రూమర్స్ అన్నిటికీ ఒక్క అప్డేట్ తో చెక్ పెట్టేసారు చిరంజీవి చిత్ర నిర్మాతలు. మెహెర్ రమేష్ దర్శకత్వంలో చిరంజీవి సినిమా అనగానే చాలా మంది పెదవి విరిచారు. మెహెర్ రమేష్ ట్రాక్ రికార్డ్ అలాంటిది. అయితే చిరు మాత్రం మెహెర్ పై నమ్మకముంచాడు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా వీరి ప్రాజెక్ట్ అనౌన్స్ అయింది. భోళా శంకర్ టైటిల్ ను కూడా ఫిక్స్ చేసారు.
అయితే ఈ ప్రాజెక్ట్ పై నీలినీడలు కమ్ముకున్నాయి. చిరంజీవి స్క్రిప్ట్ విషయంలో నమ్మకంగా లేడని, అందుకే ఈ ప్రాజెక్ట్ ను పోస్ట్ పోన్ చేస్తున్నాడని అన్నారు. అయితే ఈ రూమర్స్ కు ఇప్పుడు చెక్ పడింది. భోళా శంకర్ ను నవంబర్ 11న ఉదయం 7.45 నిమిషాలకు లాంచ్ చేస్తున్నట్లు తెలిపారు. అలాగే షూటింగ్ నవంబర్ 15 నుండి మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు.
ఏకే ఎంటర్టైన్మెంట్స్, క్రియేటివ్ కమర్షియల్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.