‘ఈమాత్రందానికి టీడీపీ అధినేత హోదాలో చంద్రబాబు ఢిల్లీకి వెళ్ళడమెందుకు దండగ.? తాను స్వయంగా వెళ్ళకుండా టీడీపీ నేతల బృందాన్ని ఢిల్లీకి పంపి వుంటే సరిపోయేది కదా.?’ అన్న చర్చ ఇప్పుడు టీడీపీ వర్గాల్లోనే సాగుతోంది.
టీడీపీ అధికార ప్రతినిథి పట్టాభి, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై దూషణలకు దిగిన దరిమిలా, వైసీపీ కార్యకర్తలు ‘బీపీ తెచ్చుకుని’, టీడీపీ కార్యాలయాలపైకి దాడులకు తెగబడ్డారు. పట్టాభి ఇంటిని కూడా ధ్వంసం చేశారు. ఈ విధ్వంసకర రాజకీయాలపై గుస్సా అయిన చంద్రబాబు, 36 గంటల పాటు టీడీపీ రాష్ట్ర కార్యాలయంలో దీక్ష చేసి, ఆ తర్వాత ఢిల్లీకి వెళ్ళారు.
రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించెయ్యాలన్నది చంద్రబాబు డిమాండ్. ఈ మేరకు రాష్ట్రపతిని కలిసి స్వయంగా వినతి పత్రం అందించేశారు చంద్రబాబు. సరే, రాష్ట్రపతి ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారు.? అన్నది వేరే చర్చ. కానీ, ఢిల్లీ పర్యటనలో పాపం చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వ పెద్దలెవర్నీ కలవలేకపోయారు.. అదే ఇప్పుడు టీడీపీ నేతలకు పెద్ద తలనొప్పిగా మారిపోయింది.
కేంద్రంలో అధికారంలో వున్నది బీజేపీ. అలాగని, కేంద్ర మంత్రులు తెలుగుదేశం పార్టీ నేతలకు అపాయింట్మెంట్లు ఇవ్వకూడదా.? అంటే, ఇవ్వకూడదన్న రూల్ అయితే లేదు. కానీ, ఎందుకో ఈసారి చంద్రబాబు పాచిక పారలేదు. ఢిల్లీకి వెళ్ళారుగానీ, కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలవలేకపోయారు.
సహజంగానే ఈ వ్యవహారంపై చంద్రబాబు తీవ్రస్థాయిలో ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కలిస్తే ఒక తలనొప్పి, కలవకపోతే ఇంకో తలనొప్పి. ప్రత్యేక హోదా కోసం వెళ్ళకుండా, పార్టీ కార్యాలయాలపై దాడుల విషయమై ఫిర్యాదు కోసం ఢిల్లీకి పరుగులెట్టారా.? అన్న విమర్శ వస్తుంది గనుక.. చంద్రబాబు తెలివిగా, తప్పించుకున్నారంటూ ఇంకో వాదన తెరపైకొచ్చింది.
ఒక్కటి మాత్రం నిజం.. చంద్రబాబు పలుకుబడి గణనీయంగా తగ్గిపోయింది ఢిల్లీలో. అందుకు చంద్రబాబు తాజా ఢిల్లీ టూర్ నిదర్శనం.
693922 611273I discovered your blog internet site on google and check a couple of of your early posts. Continue to maintain up the really very good operate. I just additional up your RSS feed to my MSN News Reader. Seeking forward to reading a lot more from you later on! 809114
687431 778743I recognize there exists an excellent deal of spam on this blog internet site. Do you want assist cleaning them up? I can assist among courses! 141397
820645 730331Thank you for sharing with us, I believe this internet site genuinely stands out : D. 19579