Switch to English

చంద్రబాబుకు తత్వం బోధపడింది

రాజకీయాలు, సినిమా పై ‘వార్త’లు రాయగల ఆసక్తి, టాలెంట్ మీకున్నాయా? [email protected] ని సంప్రదించండి.

90,448FansLike
57,764FollowersFollow

అనుభవం అయితే గానీ తత్వం బోధపడదంటారు. ఈ సామెత ఇప్పుడు టీడీపీ అధినేత చంద్రబాబుకు సరిగ్గా సరిపోతుంది. ఎన్నికల ముందు బీజేపీతో విభేదించి బయటకు రావాలన్న ఆయన నిర్ణయం ఎంత తప్పో ఇప్పటికి తెలుసుకున్నారు. వాస్తవానికి ఎన్నికల సమయంలోనే తెలిసినా.. ఇప్పుడు బయట పడ్డారు. కేంద్రంతో విభేదించి నష్టపోయామని పేర్కొన్నారు. ప్రజలనే నమ్ముకున్నామని, ప్రయోజనం పొందినవారు సహకరించలేదని నిట్టూర్పులు విడిచారు.

వైఎస్ ను ఢీకొట్టి రెండు సార్లు ఓటమి చవిచూసిన చంద్రబాబు.. రాష్ట్ర విభజన నేపథ్యంలో నవ్యాంధ్ర తొలి సీఎంగా పగ్గాలు అందుకున్నారు. కొత్త రాష్ట్రానికి అనుభవంతుడైన నాయకుడు అవసరమని జనం భావించడం.. జగన్ పై కేసులు ఉండటం.. మోదీ హవా ఉన్న సమయంలో తెలివిగా బీజేపీతో జట్టుకట్టడం, రుణమాఫీ హామీ ఇవ్వడంతో 2014 ఎన్నికల్లో బాబుపై ఓట్ల వర్షం కురిసింది. అప్పటివరకు జగన్ గెలుపు ఖాయమని అందరూ అనుకున్నా అనూహ్యంగా చివరి మూడు నెలల్లో సమీకరణాలు మారిపోయి, బాబుకు అనుకూల వాతావరణం ఏర్పడి ఆయన గద్దెనెక్కారు.

అయితే, ఐదేళ్ల పాలనలో వ్యతిరేకత ప్రబలింది. ఇచ్చిన హామీలను సరిగా నెరవేర్చకపోవడం, రాజధాని నిర్మాణంలో అనుసరించిన వైఖరి తదితరాలతో వ్యతిరేక పెరిగింది. ఇది గమనించిన చంద్రబాబు.. నెపాన్ని బీజేపీపైకి నెట్టి తాను తప్పించుకోవాలని చూశారు. అందుకు అనుగుణంగానే కేంద్రంలో బీజేపీ నుంచి బయటకు వచ్చారు. అదే ఆయన తీసుకున్న పొరపాటు నిర్ణయమని ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అర్థమైంది. వాస్తవానికి బీజేపీ నుంచి వీడి రావడం సరైన నిర్ణయం కాదని పార్టీలోని పలువురు సీనియర్లు చెప్పినా చంద్రబాబు వినలేదు.

ప్రత్యేక హోదా ఆకాంక్ష జనాల్లో బలంగా ఉన్నందున బీజేపీ నుంచి బయటకు వచ్చి ఆ పార్టీపై విమర్శలు చేయడం సరైన వ్యూహమని ఆయన భావించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. అయితే, దేశవ్యాప్తంగా మోదీ హవా ఏమాత్రం తగ్గకపోవడం బాబుకు ప్రతికూలంగా మారింది. ఏపీలో బీజేపీపై వ్యతిరేకత ఉన్నా.. అది టీడీపీకి అనుకూలంగా మారలేదు. దీంతో బాబు పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైంది. ఇక్కడ అధికారమూ పోయింది. అక్కడ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో దూరమూ పెరిగిపోయింది. ఆ విషయాలన్నీ విశ్లేషించుకునే ఇప్పుడు ఆయన తీవ్రంగా మథనపడుతున్నారు. అదే విషయాన్ని కార్యకర్తలతో సమావేశంలో చెప్పి బాధపడ్డారు.

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

సినిమా

Sathya : 8 మంది దర్శకుల చేతుల మీదగా ‘సత్య’ ట్రైలర్

Sathya : శివమ్ మీడియా బ్యానర్ నుంచి వస్తున్న తొలి సినిమా ‘సత్య’ ట్రైలర్ ను నేడు 8 మంది దర్శకుల చేతుల మీదుగా విడుదల...

Samantha: దుమారం రేపుతున్న సమంత ఫొటో.. ఆగ్రహంలో ఆమె ఫ్యాన్స్

Samantha: సౌత్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ఇన్ స్టాలో పోస్ట్ ఆమె పోస్ట్ చేసినట్టుగా వైరల్ అవుతున్న ఓ ఫొటో సంచలనాలకు వేదికైంది. నిజానికి...

Rana: రజినీకాంత్ వేట్టయాన్, ప్రభాస్ కల్కిపై రానా దగ్గుబాటి కామెంట్స్ వైరల్

Rana: రజినీకాంత్ (Rajinikanth) హీరోగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachhan) ముఖ్య పాత్రలో వస్తున్న వేట్టయాన్ (Vettaiyan), ప్రభాస్ (Prabhas) హీరోగా అమితాబ్ ముఖ్య పాత్రలో...

Trisha Birthday Special: కెరీర్ @22.. అందం, అభినయంకు C/o అడ్రస్...

Trisha: అందం.. అభినయం.. సినిమాల్లో హీరోయిన్లుగా రాణించేందుకు ఇవి చాలా అవసరం. అందం ఉంటే అభినయం.. అభినయం వస్తే అందం.. కొందరిలో లోటు. కానీ.. ఈ...

Nagarjuna: వైసీపీపై కింగ్ నాగార్జున వేర్వేరు ప్రకటనలు..!? వాస్తవం ఇదీ..

Nagarjuna: ఏపీలో ఎన్నికల (AP assembly elections) సందర్భంగా సినీ పరిశ్రమ, రాజకీయాల్లో.. అజాతశత్రువుగా పేరున్న అక్కినేని నాగార్జున (Nagarjuna)పై తప్పుడు ప్రచారం జరుగుతోంది. వైసీపీకి...

రాజకీయం

Chiranjeevi: పిఠాపురంకు చిరంజీవి ఖాయమే..? బాబును కలిసే అవకాశం..!?

Chiranjeevi: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో కీలక పరిణామాలు జరుగబోతున్నాయా..? ఇప్పటికే వైసీపీ - జనసేన, టీడీపీ,బీజేపీ కూటమి హోరాహోరీ ప్రచారాలు నిర్వహిస్తున్నాయి. ఈక్రమంలో తమ్ముడు పవన్ కోసం అన్నయ్య చిరంజీవి...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

ఆంధ్ర ప్రదేశ్‌లో బీజేపీ గేమ్ మొదలైంది.!

అరాచక పాలనను అంతమొందించేందుకే కూటమి కట్టాం.. అంటూ, కేంద్ర మంత్రి అమిత్ షా నిన్న తాజాగా చేసిన సంచలన వ్యాఖ్యలు, ఆంద్ర ప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్యమైన రీతిలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. మొట్టమొదట ఈ మాట...

Land Titling Act: నేనూ బాధితుడినే.. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్’పై రిటైర్డ్ IAS పోస్ట్

Land Titling Act: ఏపీలో ఓవైపు ఎన్నికల వేళ రాజకీయ వేడి తీవ్రంగా ఉండగా.. మరోవైపు వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై సర్వత్రా ఆందోళన కూడా వ్యక్తమవుతోంది. వైసీపీ...

ఏపీ డీజీపీ బదిలీ దేనికి సంకేతం.?

సరిగ్గా ఎన్నికల ముందర ఆంధ్ర ప్రదేశ్ డీజీపీ బదిలీ హాట్ టాపిక్ అవుతోంది. కేంద్ర ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ మీద వేటు వేసింది. డీజీపీ కసిరెడ్డి రాజేంద్రనాథ్ రెడ్డి వ్యవహార శైలిపై...

ఎక్కువ చదివినవి

గ్రౌండ్ రిపోర్ట్: వంగా గీతకి డిపాజిట్లు కూడా దక్కవా.?

రాజకీయాల్లో ఈక్వేషన్స్ ఎప్పటికప్పుడు మారిపోతుంటాయి. ఓటరు నాడి ఏంటన్నది పసిగట్టడం రాజకీయ పార్టీలకు, నాయకులకు అంత తేలిక కాదు. బంపర్ విక్టరీ సాధిస్తారని సర్వేల్లో తేలితే, ఫలితం అత్యంత దారుణంగా వుండొచ్చు. రాజకీయాల్లో...

Mudragada: ముద్రగడ ఇంట రాజకీయ చిచ్చు.. కుమార్తె వ్యాఖ్యలపై పద్మనాభం స్పందన

Mudragada: మాజీ మంత్రి, వైసీపీ నేత ముద్రగడ పద్మనాభంకు సొంత ఇంటి నుంచే వ్యతిరేకత ఎదురైంది. పవన్ ను ఓడించకపోతే పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్న వ్యాఖ్యలను ఆయన కుమార్తె క్రాంతి ఖండించారు. ఆమె...

Janasena: నిర్మాత ఏఎం.రత్నంకు జనసేన కీలక బాధ్యతలు.. పవన్ కల్యాణ్ నిర్ణయం

Janasena: ఏపీలో ఎన్నికల పర్వం దగ్గరకొస్తోంది. ఈక్రమంలో జనసేన (Janasena) తన ఎన్నికల ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శిగా, ప్రత్యేకించి తిరుపతి నియోజకవర్గానికి నిర్మాత ఏఎం రత్నం (AM Ratnam)ను అధినేత పవన్...

వెబ్‌చారమ్.! చిరంజీవిపై విషం చిమ్మడమేనా పాత్రికేయమ్.?

కొన్ని మీడియా సంస్థలు రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయాయ్.! ఔను, ఇందులో కొత్తదనం ఏమీ లేదు.! కాకపోతే, మీడియా ముసుగులో వెబ్‌చారానికి పాల్పడుతుండడమే అత్యంత హేయం.! ఫలానా పార్టీకి కొమ్ముకాయడం ఈ రోజుల్లో తప్పు...

గాజు గ్లాసు ఫ్రీ సింబల్.! ఎవరికి నష్టం.?

గాజు గ్లాసుని కేవలం జనసేన పార్టీకి కేటాయిస్తూ కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసినట్లుగా ప్రచారం జరిగింది. కానీ, ఇంతలోనే, గాజు గ్లాసు ఫ్రీ సింబల్ అయిపోయింది.! జనసేన పోటీ చేస్తున్న...