట్టడం వల్ల రాష్ట్రానికి నీరు అందని పరిస్థితి ఉందని.. ఈ సమయంలో రాష్ట్రంలో చేపడుతున్న ప్రాజెక్టులపై వివాదాలు సృష్టించడం తగదని ఏపీ సీఎం జగన్ మోహన్...

హైకోర్టు మొట్టికాయలేస్తే.. టీడీపీని టార్గెట్ చేస్తారెందుకు?

ప్రభుత్వ పాఠశాలల్లోంచి తెలుగు మీడియంని తొలగించి, ఇంగ్లీషు మీడియంని తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ ప్రయత్నానికి న్యాయస్థానం మొట్టికాయలేసింది. దాంతో, రకరకాల మార్గాల్లో తన ఆలోచనను అమలు చేసేందుకు వైఎస్‌...

టీడీపీకి ‘మహా’ షాక్‌: వైసీపీలోకి ‘ఆ’ తెలుగు తమ్ముళ్ళు.?

తెలుగుదేశం పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు, టీడీపీని వీడి వైసీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం ‘మహానాడు’కి ముందే పార్టీ అధినేతకు ఝలక్‌ ఇచ్చేందుకు వైసీపీ...

ఎక్కువ చదివినవి

టిక్ టాక్ అతి : అరెస్టైన నర్స్

టిక్ టాక్ లో పాపులర్ అవ్వడం కోసం కొందరు చేసే పనులు తలుచుకుంటేనే అమ్మో అనిపిస్తుంది. ఏదేమైనా, ఏం చేసినా పాపులర్ కావాలని వాళ్ళు పడే తాపత్రయం వాళ్ళను ఇబ్బందుల్లోకి నెడుతోంది. అయినా...

ఎన్టీఆర్‌ బర్త్‌డే.. నారా లోకేష్‌ రికార్డ్‌.!

యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ పుట్టినరోజునాడు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి, ఎమ్మెల్సీ నారా లోకేష్‌ సరికొత్త రికార్డులు సృష్టించారు.. అదీ సోషల్‌ మీడియాలో. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు...

లాక్‌డౌన్‌తో ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ లో వచ్చే మార్పులపై క్లారిటీ

పలు పెద్ద సినిమాలు కరోనా కారణంగా స్క్రిప్ట్‌లో మార్పులు చేర్పులు చేయడంతో పాటు షూటింగ్స్‌ను రీ షెడ్యూల్‌ చేయడం మరియు లొకేషన్స్‌ విషయంలో మార్పులు చేర్పులు చేయడం కూడా జరుగుతుంది. అలాగే ఆర్‌ఆర్‌ఆర్‌...

ఫ్లాష్ న్యూస్: ఆగి ఉన్న లారీని ఢీ కొట్టిన కారు, ముగ్గురు మృతి

విజయవాడ, హైదరాబాద్‌ జాతీయ రహదారిపై భారీ యాక్సిడెంట్‌ జరిగింది. నల్లగొండ జిల్లా చిట్యాల సమీపంలో రిలయన్స్‌ పెట్రోల్‌ బంక్‌ సమీపంలో ఆగి ఉన్న ధాన్యం లారీని వెనుక నుండి వచ్చి కారు ఢీ...

ఇన్‌సైడ్‌ స్టోరీ: ‘బాబు’లిద్దరూ హైద్రాబాద్‌లో ఇంకెన్నాళ్ళు.!

సోషల్‌ మీడియాలో తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడికి అనుకూలంగా, వ్యతిరేకంగా వేలాది, లక్షలాది పోస్ట్‌లు నిత్యం దర్శనమిస్తున్నాయి. వీటిల్లో మెజార్టీ పోస్ట్‌లు చంద్రబాబుతోపాటు ఆయన తనయుడు గత కొన్నాళ్ళుగా హైద్రాబాద్‌కే పరిమితమవడంపై...