అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప సినిమా వచ్చే నెలలో విడుదల కాబోతుంది. సినిమా ప్రారంభించినప్పటిన ఉండి మొన్నటి వరకు సినిమాను పాన్ ఇండియా లెవల్ లో మొత్తం అయిదు భాషల్లో విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటిస్తూ వచ్చారు. కాని ఇటీవల హిందీ వర్షన్ ను స్కిప్ చేస్తున్నట్లుగా వార్తలు మొదలు అయ్యాయి. హిందీలో పుష్ప ను విడుదల చేయక పోవడంకు కారనం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
ఒక వైపు హిందీని స్కిప్ చేసినట్లుగా యూనిట్ సభ్యులు అధికారికంగా క్లారిటీ ఇచ్చారు. దాంతో ఉత్తరాది అభిమానులతో పాటు ఇక్కడి అభిమానులు అంతా కూడా పుష్ప ను హిందీలో విడుదల చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు. రికార్డు బ్రేకింగ్ వసూళ్లు పుష్ప కు రావాలంటే ఖచ్చితంగా అక్కడ కూడా విడుదల అవ్వాల్సిందే అంటున్నారు. ఉత్తరాదిన బన్నీకి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. వారు అంతా కూడా పుష్ప హిందీ వర్షన్ కావాలంటున్నారు. మేకర్స్ మనసు కరిగే విధంగా ఆన్ లైన్ ద్వారా ఒక ప్రత్యేక హ్యాష్ ట్యాగ్ తో ట్రెండ్ చేసి ఉద్యమం చేయాలనే నిర్ణయానికి వచ్చారు. దీంతో ఏమైనా మనసు మారుతుందా అనేది చూడాలి.
667739 604850Id should verify with you here. Which isnt 1 thing I often do! I get pleasure from reading a put up that will make individuals think. Furthermore, thanks for permitting me to comment! 386301